మధ్యప్రదేశ్‌లో జరిగిన ‘గృహ ప్రవేశం’ కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్న్ ద్వారా ప్రసంగించారు. ఇక్కడ 1.75 లక్షల కుటుంబాలకు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (పీఎంఏవై-జీ) కింద పక్కా ఇండ్లను అందజేశారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌లో పీఎంఏవై-జీ లబ్ధిదారులతో శ్రీ నరేంద్ర మోడీ సంభాషించారు. ఈ రోజు తమ కొత్త ఇండ్లలోకి గృహ ప్రవేశం చేస్తున్న 1.75 లక్షల లబ్ధిదారుల కుటుంబాల వారికి తమ కలల ఇల్లు లభించిందని, వారి పిల్లల భవిష్యత్తు పట్ల తగిన భరోసా లభించిందని అన్నారు.
1.75 లక్షల పేద కుటుంబాల జీవితంలో మరపురాని క్షణం గడిచిన ఆరు ఏళ్లలో సొంత ఇల్లు పొందిన 2.25 కోట్ల కుటుంబాల ర్యాంకుల్లో.. ఈ రోజు ఇండ్లను పొందిన లబ్ధిదారులు కూడా చేరారని ఆయన అన్నారు. ఇకపై వీరు అద్దె ఇంట్లోనో లేక మురికివాడలోనో లేదా కుచ్చా ఇంట్లోనో నివసించడం కంటే వారి సొంత ఇండ్లలోనే నివసిస్తారని ప్రధాని తెలిపారు. లబ్ధిదారులకు దీపావళి శుభకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారి వ్యాప్తి లేకుంటే స్వయంగా తానే లబ్ధిదారుల మధ్య ఉంటూ వారి ఆనందాన్ని పంచుకునే వాడినని తెలిపారు. ఈ రోజు 1.75 లక్షల పేద కుటుంబాల జీవితంలో మరపురాని క్షణం మాత్రమే కాదని దేశంలోని ప్రతి నిరాశ్రయులకు పక్కా ఇండ్లను అందించే దిశగా ప్రధాన ముందడుగు అని ప్రధాన మంత్రి మోడీ తెలిపారు. ఇది దేశంలో నిరాశ్రయుల ఆశను బలపరుస్తుండగా.. సరైన వ్యూహంతో, ఉద్దేశ్యంతో ప్రారంభించిన ప్రభుత్వ పథకం లక్షిత లబ్ధిదారులకు ఎలా చేరుతుందో కూడా ఇది రుజువు చేస్తుందని ఆయన అన్నారు.
కరోనా సవాళ్లను ఎదుర్కోంటూ కరోనా కాలంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కోవడమే కాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ పథకం కింద దేశవ్యాప్తంగా 18 లక్షల ఇండ్ల నిర్మాణపు పనులు పూర్తయ్యాయని, వాటిలో 1.75 లక్షలు మధ్యప్రదేశ్‌లోనే పూర్తయ్యాయని ప్రధాని తెలిపారు. పీఎంఏవై-జీ కింద ఇల్లు నిర్మించడానికి సగటున 125 రోజులు పడుతుందని, అయితే ఈ కరోనా కాలంలో ఇది కేవలం 45 నుండి 60 రోజులలో పూర్తయిందని, ఇది ఒక రికార్డు అని ఆయన అన్నారు. కరోనా నేపథ్యంలో నగరాల నుండి తమ గ్రామాలకు వలస వచ్చిన కారణంగా ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. సవాలును అవకాశంగా మార్చడానికి ఇది గొప్ప ఉదాహరణ అని ప్రధాని అన్నారు. ఈ వలస కార్మికులు ప్రధాని గరీబ్ కల్యాణ్ రోజ్గర్ అభియాన్ యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందడం ద్వారా వారి కుటుంబాలను చూసుకున్నారు మరియు అదే సమయంలో వారి పేద సోదరులకు ఇండ్లు నిర్మించడానికి కృషి చేశారు అని ప్రధాన మంత్రి మోడీ అన్నారు.
