Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్ లోని ఏక్ తా నగర్ లో అన్ని రాష్ట్రాల పర్యావరణ మంత్రుల జాతీయ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి

గుజరాత్ లోని ఏక్ తా నగర్ లో అన్ని రాష్ట్రాల పర్యావరణ మంత్రుల జాతీయ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి


పర్యావరణ మంత్రుల జాతీయ సమావేశం గుజరాత్ లోని ఏక్ తా నగర్ లో ఏర్పాటవగా, ఆ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు.

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, అందరి ని ఏక్ తా నగర్ కు మరియు పర్యావరణ మంత్రుల జాతీయ సమావేశాని కి ఆహ్వానించారు. భారతదేశం రాబోయే 25 సంవత్సరాల కోసం కొత్త లక్ష్యాల ను నిర్దేశించుకొంటున్న తరుణం లో ఈ సమావేశం జరుగుతోంది అని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావించారు. ఈ సమావేశాని కి ఉన్న ప్రాధాన్యాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఏక్ తా నగర్ యొక్క సమగ్ర అభివృద్ధి అనేది అడవులు, జల సంరక్షణ, పర్యటన రంగం, ఇంకా మన ఆదివాసి సోదరీమణులు మరియు మన ఆదివాసి సోదరుల విషయాని కి వస్తే ఒక పర్యావరణ తీర్థయాత్ర స్థలాని కి ఒక ప్రముఖమైనటువంటి ఉదాహరణ గా ఉంది అన్నారు.

ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్, కొయలిశన్ ఫార్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లతో పాటు, లైఫ్ స్టయిల్ ఫార్ ఇన్ వైరన్ మెంట్ (LiFE – ‘లైఫ్’) ఉద్యమాల ను గురించి ప్రధాన మంత్రి ఉదాహరణలు గా పేర్కొంటూ భారతదేశం నవీకరణ యోగ్య శక్తి రంగం లో పెద్ద పెద్ద అడుగుల ను వేయడం ఒక్కటే కాకుండా ప్రపంచం లో ఇతర దేశాల కు కూడా దారి ని చూపుతున్నది అని వ్యాఖ్యానించారు. ‘‘వర్తమాన కాలం లో ‘న్యూ ఇండియా’ అనేది ఒక కొత్త ఆలోచన విధానం తో, కొత్త మార్గం లో పయనిస్తోంది’’ అన్నారు. భారతదేశం శరవేగం గా అభివృద్ధి చెందుతున్న ఒక ఆర్థిక వ్యవస్థ అని, మరి అది తన జీవావరణాన్ని కూడా అదే పనిగా పటిష్టపరచుకుంటోందని చెప్పారు. ‘‘మన దేశం లో అడవుల విస్తీర్ణం పెరిగింది; అంతేకాకుండా మాగాణినేలలు సైతం త్వరిత గతి న విస్తరిస్తున్నాయి’’ అని ఆయన అన్నారు.

భారతదేశం తాను ఇచ్చిన మాటల ను నిలబెట్టుకొంటున్న దాఖలాల ను చూసి ప్రపంచం భారతదేశం తో కలసి ముందుకు పోవడానికి వస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘గత కొన్నేళ్ళ లో గీర్ సింహాలు, పులులు, ఏనుగులు, ఖడ్గ మృగాలు మరియు చిరుతపులుల సంఖ్య వృద్ధి చెందింది. కొద్ది రోజుల కిందటే చీతా లు మధ్య ప్రదేశ్ లోకి అడుగిడడం సరికొత్త ఉత్సాహాన్ని తిరిగి తీసుకువచ్చింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

నెట్ జీరో లక్ష్యాన్ని 2070వ సంవత్సరానికల్లా సాధించాలి అని సభికుల దృష్టి కి ప్రధాన మంత్రి తీసుకు వస్తూ, దేశం యొక్క దృష్టి గ్రీన్ గ్రోథ్ మరియు గ్రీన్ జాబ్స్ మీద కేంద్రీకృతం అయింది అన్నారు. ప్రకృతి తో సమతుల్యత ను కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన స్పష్టం చేశారు. ఈ లక్ష్యాల ను సాధించడం లో రాష్ట్రాల యొక్క పర్యావరణ శాఖ ల పాత్ర ను కూడా ఆయన నొక్కి చెప్పారు. ‘‘రాష్ట్రాల లో ఒక వృత్తాకార ఆర్థిక వ్యవస్థ ను వీలైనంత మేరకు ప్రోత్సహించాలి అని పర్యావరణ మంత్రులు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఇది ఘన వ్యర్థాల నిర్వహణ సంబంధి ప్రచార ఉద్యమాన్ని చెప్పుకోదగినంత గా పటిష్ట పరచగలదు. అంతేకాకుండా, ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ యొక్క బంధనాల బారి నుండి మనకు విముక్తి ని ప్రసాదిస్తుంది అని కూడా శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

