Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గోవా విముక్తి దినోత్సవం ఈరోజే: గోవాకు స్వతంత్రాన్ని సాధించే ఉద్యమంలో పాల్గొన్న మహనీయ మహిళల, పురుషుల ధీరత్వాన్నీ, దృఢ సంకల్పాన్నీ గుర్తుకు తెచ్చుకొందాం: ప్రధానమంత్రి


గోవా విముక్తి దినోత్సవం ఈ రోజు. ఈ సందర్బంగా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. గోవాకు స్వతంత్రాన్ని సాధించడానికి చేపట్టిన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మహనీయ మహిళలు, పురుషులు కనబరిచిన ధైర్య సాహసాలను, దృఢ సంకల్పాన్నీ ఆయన గుర్తుచేసుకొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ ‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘ఈరోజు, గోవా విముక్తి దినోత్సవాన,  గోవాకు స్వతంత్రాన్ని సాధించడానికి చేపట్టిన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మహనీయ మహిళలు, పురుషులు కనబరిచిన ధైర్య సాహసాల్నీ, దృఢ సంకల్పాన్నీ మనం స్మరించుకొందాం. వారు చాటిన పరాక్రమం గోవాకు మేలు చేయడానికి, గోవా రాష్ట్ర ప్రజలకు సౌభాగ్యం కలిగే దిశలో కృషి చేస్తూ ఉండడానికీ మనకు ప్రేరణనిస్తుంది.’’
 

 

***

MJPS/SR