ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గురువారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. అమరావతి వద్ద ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగర నిర్మాణానికి జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. అలాగే, తిరుపతి విమానాశ్రయంలో గరుడ టెర్మినల్ ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. తిరుపతి వద్ద మొబైల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. తిరుమల దేవాలయాన్ని ప్రధాని సందర్శిస్తారు.