Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్ లోని వడ్తల్ లోస్వామి నారాయణ మందిరం 200వ వార్షిక వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

గుజరాత్ లోని వడ్తల్ లోస్వామి నారాయణ మందిరం  200వ వార్షిక వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


గుజరాత్ లోని వడ్తాల్ లో ఉన్న శ్రీ స్వామి నారాయణ మందిరం 200వ వార్షిక వేడుకల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారుప్రజలనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారుశ్రీ స్వామి నారాయణ అనుగ్రహంతోనే 200వ వార్షికోత్సవాలు జరుగుతున్నాయన్నారుప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామి అనుచరులందరికీ స్వాగతం పలికిన శ్రీమోదీ.. స్వామి నారాయణ మందిర సంప్రదాయంలో సేవే ప్రధానమనిశిష్యులంతా నేడు సేవలో నిమగ్నమయ్యారని అన్నారుఈ వేడుకలను ఇటీవల మీడియాలో చూడడం తనకు సంతోషాన్నిచ్చిందని ప్రధానమంత్రి అన్నారు.

వడ్తాల్ ధామ్ లో 200వ వార్షిక వేడుకలు కేవలం చరిత్ర మాత్రమే కాదని పేర్కొన్న శ్రీమోదీ.. ఆ ధామంపై అత్యంత భక్తివిశ్వాసాలతో చిన్నప్పటి నుంచి పెరిగిన తనతో సహా అనేక మంది శిష్యులకు ఇది అత్యంత ప్రాధాన్యం గల కార్యక్రమమన్నారుభారతీయ సంస్కృతి శాశ్వత వాహిని అనడానికి ఈ ఉత్సవం నిదర్శనమన్నారుశ్రీ స్వామి నారాయణ వడ్తాల్ ధామాన్ని స్థాపించి 200 ఏళ్లు గడిచినప్పటికీ ఆధ్యాత్మిక చేతన సజీవంగా ఉందని.. ఆయన బోధనలతో నేటికీ తాదాత్మ్యం చెందగలమని శ్రీ మోదీ స్పష్టం చేశారుమందిర 200వ వార్షికోత్సవం సందర్భంగా సాధువులుఅనుచరులందరికీ శ్రీ మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారుకేంద్ర ప్రభుత్వం రెండు వందల రూపాయల (200) వెండి నాణెంతోపాటు స్మారక చిహ్నంతో పోస్టల్ స్టాంపు విడుదల చేసిందని ప్రధానమంత్రి తెలిపారుఇవి భావి తరాల మదిలో ఈ గొప్ప సందర్భపు జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతాయన్నారు.

ఈ సంప్రదాయంతో స్వామి నారాయణ్ వ్యక్తిగతఆధ్యాత్మికసామాజిక సంబంధాలపై ఆయన అనుచరులందరికీ అవగాహన ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారుదేశాభివృద్ధి కోసం అర్థవంతమైన చింతనతోపాటు.. సాధువుల దివ్య సాంగత్యాన్ని గతంలోనూఇప్పుడూ తాను ఆస్వాదించానని ప్రధాని చెప్పారుఇతర కార్యక్రమాల కారణంగా తాను వ్యక్తిగతంగా ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయినప్పటికీమానసికంగా తాను వడ్తాల్ ధామంలోనే ఉన్నానని ప్రధాని వ్యాఖ్యానించారు.