పీఎం గారిబ్ కల్యాణ్ అభియాన్ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్‌తో సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో సుమారు 23 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు పూర్తికావడం పట్ల ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పథకం కింద, ప్రతి గ్రామంలో పేదల కోసం గృహాలు నిర్మిస్తున్నామని, ప్రతి ఇంటికి నీటి సరఫరా చేసే పనులు జరుగుతున్నాయని, అంగన్వాడీలు, పంచాయతీ భవనాలు నిర్మిస్తున్నామని, పశువుల షెడ్లు, నీటి అవసరాలకు గాను చెరువులు మరియు బావులు మొదలైన పనులు చేపడుతున్నట్టుగా ప్రధాన మంత్రి మోడీ తెలిపారు. దీని వల్ల రెండు ప్రయోజనాలు ఒనగూరాయని ఆయన వివరించారు. ఒకటి, నగరాల నుండి తిరిగి వారి గ్రామాలకు తిరిగి వచ్చిన లక్షలాది మంది వలస కూలీలకు తగిన అర్ధవంతమైన ఉపాధి లభించగా.. రెండవది – ఇటుక, సిమెంట్, ఇసుక మొదలైన నిర్మాణానికి సంబంధించిన పలు వస్తువులు అమ్ముడయ్యాయని ఆయన తెలిపారు. ఈ కష్ట సమయంలో గ్రామ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన మంత్రి గారిబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్ పెద్ద దన్నుగా నిలిచిందని ఆయన అన్నారు.
పారదర్శకతకు పెద్దపీట పేదలకు ఇళ్లు నిర్మించడానికి దశాబ్దాలుగా దేశంలో వివిధ పథకాలను ప్రారంభించినట్లు ప్రధాని చెప్పారు. కానీ గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వడం, కోటి మంది పేదలకు ఇల్లు ఇవ్వడం అనే లక్ష్యాన్ని ఎప్పటికీ సాధించలేకపోయినట్టుగా తెలిపారు. ప్రభుత్వపు అతి జోక్యం, పారదర్శకత లోపం అసలు లబ్ధిదారుడితో సంప్రదింపులు జరపకపోవడంతో తక్కువ నాణ్యత కలిగిన గృహాలు లబ్ధిదారులకు అందినట్టుగా తెలిపారు. గత అనుభవాలను విశ్లేషించిన తర్వాత 2014 లో ఈ పథకాన్ని సవరించామని, దీనిని కొత్త వ్యూహంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంగా ప్రారంభించినట్లు శ్రీ నరేంద్ర మోడీ తెలిపారు. లబ్ధిదారుని ఎంపిక నుండి ఇళ్లను అప్పగించే వరకు మొత్తం విధానం పారదర్శకంగా జరుగుతోందని అన్నారు. అంతకుముందు పేదలు తమ లబ్ధికోసం ప్రభుత్వం చుట్టూ పరుగెత్తాల్సి వచ్చిందని, ఇప్పుడు ప్రభుత్వం ప్రజలను చేరుతోందని ఆయన అన్నారు. ఈ పథకంలో ఎంపిక నుండి తయారీ వరకు తాము శాస్త్రీయ, పారదర్శక పద్ధతులను అవలంభిస్తున్నట్టు చెప్పారు. అంతేకాక స్థానికంగా లభించే మరియు ఉపయోగించిన వస్తువులకు, పదార్థాల నుండి నిర్మాణం వరకు కూడా ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు.
స్థానిక అవసరాలు, శైలికి అనుగుణంగా ఇంటి డిజైన్లను కూడా సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఇల్లు నిర్మాణం యొక్క ప్రతి దశపై పూర్తి పర్యవేక్షణ ఉందని ప్రధాని చెప్పారు. ప్రతి దశ పూర్తయిన తర్వాత వివిధ వాయిదాలలో డబ్బు విడుదల అవుతుందని తెలిపారు. 27 సంక్షేమ పథకాలతో పీఎం ఆవాస్ యోజన అనుసంధానం పేదలకు ఇల్లు రావడం మాత్రమే కాదు, వారికి మరుగుదొడ్లు, ఉజ్జ్వాలా గ్యాస్ కనెక్షన్, సౌభాగ్యం యోజన, పవర్ కనెక్షన్, ఎల్ఈడీ బల్బ్, వాటర్ కనెక్షన్ కూడా అందుతున్నాయని ఆయన అన్నారు. గ్రామీణ సోదరీమణుల జీవితాలను మార్చడంలో ఈ పీఎం ఆవాస్ యోజన, స్వచ్ఛ భారత్ అభియాన్ వంటి పథకాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 27 సంక్షేమ పథకాలను పీఎం ఆవాస్ యోజనతో అనుసంధానించినట్లు ప్రధాని చెప్పారు. ప్రధాని ఆవాస్ యోజన కింద నిర్మించిన ఇళ్ళు ఎక్కువగా మహిళ పేరిట రిజిస్ట్రేషన్ చేయబడ్డాయని సదరు ఇల్లాలుతో కలిసి కుటుంబ యజమాని పేరిటన సంయుక్తంగా నమోదు చేయబడ్డాయని తెలిపారు. కొత్త పని అవకాశాలు సృష్టించబడుతున్నాయని అదే సమయంలో పెద్ద సంఖ్యలో మహిళా మేస్త్రీల సేవలు నిర్మాణానికి ఉపయోగించబడుతున్నాయని అన్నారు.
