‘‘ఒకే భారతం-శ్రేష్ఠ భారతం సూత్రానికి హనుమంతుల వారు ఎంతో కీలకం’’;
‘‘మన విశ్వాసం.. సంస్కృతి ప్రవాహంలో
సామరస్యం.. సమానత్వం.. సమగ్రతలు అంతర్భాగం’’;
‘‘సబ్కా సాథ్… సబ్కా ప్రయాస్’కు రామకథ ఉత్తమ ఉదాహరణ..
అందులో ఎంతో ముఖ్యమైనది హనుమంతులవారి పాత్ర’’;
హనుమజ్జయంతి పర్వదినం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్ లోని మోర్బిలో 108 అడుగుల ఎత్తయిన హనుమాన్ విగ్రహాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో మహామండలేశ్వరి కనకేశ్వరి దేవి మాత కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- ముందుగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మోర్బిలో 108 అడుగుల ఎత్తయిన హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేయడం ప్రపంచవ్యాప్తంగాగల ఆ చిరంజీవి భక్తులందరికీ ఆనందం కలిగించే సంఘటన అని ఆయన అభివర్ణించారు. ఇటీవలి కాలంలో భక్తజన సమూహాలతోపాటు ఆధ్యాత్మిక గురువుల నడుమ పలుమార్లు గడపడం తనకు ఎనలేని ఆనందం కలిగించిందని ఆయన అన్నారు. ఈ మేరకు ఉమియా మాత, మాత అంబ, అన్నపూర్ణ ధామంలను వరుసగా దర్శించుకునే అవకాశం కూడా లభించిందని హర్షం వ్యక్తం చేశారు. తనపై ‘హరి కృప‘ ఉండటం వల్లనే ఇదంతా సాధ్యమైందని ప్రధాని పేర్కొన్నారు.
దేశం నాలుగు మూలల్లో ఇటువంటి నాలుగు విగ్రహాలను స్థాపించే ప్రాజెక్టు ‘ఒకే భారతం-శ్రేష్ఠ భారతం’ సంకల్పాన్ని ప్రతిబింబిస్తున్నదని ప్రధానమంత్రి అన్నారు. హనుమంతుల వారు తన సేవా స్ఫూర్తితో అందర్నీ ఏకం చేస్తాడని, ప్రతి ఒక్కరూ ఆయననుంచి ప్రేరణ పొందుతారని ఆయన వివరించారు. హనుమంతుల వారంటే ఆత్మగౌరవం, సాధికారత సాధించడంలో అడవుల్లో నివసించే సమాజాలు చూపిన శక్తికి చిహ్నమని చెప్పారు. ఆ మేరకు ‘‘ఒకే భారతం-శ్రేష్ఠ భారతం సూత్రానికి హనుమంతుల వారు ఎంతో కీలకం’’ అని పేర్కొన్నారు.
అదేవిధంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో, అనేక భాషలలో సాగే రామకథా గానం భగవంతునిపట్ల భక్తిభావాన్ని ప్రోది చేసి, అందర్నీ ఒక్కతాటిపైకి తెస్తుందని ప్రధానమంత్రి విశదీకరించారు. శక్తిమంతమైన మన ఆధ్యాత్మిక వారసత్వం, సంస్కృతి, సంప్రదాయాలకు ఇది తిరుగులేని ఉదాహరణ అని స్పష్టం చేశారు. కాబట్టే బానిస యుగపు కష్టకాలంలో కూడా ప్రతి ఒక్కరిలో ఏకతాభావం వివిధ ప్రాంతాలను సమైక్యంగా నిలిపిందని వివరించారు. ఈ కృషే స్వాతంత్ర్యం కోసం ప్రతినబూనే విధంగా జాతీయస్థాయిలో ఏకీభావాన్ని బలోపేతం చేసిందని తెలిపారు. ఈ మేరకు ‘‘వేలాది ఏళ్లుగా ఒడుదొడుకులను దృఢంగా ఎదుర్కొనడంలో మన నాగరికత.. వారసత్వం ప్రధాన పాత్ర పోషించాయి’’ అని వివరించారు.
అలాగే ‘‘మన విశ్వాసం.. సంస్కృతి ప్రవాహంలో సామరస్యం.. సమానత్వం.. సమగ్రతలు అంతర్భాగం’’గా ఉన్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. శ్రీరాముడు సర్వశక్తి సంపన్నుడు అయినప్పటికీ తన కర్తవ్య నిర్వహణలో ప్రతి ఒక్కరి బలాన్నీ ఏకీకృతం చేయడం ఇందుకు నిదర్శనమని ప్రధాని అభివర్ణించారు. ఆ విధంగా ‘‘సబ్కా సాథ్… సబ్కా ప్రయాస్’కు రామకథ ఉత్తమ ఉదాహరణ కాగా.. అందులో హనుమంతుల వారు పోషించిన పాత్ర ఎంతో ముఖ్యమైనది’’ అని శ్రీ మోదీ వివరించారు. అందరి కృషితోనే ఎంతటి దృఢ సంకల్పాన్నయినా నెరవేర్చడం సాధ్యమన్న స్ఫూర్తిని ఇది ప్రస్ఫుటం చేస్తున్నదని పేర్కొన్నారు.
