Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘గోవా సోలార్‌ రూఫ్‌టాప్‌ పోర్టల్’ ద్వారా సౌరశక్తి సద్వినియోగంపై ప్రధానమంత్రి ప్రశంస


   సౌరశక్తి సద్వినియోగంతోపాటు సుస్థిర ప్రగతిని ముందుకు నడిపించే దిశగా గోవా సోలార్‌ రూఫ్‌టాప్‌ పోర్టల్‌ ఏర్పాటు ఓ మంచి ముందడుగని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. నవ్య-పునరుత్పాదకశాఖ, విద్యుత్‌ శాఖల సహకారంతో  గోవాసోలార్‌.ఇన్‌ (goasolar.in) పేరిట ఈ ఆన్‌లైన్‌ పోర్టల్‌ను గోవా ఇంధన అభివృద్ధి సంస్థ (జిఇడిఎ) రూపొందించింది.

దీనిపై గోవా ముఖ్యమంత్రి డాక్టర్‌ ప్రమోద్‌ సావంత్‌ ట్వీట్‌కు ప్రతిస్పందనగా పంపిన సందేశంలో:

“సుస్థిర ప్రగతిని సాధించడంలో భాగంగా సౌరశక్తిని సద్వినియోగం చేసుకోవడంలో ఇదొక మంచి ముందడుగు” అని ప్రధానమంత్రి ప్రశంసించారు.

****

DS/ST