Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గురు నానక్‌ దేవ్‌ జయంతి సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు


   శ్రీ గురునానక్‌ దేవ్‌ జయంతి ‘పర్‌కాష్‌ పరబ్‌’ నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ గురునానక్‌ దేవ్‌ పర్‌కాస్‌ పరబ్‌ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ మోదీ ఆయన పవిత్ర సిద్ధాంతాలను, ఉన్నతాదర్శాలను గుర్తుచేసుకున్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో-

“శ్రీ గురునానక్ దేవ్ ప్రకాష్ పరబ్ ప్రత్యేక సందర్భంగా ఆయన పవిత్ర ప్రబోధాలను, ఉన్నతాదర్శాలను గుర్తుచేసుకున్నాను. పారదర్శక, కరుణాస్పద సమ్మిళిత సమాజంపై ఆయన దార్శనికత మనకెంతో స్ఫూర్తినిస్తుంది. అలాగే ఇతరులకు సేవ చేయడానికి శ్రీ గురునానక్ దేవ్ అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం కూడా మనకెంతో ప్రేరణనిస్తుంది” అని ప్రధాని పేర్కొన్నారు.

***

DS/SH