పవిత్రమైన సాధు సంప్రదాయం భారతదేశ ప్రత్యేకత అనిప్రతీ క్లిష్ట సమయంలోనూ ఒక రుషోసాధుసంతోమహాత్ముడో ఎవరో ఒకరు ముందు నిలిచారని శ్రీ మోదీ అన్నారుస్వామి నారాయణ్ కూడా అలాంటి సమయంలోనే వచ్చారన్నారువందల ఏళ్ల బానిసత్వంతో బలహీనపడిదేశం ఆత్మ విశ్వాసం కోల్పోయిన సమయంలో దేశాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లారని ప్రధాని చెప్పారుస్వామి నారాయణ్ తోపాటు ఆ కాలపు సాధువులందరూ ఓ కొత్త ఆధ్యాత్మిక శక్తినివ్వడమే కాకుండా.. మన ఆత్మగౌరవాన్ని మేల్కొలిపారనిమన అస్తిత్వాన్ని పునరుజ్జీవింపజేశారని శ్రీ మోదీ పేర్కొన్నారుఈ దిశగా శిక్షపత్రివచనామృతుల కృషి ఎంతో అసామాన్యమైనదనివారి బోధనలను స్వీకరించి ముందుకు తీసుకెళ్లడం మనందరి కర్తవ్యమని ఉద్ఘాటించారుమానవాళి సేవకునూతన శక నిర్మాణానికి విశేషమైన తోడ్పాటునందించి గొప్ప స్ఫూర్తిగా వడ్తాల్ ధామం నిలిచినందుకు సంతోషంగా ఉందని శ్రీ మోదీ అన్నారుఅదే వడ్తాల్ ధామం అణగారిన వర్గాల నుంచి సాగరం వంటి గొప్ప అనుచరులను అందించిందన్నారువడ్తాల్ ధామం నేడు ఎందరో పిల్లలకు ఆహారంనివాసంవిద్యతోపాటు అనేక సేవలు అందిస్తోందని.. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రాజెక్టులు చేపడుతోందని శ్రీ మోదీ పేర్కొన్నారుగిరిజన ప్రాంతాల్లో మహిళా విద్య వంటి కీలక కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారుపేదలకు సేవఆధునికతను – ఆధ్యాత్మికతను మేళవించి భారతీయ సంస్కృతిని పరిరక్షించేలా కొత్తతరాన్ని నిర్మించడం వంటి విశేష సేవలెన్నిటినో వడ్తాల్ ధామం అందిస్తోందని శ్రీ మోదీ వివరించారుఇక్కడి సాధువులుభక్తులు ఎప్పుడూ తన అంచనాలను తప్పలేదని.. మెరుగైన భవిష్యత్తు కోసం పారిశుద్ధ్యం నుంచి పర్యావరణం వరకూ అనేక కార్యక్రమాలను చేపట్టారని శ్రీ మోదీ ప్రశంసించారుదానిని వారు తమ బాధ్యతగా స్వీకరించిమనస్ఫూర్తిగా ఆ సంకల్పాన్ని నెరవేర్చడంలో నిమగ్నమయ్యారన్నారుస్వామి నారాయణ్ సంప్రదాయానికి చెందిన శిష్యులు ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో లక్షకు పైగా మొక్కలు నాటారని శ్రీ మోదీ తెలిపారు.

ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యం ఉంటుందనివారి జీవితాన్ని కూడా అది నిర్దేశిస్తుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారుఈ లక్ష్యం మన మనోవాక్కర్మలను ప్రభావితం చేస్తుందన్నారుపరమార్థాన్ని గుర్తిస్తే జీవితం మొత్తం మార్పు వస్తుందన్నారుప్రతి యుగంలోనూ సాధు సంతులు ప్రజలకు తమ జీవిత లక్ష్యాన్ని తెలియజేశారని కొనియాడారుమన సమాజానికి సాధుసంతులురుషుల విశేష సేవలను ప్రముఖంగా ప్రస్తావించిన శ్రీ మోదీ.. ఆ లక్ష్యాల కోసం మొత్తం సమాజందేశం ఏకమైతే అవి తప్పక నెరవేరుతాయన్నారుఅందుకు అనేక ఉదాహరణలున్నాయన్నారుధార్మిక సంస్థలు నేడు యువతకు బృహత్తరమైన దిశను నిర్దేశించాయనిఅభివృద్ధి చెందిన భారతదేశమనే నిర్దేశిత లక్ష్యంతో దేశం మొత్తం ముందుకు వెళుతున్నదని ప్రధానమంత్రి స్పష్టం చేశారుఅభివృద్ధి చెందిన భారతదేశమనే ఈ పవిత్ర లక్ష్యాన్ని వడ్తాల్ సాధు సంతులుస్వామి నారాయణ్ పరివారమంతా ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రీ మోదీ కోరారుస్వాతంత్ర్యోద్యమాన్ని ప్రస్తావిస్తూ – స్వాతంత్ర్య కాంక్షచేతన సమాజంలోని అన్ని వర్గాల ప్రజల్లోనూ శతాబ్దం పాటు స్ఫూర్తినిస్తూ నిలిచాయని.. ప్రజలు తమ స్వతంత్రతా లక్ష్యాన్నిస్వప్నాలనుసంకల్పాన్ని ఒక్క రోజూ ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారుస్వాతంత్య్రోద్యమ సమయంలో ఉన్న తపనచైతన్యం అభివృద్ధి చెందిన భారత్ కోసం140 కోట్ల మంది దేశ ప్రజలలో అనుక్షణం ఉండాలన్నారురాబోయే 25 సంవత్సరాలు అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యంగా జీవించేలాప్రతి క్షణం దానితో మమేకమై ఉండేలా ప్రజలను ప్రేరేపించాలని సాధువులుస్వామి నారాయణ్ అనుచరులను ఆయన కోరారుప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చెందిన భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రధాని అభ్యర్థించారుస్వావలంబన సాధించడం అభివృద్ధి చెందిన భారత్ దిశగా తొలి అడుగు అనిదీన్ని సాధించడానికి బయటి వ్యక్తులు అవసరం లేదని, 140 కోట్ల మంది భారత పౌరులు ఈ దిశగా చొరవ తీసుకోవాలని కోరారుస్థానికతను ప్రోత్సహించడం ద్వారా సహకరించాలని కార్యక్రమానికి హాజరైన స్వామి నారాయణ్ శిష్యులను శ్రీ మోదీ కోరారుఅభివృద్ధి చెందిన భారత్ కోసం దేశ ఐక్యతసమగ్రత అత్యంత ప్రధానమైనవని స్పష్టం చేసిన శ్రీ మోదీ.. కొన్ని స్వార్థ శక్తులు సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పన్నుతున్నాయని వ్యాఖ్యానించారుఇలాంటి చర్యలను ఐక్యంగా తిప్పికొట్టడం అత్యావశ్యకమన్నారు.

కఠోర సాధన ద్వారా పెద్ద లక్ష్యాలను ఎలా సాధించవచ్చోదేశ నిర్మాణం దిశగా యువత నిర్ణయాత్మకంగా ఎలా నిర్దేశించగలదోయువత దేశాన్ని ఎలా నిర్మించగలదో – ఎలా నిర్మిస్తుందో అన్న అంశాలపై శ్రీ స్వామి నారాయణ్ బోధనలను శ్రీ మోదీ  ప్రముఖంగా పేర్కొన్నారుఇందుకోసం యువతను సమర్థులుగావిద్యావంతులుగా తీర్చిదిద్దడం అవసరంసాధికారతనైపుణ్యం కలిగిన యువత అభివృద్ధి చెందిన భారతదేశం దిశగా నడిపించగల అతిపెద్ద శక్తి అని శ్రీ మోదీ స్పష్టం చేశారుభారత యువతకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ మరింత పెరుగుతుందన్నారుభారత్ లోని నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ అధికంగా ఉందనిదేశ యువశక్తి ప్రపంచాన్ని ఆకట్టుకున్నదని ప్రధానమంత్రి చెప్పారుదేశంతోపాటు ప్రపంచ అవసరాలను కూడా తీర్చడానికి ఈ యువత సంసిద్ధంగా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తంచేశారువ్యసనాల నుంచి విముక్తి కల్పించడానికి స్వామి నారాయణ్ భక్తులు చేస్తున్న కృషిని ప్రముఖంగా పేర్కొంటూ.. యువత వ్యసనాలకుమాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా సాధువులుస్వామి అనుచరులు కృషిచేయాలని శ్రీ మోదీ కోరారుమాదకద్రవ్యాల వ్యసనం నుంచి యువతను రక్షించే కార్యక్రమాలు కేవలం భారత్ లోనే కాకుండాప్రపంచవ్యాప్తంగా కూడా అత్యావశ్యకమని ఆయన అన్నారుఅలాంటి కార్యక్రమాలను నిరంరం చేపట్టాలన్నారు.

