గృహ సంబంధ శ్రామికుల భర్తీ అంశం లో భారతదేశాని కి మరియు కువైత్ కు మధ్య సహకారం కోసం అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎంఒయు)పై సంతకాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
వివరాలు:
గృహ సంబంధ శ్రామికుల వ్యవహారాల లో సహకారానికి గాను ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఫ్రేమ్ వర్క్ ను ఈ ఎంఒయు అందుబాటు లోకి తీసుకు వస్తుంది. అంతేకాకుండా కువైత్ లో పని చేస్తున్న మహిళా శ్రామికులు సహా భారతీయ గృహ సంబంధ శ్రామికుల పరిరక్షణ కు ఉద్దేశించిన చర్యల ను బలోపేతం చేస్తుంది కూడా. ఈ ఎంఒయు తొలుత అయిదు సంవత్సరాల కాలం పాటు చెల్లుబాటు అవుతుంది; ఆటోమేటిక్ రెన్యూవల్ నిబంధన ను దీనిలో పొందుపరచడమైంది.
అమలు సంబంధిత వ్యూహం:
ఈ ఎంఒయు లో భాగం గా, ఎంఒయు ను అమలు పరచడానికి తరువాత తీసుకోదగ్గ చర్యల కై ఒక సంయుక్త సంఘాన్ని ఏర్పాటు చేస్తారు.
ప్రధాన ప్రభావం:
ఉభయ దేశాల లో గృహ సంబంధ శ్రామికుల కు సంబంధించిన వ్యవహారాల లో ద్వైపాక్షిక సహకారాన్ని ఈ ఎంఒయు పెంపొందిస్తుంది.
లబ్దిదారులు:
కువైత్ లో సుమారు 3,00,000 మంది భారతీయ గృహ సంబంధ శ్రామికులు ఉన్నారు. వీరి లో దాదాపు 90 వేల మంది మహిళా శ్రామికులు కూడా ఉన్నారు.
***