Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గురు తేజ్ బహదూర్ జీ అమరుడైన దినం సందర్బంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.


గురు తేజ్ బహదూర్ సింగ్ అమరులైన దినాన్ని పురస్కరించుకుని  ఈరోజు ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
ఘనంగా నివాళులర్పించారు.   స్వాతంత్ర్యం, మానవీయ గౌరవం కోసం ఆయన చేసిన త్యాగం చేసిన తిరుగులేని త్యాగం ఎల్లకాలం గుర్తుంటుందని
ప్రధానమంత్రి పేర్కొన్నారు. సమగ్రతతో, మానవీయ గౌరవంతో మానవాళి జీవించడానికి వారు ప్రేరణగా నిలుస్తారని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఒక  సందేశమిస్తూ ప్రధానమంత్రి,
“ఇవాళ, మనం శ్రీ గురు తేజ్ బహదూర్జీని అమరత్వాన్ని స్మరించుకుంటున్నాం. వారు అసమాన ధైర్యసాహసాలకు,
సంకల్ప బలానికి గుర్తు. స్వాతంత్ర్యం కోసం, మానవ గౌరవం కోసం వారు చేసిన తిరుగులేని త్యాగం మానవాళి సమగ్రతతో, దయతో జీవించడానికి నిరంతరం ప్రేరణనిస్తుంది.
వారి బోధనలు సమైక్యతను,ధర్మ నిరతను నొక్కి చెప్పడమే కాక, సోదర భావం ,
శాంతియుత జీవనమార్గంలో మనకు వెలుగును ప్రసరింప చేస్తాయి”అని  పేర్కొన్నారు.