ఏ దేశమైనా ఘనమైన తన వారసత్వ సంపదను గౌరవించిసంరక్షిస్తేనే పురోగతి సాధించగలదన్న శ్రీ మోదీ.. “అభివృద్ధితోపాటు వారసత్వ సంపదను పరిరక్షించడం భారత్ కు మంత్రప్రదం’’ అన్నారుఅయోధ్యను ప్రస్తావిస్తూ.. వేల ఏళ్ల నాటి భారత వారసత్వ కేంద్రాల వైభవం పునరుద్ధరణకు నోచుకుంటుండడంపై శ్రీ మోదీ హర్షం వ్యక్తం చేశారుగతంలో వాటిని ధ్వంసమైన ప్రదేశాలుగానే భావించారన్నారుకాశికేదారనాథ్పావగఢ్మొథెరా సూర్యదేవాలయంసోమనాథ ఆలయాలను కూడా ఈ పరివర్తనకు నిదర్శనాలుగా ఆయన ఉదాహరించారుఅంతటా సరికొత్త చైతన్యంసంకల్పం కనిపిస్తున్నాయన్నారుచోరీకి గురైన వందల ఏళ్ల నాటి దేవతా విగ్రహాలు భారత్‌కు తిరిగి వస్తున్నాయని కూడా శ్రీ మోదీ పేర్కొన్నారులోథాల్ పునరాభివృద్ధి ప్రాజెక్టును ప్రస్తావిస్తూ.. సాంస్కృతిక చైతన్య ప్రసరణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదన్నారుఈ నేలనుఈ దేశాన్నిఇక్కడి సంప్రదాయాలను ప్రేమించేఈ సంస్కృతిపై గర్వించేమన వారసత్వాన్ని కీర్తించే పౌరులందరిపైనా ఈ బాధ్యత ఉందన్నారువడ్తాల్ ధామంలోని స్వామి నారాయణ్ కళాఖండాల ప్రదర్శన శాల అక్షర్ భువన్ కూడా ఇందులో భాగమే అని శ్రీ మోదీ పేర్కొన్నారుఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన శ్రీ మోదీ.. అక్షర్ భువన్ దేశ అజరామరమైన ఆధ్యాత్మిక వారసత్వానికి గొప్ప దేవాలయంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

140 కోట్ల మంది భారతీయులు ఉమ్మడి లక్ష్యం కోసం ఏకమైనప్పుడే అభివృద్ధి చెందిన భారత్ సాకారమవుతుందని శ్రీ మోదీ పేర్కొన్నారుఈ ప్రస్థానాన్ని పూర్తి చేయడంలో మన సాధు సంతుల మార్గదర్శకత్వం చాలా ముఖ్యమైనదన్నారు. 12 ఏళ్లకోసారి జరిగే భారత సాంస్కృతిక దీప్తి అయిన పూర్ణ కుంభ గురించి ప్రపంచానికి చాటాలని ఈ సందర్భంగా ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సాధువులను ప్రధానమంత్రి అభ్యర్థించారుప్రయాగరాజ్ లో జరగబోయే పూర్ణ కుంభ గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించాలనిభారత మూలాలు లేని విదేశీయులకు దాని గురించి వివరించాలని ఆయన సూచించారువిదేశాల్లోని తమ ప్రతి శాఖ నుంచి కనీసం 100 మంది విదేశీయులు… వచ్చే కుంభమేళాను సందర్శించడానికి ప్రయత్నించాలని ఆయన కోరారుప్రపంచం మొత్తానికీ దీనిపై అవగాహన కల్పించే ఈ కార్యాన్ని సాధువులు సులభంగా పూర్తి చేయగలరని ప్రధాని అన్నారు.

కార్యక్రమానికి వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయినందుకు క్షమాపణలు చెప్తూద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా స్వామి నారాయణ మందిరంలోని సాధువులుఅనుచరులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.

నేపథ్యం

గుజరాత్ లోని వడ్తాల్ లో ఉన్న శ్రీ స్వామినారాయణ్ మందిరం 200వ వార్షిక వేడుకల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారుశ్రీ స్వామినారాయణ్ మందిరం అనేక దశాబ్దాలుగా ప్రజల సామాజికఆధ్యాత్మిక జీవనాన్ని ప్రభావితం చేస్తోంది.  

 

 

***

MJPS/SR