116 జిల్లాల్లో 5000 కిలోమీటర్లకు పైగా ఆప్టికల్ ఫైబర్ కేవలం మధ్యప్రదేశ్‌లో 50 వేల మందికి పైగా మేసన్‌లకు శిక్షణ ఇస్తున్నారని, అందులో 9 వేల మంది లేడీ మేసన్లు ఉన్నారని చెప్పారు. పేదల ఆదాయం పెరిగినప్పుడు వారి విశ్వాసం పెరుగుతుందని వివరించారు. తద్వార స్వావలంబన భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పం కూడా బలపడుతుంది. ఈ విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి, 2014 నుండి ప్రతి గ్రామంలో ఆధునిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని ప్రధాని చెప్పారు.
రాబోయే 1000 రోజుల్లో సుమారు 6 వేల గ్రామాల్లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయడంపై ఎర్రకోట రాంపార్ట్స్ నుండి 2020 ఆగస్టు 15 న ఇచ్చిన వాగ్దానాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కరోనా వ్యాప్తి ఉన్న సమయంలోనూ ప్రధాన మంత్రి గారిబ్ కళ్యాణ్ రోజ్గర్ అభియాన్ కింద ఈ పని వేగంగా అభివృద్ధి చెందిందని అన్నారు. కేవలం కొన్ని వారాల్లోనే 116 జిల్లాల్లో 5000 కిలోమీటర్లకు పైగా ఆప్టికల్ ఫైబర్ వేయడం జరిగిందని వివరించారు. 1250 కి పైగా గ్రామ పంచాయతీలు సుమారు 19 వేల ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్లతో అనుసంధానించబడి ఉన్నాయని, సుమారు 15 వేల వై-ఫై హాట్‌స్పాట్ అందించామని ఆయన చెప్పారు. గ్రామాలకు మెరుగైన మరియు వేగవంతమైన ఇంటర్నెట్ వచ్చినప్పుడు, గ్రామంలోని పిల్లలకు విద్యకు మంచి అవకాశాలు లభిస్తాయని, యువతకు మంచి వ్యాపార అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
ఈ రోజు ప్రభుత్వ ప్రతి సేవ ఆన్లైన్ చేయడం జరిగిందని తద్వారా ప్రయోజనాలు కూడా వేగంగా ఒనగూరుతూ వస్తున్నాయని, అవినీతి జరగడంలేదని, గ్రామస్తులు చిన్న పనుల కోసం నగరానికి వెళ్లవలసిన అవసరం లేకుండా పోయిందని తెలిపారు. పేదలను శక్తివంతం చేయడానికి ఈ ప్రక్రియ ఇప్పుడు మరింత వేగంగా జరుగుతుందని ఆయన అన్నారు.
****
Ensuring housing for all. Watch. #PMGraminGrihaPravesh https://t.co/SlmgIR3kWt
— Narendra Modi (@narendramodi) September 12, 2020
अभी ऐसे साथियों से मेरी चर्चा हुई, जिनको आज अपना पक्का घर मिला है, अपने सपनों का घर मिला है।
— PMO India (@PMOIndia) September 12, 2020
अब मध्य प्रदेश के पौने 2 लाख ऐसे परिवार, जो आज अपने घर में प्रवेश कर रहे हैं, जिनका गृह-प्रवेश हो रहा है, उनको भी मैं बहुत बधाई देता हूं, शुभकामनाएं देता हूं: PM#PMGraminGrihaPravesh
इस बार आप सभी की दीवाली, आप सभी के त्योहारों की खुशियां कुछ और ही होंगी।
— PMO India (@PMOIndia) September 12, 2020
कोरोना काल नहीं होता तो आज आपके जीवन की इतनी बड़ी खुशी में शामिल होने के लिए, आपके घर का एक सदस्य, आपका प्रधानसेवक आपके बीच होता: PM#PMGraminGrihaPravesh
आज का ये दिन करोडों देशवासियों के उस विश्वास को भी मज़बूत करता है कि सही नीयत से बनाई गई सरकारी योजनाएं साकार भी होती हैं और उनके लाभार्थियों तक पहुंचती भी हैं।
— PMO India (@PMOIndia) September 12, 2020
जिन साथियों को आज अपना घर मिला है, उनके भीतर के संतोष, उनके आत्मविश्वास को मैं अनुभव कर सकता हूं: PM
सामान्य तौर पर प्रधानमंत्री आवास योजना के तहत एक घर बनाने में औसतन 125 दिन का समय लगता है।
— PMO India (@PMOIndia) September 12, 2020