అనంతరం గుజరాతీ భాషలో మాట్లాడుతూ- కేశవానంద్ బాపూను, మోర్బి పట్టణంతో ఆయనకుగల అనుబంధాన్ని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. మచ్చూధామ్ ప్రమాదం సందర్భంగా హనుమాన్ ధామ్ పోషించిన పాత్రను ఆయన ప్రస్తావించారు. ఆనాటి అనుభవ పాఠాలే కచ్ భూకంపం దుర్ఘటన నుంచి కోలుకోవడంలో తోడ్పడ్డాయని పేర్కొన్నారు. నేడు వర్ధమాన పరిశ్రమల కేంద్రంగా ఎదుగుతుండటం మోర్బి ప్రతిరోధక సామర్థ్యానికి నిదర్శనమని ఆయన కొనియాడారు. జామ్ నగర్ లో ఇత్తడి పరిశ్రమ, రాజ్ కోట్ లో ఇంజనీరింగ్ తదితరాలను గమనించినప్పుడు, మోర్బిలో గడియారాల పరిశ్రమ ‘సూక్ష్మ జపాన్’ను తలపిస్తుందని ఆయన పేర్కొన్నారు. యాత్రాధామ్ కథియవాడ్ ను పర్యాటక కూడలిగా మార్చిందని ప్రధాని గుర్తుచేశారు. అదే తరహాలో మాధవ్ పూర్ మేళా, రణ్ ఉత్సవం మోర్బి పట్టణానికి అపార ప్రయోజనాలు కల్పించాయని చెప్పారు. పరిశుభ్రత ఉద్యమంతోపాటు ‘స్థానికం కోసం స్వగళం’ కార్యక్రమ విజయం కోసం భక్తుల, సాధు సమాజాల తోడ్పాటు పొందడానికి ప్రాధాన్యమివ్వాలని ఈ సందర్భంగా శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.
# హనుమాన్‌జీ4ధామ్’’ ప్రాజెక్టులో భాగంగా దేశం నాలుగు దిక్కులలోనూ ఏర్పాటుచేయ తలపెట్టిన నాలుగు విగ్రహాలలో ఇవాళ ఆవిష్కృతమైనది రెండో విగ్రహం. ఈ మేరకు పశ్చిమ దిక్కున మోర్బిలోని పరమ పూజ్య బాపూ కేశవానంద్ ఆశ్రమంలో ఏర్పాటు చేయబడింది. ఈ పరంపరలోని తొలి విగ్రహాన్ని 2010లో ఉత్తర దిక్కునగల సిమ్లాలో ఏర్పాటు చేశారు. ఇక దక్షిణ దిక్కుకు సంబంధించి ప్రస్తుతం రామేశ్వరంలో విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
Inaugurating a 108 feet statue of Hanuman ji in Morbi, Gujarat. https://t.co/6M0VOXXPmk
— Narendra Modi (@narendramodi) April 16, 2022
हनुमान जयंती के पावन अवसर पर आप सभी को, समस्त देशवासियों को बहुत-बहुत शुभकामनाएं!
— PMO India (@PMOIndia) April 16, 2022
इस पावन अवसर पर आज मोरबी में हनुमान जी की इस भव्य मूर्ति का लोकार्पण हुआ है।
ये देश और दुनियाभर के हनुमान भक्तों के लिए बहुत सुखदायी है: PM @narendramodi
हनुमान जी अपनी भक्ति से, अपने सेवाभाव से, सबको जोड़ते हैं।
— PMO India (@PMOIndia) April 16, 2022
हर कोई हनुमान जी से प्रेरणा पाता है।
हनुमान वो शक्ति और सम्बल हैं जिन्होंने समस्त वनवासी प्रजातियों और वन बंधुओं को मान और सम्मान का अधिकार दिलाया।
इसलिए एक भारत, श्रेष्ठ भारत के भी हनुमान जी एक अहम सूत्र हैं: PM
रामकथा का आयोजन भी देश के अलग-अलग हिस्सों में किया जाता है।
— PMO India (@PMOIndia) April 16, 2022
भाषा-बोली जो भी हो, लेकिन रामकथा की भावना सभी को जोड़ती है, प्रभु भक्ति के साथ एकाकार करती है।
यही तो भारतीय आस्था की, हमारे आध्यात्म की, हमारी संस्कृति, हमारी परंपरा की ताकत है: PM @narendramodi