Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజ‌రాత్‌ లోని జామ్ న‌గ‌ర్‌ను సంద‌ర్శించిన ప్ర‌ధాన‌ మంత్రి

గుజ‌రాత్‌ లోని జామ్ న‌గ‌ర్‌ను సంద‌ర్శించిన ప్ర‌ధాన‌ మంత్రి

గుజ‌రాత్‌ లోని జామ్ న‌గ‌ర్‌ను సంద‌ర్శించిన ప్ర‌ధాన‌ మంత్రి

గుజ‌రాత్‌ లోని జామ్ న‌గ‌ర్‌ను సంద‌ర్శించిన ప్ర‌ధాన‌ మంత్రి


ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, ఈరోజు గుజ‌రాత్‌లోని జామ్‌న‌గ‌ర్ వ‌ద్ద బాంద్రా- జామ్‌న‌గ‌ర్ హ‌మ్‌స‌ఫ‌ర్ ఎక్స్‌ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అలాగే గురుగోవింద్ సింగ్ ఆస్ప‌త్రి 750 ప‌డ‌క‌ల కొత్త అనుబంధ విభాగాన్ని ప్ర‌ధాన‌మంత్రి జాతికి అంకితం చేశారు. అలాగే సౌరాష్ట్ర న‌ర్మ‌దా అవ‌త‌ర‌ణ్ ఇరిగేష‌న్ (ఎస్ ఎ యు ఎన్ ఐ) కు సంబంధించిన ప‌లు ప్రాజెక్టుల‌ను ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభించారు. అలాగే ఆజి-3 నుంచి ఖిజాడియా వ‌ర‌కు 51 కిలోమీట‌ర్ల పైప్‌లైన్‌తో స‌హా జామ్‌న‌గ‌ర్ వ‌ద్ద ప‌లు అభివృద్ధి ప‌థ‌కాల‌ను కూడా ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున హాజ‌రైన ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌సంగిస్తూ ప్ర‌ధాని, రాష్ట్రంలో నీటి స‌మ‌స్య‌ను అధిగమించేందుకు గుజ‌రాత్ ప్ర‌భుత్వం గ‌త ఒక‌టి రెండు ద‌శాబ్దాలుగా చేస్తున్న కృషి, సంక‌ల్పంకం గురించి ప్ర‌ధాని త‌న ప్ర‌సంగంలో పేర్కొన్నారు. గుజ‌రాత్‌లో ట్యాంక‌ర్ రాజ్ ను అనుమ‌తించ‌రాద‌న్న‌ది త‌న ప‌ట్టుద‌ల అని ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. గుజ‌రాత్ ప్ర‌జ‌ల‌కు స‌ర్దార్‌స‌రోవ‌ర్ డ్యామ్ ఏర‌కంగా ఉప‌శ‌మ‌నం క‌లిగించిందో ఆయ‌న తెలియ‌జేశారు. ప్ర‌స్తుత త‌రం, భ‌విష్య‌త్ త‌రాల అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌తి చుక్క‌నీటినీ పొదుపు చేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

గుజ‌రాత్‌లో ఆరోగ్య‌రంగ విప్ల‌వాన్ని కొనియాడుతూ ప్ర‌ధాన‌మంత్రి, గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా గుజ‌రాత్‌లో ఏర్ప‌డిన ఆస్ప‌త్రులు పేద ప్ర‌జ‌ల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డతాయ‌ని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన ఆయుష్మాన్ భార‌త్ పేద ప్ర‌జ‌ల‌కు అందుబాటులో నాణ్య‌మైన వైద్య స‌దుపాయాలు క‌ల్పిస్తుంద‌ని చెప్పారు.

దేశం ఎదుర్కొంటున్న స‌వాళ్ల‌ను అధిగ‌మించ‌డానికి స్వ‌ల్ప‌కాలిక చ‌ర్య‌లకు సంబంధించిన అనుచిత ఆలోచ‌న‌లు కాక‌, దీర్ఘ‌కాలిక , వ్య‌వ‌స్థాగ‌త చ‌ర్య‌లు అవ‌స‌ర‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. ఇందుకోసం కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన‌ దీర్ఘ‌కాలిక దార్శ‌నిక‌త‌తో కూడిన ప‌థ‌కాలను ప్ర‌ధాన‌మంత్రి ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. పి.ఎం.- కిసాన్‌ప‌థ‌కం దీర్ఘ‌కాలిక ప‌థ‌క‌మ‌ని, ఇది రైతుల‌కు సంబంధించిన స‌మ‌గ్ర ప‌థ‌క‌మ‌ని ప్ర‌ధాని వివ‌రించారు.

ఎం.ఎస్‌.ఎం.ఇ రంగానికి ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల గురించి ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, సుల‌భంగా రుణాలు అంద‌డం, ప్ర‌జాహిత జిఎస్‌టి వంటివి యువ‌త‌రానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని ప్ర‌ధాని అన్నారు. ప్ర‌భుత్వం తీసుకున్న‌చ‌ర్య‌ల‌వల్ల సుల‌భ‌త‌ర వాణిజ్యం ర్యాంకులు మ‌రింత మెరుగుప‌డ‌డానికి వీలు క‌లిగింద‌ని ప్రధాన‌మంత్రి చెప్పారు.

సాయుధ బ‌ల‌గాల కృషిని ప్ర‌శంసిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, మ‌న వీర సైనికుల‌నుచూసి జాతి గ‌ర్విస్తున్న‌ద‌ని చెప్పారు. ఉగ్ర‌వాద బెడ‌ద‌ను మ‌ట్టుబెట్టాల‌ని ప్ర‌ధాని అన్నారు.