Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్ లో వరద ప్రభావిత ప్రాంతాలపై వైమానిక పరిశీలన జరిపిన ప్రధాన మంత్రి; వరద సహాయక చర్యలపై ఆయన అహమదాబాద్ విమానాశ్రయంలో ఓ ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు కూడా

గుజరాత్ లో వరద ప్రభావిత ప్రాంతాలపై వైమానిక పరిశీలన జరిపిన ప్రధాన మంత్రి; వరద సహాయక చర్యలపై ఆయన అహమదాబాద్ విమానాశ్రయంలో ఓ ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు కూడా


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లో వరద ప్రభావిత ప్రాంతాలపై ఈ రోజు వైమానిక పరిశీలన జరిపారు.

ఆయన అహమదాబాద్ విమానాశ్రయంలో ఓ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి, వరద సహాయక కార్యకలాపాలపై సమీక్షను కూడా నిర్వహించారు. ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ, ఇతర సీనియర్ మంత్రులు మరియు రాష్ట్ర ప్రభుత్వ అగ్రగామి అధికారులు, విపత్తు ప్రతిస్పందన సంస్థలు, ఇంకా పిఎమ్ఒ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

వరదల వల్ల వాటిల్లిన నష్టం వివరాలు, మరియు చేపడుతున్న సహాయక కార్యకలాపాలను గురించి ప్రధాన మంత్రి దృష్టికి తీసుకువ‌చ్చారు.

భారత వాయు సేనతో పాటు సహాయక చర్యలలో పాలు పంచుకొంటున్న ఏజెన్సీలు అన్నీ వాటి చేతనైనంత వరకు ఉత్తమమైనటువంటి ప్రయాసల ద్వారా తక్షణ సహాయక చర్యలను మరియు ఉపశమనకారకమైన తోడ్పాటును అందించాలంటూ ప్రధాన మంత్రి ఆదేశించారు. పరిశుభ్రత, పరిశుద్ధత, ఆరోగ్య రక్షణ లకు ప్రాముఖ్యం ఇవ్వాలని ఆయన నొక్కిపలికారు. వీటికి అత్యంత ప్రాధాన్యాన్ని అన్వయించాలని ఆయన అన్నారు.

పంటలు, ఆస్తులు వగైరా వాటికి వాటిల్లిన నష్టాన్ని పంట బీమా వ్యవహారాలను సంబాళిస్తున్న బీమా కంపెనీలతో సహా బీమా కంపెనీలు శీఘ్రంగా అంచనా వేయాలని, క్లెయిముల సత్వర చెల్లింపులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఇలా చేస్తే బాధిత ప్రజలకు తక్షణ ఉపశమనం లభించగలదని ప్రధాన మంత్రి చెప్పారు.

నీటి సరఫరా, విద్యుత్తు సరఫరా మరియు కమ్యూనికేషన్ లింకులను వెనువెంటనే పునరుద్ధరించాలని కూడా ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.

దెబ్బ తిన్న రహదారుల మరమ్మతుల కోసం, విద్యుత్తు సంబంధిత అవస్థాపన పునరుద్ధరణ కోసం మరియు ఆరోగ్య సంబంధిత సహాయం అందించడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలంటూ ప్రధాన మంత్రి సూచించారు.

అహమదాబాద్ విమానాశ్రయంలో ప్రసార మాధ్యమాలను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, గుజరాత్ గత వారం రోజులుగా భారీ వర్షాల ప్రభావానికి లోనైందన్నారు. రేపటి నుండి మరో పది హెలికాప్టర్ లను రంగంలోకి దించుతాం, తద్వారా సహాయక పనులు మరింత వేగాన్ని పుంజుకొంటాయని ఆయన స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాలలోను, పట్టణ ప్రాంతాలలోను ఎంత నష్టం జరిగిందీ మదింపు చేయడం జరుగుతుందని, స్వల్ప కాలిక చర్యలతో పాటు దీర్ఘ కాలిక చర్యలు తీసుకొంటారని తెలిపారు. వరద పరిస్థితులపై ఇంతవరకు స్పందించిన తీరుకుగాను రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇతర ఏజెన్సీలను ప్రధాన మంత్రి అభినందించారు.

వరదలలో చనిపోయిన వారి రక్త సంబంధికులకు రెండు లక్షల రూపాయల చొప్పున మరియు గాయపడ్డ వారికి యాభై వేల రూపాయల చొప్పున అనుగ్రహపూర్వక చెల్లింపు ఉంటుందని ప్రధాన మంత్రి ప్రకటించారు. ఎస్ డిఆర్ఎఫ్ లో భాగంగా 500 రూపాయల అదనపు సాయాన్ని వెంటనే చెల్లిస్తారని కూడా ఆయన ప్రకటన చేశారు. వరదలు రువ్విన సవాలును గుజరాత్ ప్రజలు, ప్రభుత్వం విజయవంతంగా అధిగమించి మరింత బలాన్ని సంతరించుకొంటాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ కష్ట కాలంలో మీతో కేంద్ర ప్రభుత్వం భుజం భుజం కలిపి నిలబడుతుందంటూ రాష్ట్ర ప్రజలకు ఆయన హామీనిచ్చారు.