कोरोना के इस काल में पीएम आवास योजना के तहत घरों को सिर्फ 45 से 60 दिन में ही बनाकर तैयार कर दिया गया है।
आपदा को अवसर में बदलने का ये बहुत ही उत्तम उदाहरण है: PM
इस तेज़ी में बहुत बड़ा योगदान रहा शहरों से लौटे हमारे श्रमिक साथियों का।
— PMO India (@PMOIndia) September 12, 2020
हमारे इन साथियों ने प्रधानमंत्री गरीब कल्याण रोज़गार अभियान का पूरा लाभ उठाते हुए अपने परिवार को संभाला और अपने गरीब भाई-बहनों के लिए घर भी तैयार करके दे दिया: PM#PMGraminGrihaPravesh
मुझे संतोष है कि पीएम गरीब कल्याण अभियान से मध्य प्रदेश सहित देश के अनेक राज्यों में करीब 23 हज़ार करोड़ रुपए के काम पूरे किए जा चुके हैं: PM#PMGraminGrihaPravesh
— PMO India (@PMOIndia) September 12, 2020
पीएम गरीब कल्याण अभियान के तहत
— PMO India (@PMOIndia) September 12, 2020
घर तो बन ही रहे हैं,
हर घर जल पहुंचाने का काम हो,
आंगनबाड़ी और पंचायत के भवनों का निर्माण हो,
पशुओं के लिए शेड बनाना हो,
तालाब और कुएं बनाना हो,
ग्रामीण सड़कों का काम हो,
गांव के विकास से जुड़े ऐसे अनेक काम तेज़ी से किए गए हैं: PM
2014 में पुराने अनुभवों का अध्ययन करके, पहले पुरानी योजना में सुधार किया गया और फिर प्रधानमंत्री आवास योजना के रूप में बिल्कुल नई सोच के साथ योजना लागू की गई।
— PMO India (@PMOIndia) September 12, 2020
इसमें लाभार्थी के चयन से लेकर गृह प्रवेश तक पारदर्शिता को प्राथमिकता दी गई: PM#PMGraminGrihaPravesh
पहले गरीब सरकार के पीछे दौड़ता था, अब सरकार लोगों के पास जा रही है।
— PMO India (@PMOIndia) September 12, 2020
अब किसी की इच्छा के अनुसार लिस्ट में नाम जोड़ा या घटाया नहीं जा सकता।
चयन से लेकर निर्माण तक वैज्ञानिक और पारदर्शी तरीका अपनाया जा रहा है: PM
मटीरियल से लेकर निर्माण तक, स्थानीय स्तर पर उपलब्ध और उपयोग होने वाले सामानों को भी प्राथमिकता दी जा रही है।
— PMO India (@PMOIndia) September 12, 2020
घर के डिजायन भी स्थानीय ज़रूरतों के मुताबिक तैयार और स्वीकार किए जा रहे हैं।
पूरी पारदर्शिता के साथ हर चरण की पूरी मॉनीटरिंग के साथ लाभार्थी खुद अपना घर बनाता है: PM
प्रधानमंत्री आवास योजना हो या स्वच्छ भारत अभियान के तहत बनने वाले शौचालय हों, इनसे गरीब को सुविधा तो मिल ही रही है, बल्कि ये रोज़गार और सशक्तिकरण का भी ये बड़ा माध्यम हैं।
— PMO India (@PMOIndia) September 12, 2020
विशेषतौर पर हमारी ग्रामीण बहनों के जीवन को बदलने में भी ये योजनाएं अहम भूमिका निभा रही हैं: PM
इसी 15 अगस्त को लाल किले से मैंने कहा था कि आने वाले 1 हज़ार दिनों में देश के करीब 6 लाख गांवों में ऑप्टिकल फाइबर बिछाने का काम पूरा किया जाएगा।
— PMO India (@PMOIndia) September 12, 2020
पहले देश की ढाई लाख पंचायतों तक फाइबर पहुंचाने का लक्ष्य रखा गया था, अब इसको गांव-गांव तक पहुंचाने का संकल्प लिया गया है: PM
जब गांव में भी जगह-जगह बेहतर और तेज़ इंटरनेट आएगा, जगह-जगह WiFI Hotspot बनेंगे, तो गांव के बच्चों को पढ़ाई और युवाओं को कमाई के बेहतर अवसर मिलेंगे।
— PMO India (@PMOIndia) September 12, 2020
यानि गांव अब WiFi के ही Hotspot से नहीं जुड़ेंगे, बल्कि आधुनिक गतिविधियों के, व्यापार-कारोबार के भी Hotspot बनेंगे: PM