పర్యావరణ మంత్రిత్వ శాఖల భూమికల ను గురించి ప్రధాన మంత్రి మరింత విస్తారం గా మాట్లాడుతూ, ఈ పాత్ర ను ఒక గిరి గీసిన పద్ధతి లో చూడకూడదన్నారు. పర్యావరణ శాఖ లు చాలా కాలం గా ఒక నియంత్రణదారు వలె నడుచుకొన్నాయి అనే వాస్తవం శోచనీయం అని ఆయన అన్నారు. అయితే, ‘‘ పర్యావరణ మంత్రిత్వ శాఖ యొక్క భూమిక అనేది పర్యావరణం తాలూకు ఒక నియంత్రణదారు సంస్థ కంటె పర్యావరణాని కి ఒక ప్రమోటరు గా ఉండడం అనేది ముఖ్యం అని నేను అనుకొంటున్నాను’’ అని ఆయన అన్నారు. వెహికల్ స్క్రేపింగ్ పాలిసి, ఇథెనాల్ ను కలపడం వంటి బయో ఫ్యూయల్ సంబంధి చర్యలను అమలుపరుస్తూ ముందుకు సాగిపోవడం వంటివి అవలంబించవలసింది గా రాష్ట్రాల ను ఆయన కోరారు. ఈ విధమైన చర్యల ను ప్రోత్సహించడం లో రాష్ట్రాల మధ్య సమన్వయం తో పాటు ఆరోగ్యకరమైన స్పర్థ సైతం ఉండాలంటూ ఆయన సూచన లు చేశారు.

భూ గర్భ జలం సంబంధి అంశాల పై ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఒకప్పుడు సమృద్ధి గా జలం ఉన్నటువంటి రాష్ట్రాలు ఇటీవల నీటి ఎద్దడి ని కూడా ఎదుర్కొంటున్నాయి అన్నారు. రసాయనిక పదార్థాల కు తావు ఉండనటువంటి ప్రాకృతిక వ్యవసాయం, అమృత్ సరోవరాలు మరయు జల సంబంధి భద్రత వంటి సవాళ్ళు మరియు చర్యలు అనేవి ఆయా విభాగాల కు మాత్రమే పరిమితం అయినటువంటివి కాదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయా విభాగాల కు తోడు పర్యావరణ విభాగం కూడా వీటిని అంతే ప్రముఖమైన సవాళ్ళు గా ఎంచాలి అని ఆయన స్పష్టం చేశారు. ‘‘పర్యావరణ మంత్రిత్వ శాఖ లు ఒక ప్రాతినిధ్య తరహా మరియు ఏకీకృత వైఖరి తో పని చేయడం కీలకం. మంత్రిత్వ శాఖ ల దృష్టి కోణం లో ఎప్పుడైతే మార్పు వస్తుందో, దాని నుండి ప్రకృతి కూడా ప్రయోజనాన్ని తప్పక పొందుతుంది అని నాకు అనిపిస్తున్నది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

ఈ కార్యం ఒక్క సమాచార విభాగానికో, లేదా విద్య విభాగానికో పరిమితం కాదు అని ప్రధాన మంత్రి చెప్తూ, పర్యావరణాన్ని పరిరక్షించే విషయం లో సార్వజనిక చైతన్యం మరొక ముఖ్యమైన అంశం అని పేర్కొన్నారు. ‘‘దేశం లో అమలు చేసిన జాతీయ విద్య విధానం లో అనుభవం ఆధారం గా జ్ఞానార్జన కు పెద్ద పీట వేయడం మీకు అందరి కి ఎరుకే’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రచార ఉద్యమాని కి పర్యావరణ మంత్రిత్వ శాఖ నాయకత్వం వహించాలి అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది జీవవైవిధ్యం తాలూకు చైతన్యాన్ని బాలల్లో కలగజేయడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే బీజాల ను అంకురింపచేస్తుంది. ‘‘మన కోస్తా తీర ప్రాంతాల లో ఉండే బాలలు సముద్ర సంబంధి జీవావరణ వ్యవస్థ ను ఏ విధం గా కాపాడుకోవాలి అనే అంశాల ను నేర్చుకోవాలి. మనం మన బాలల ను మరియు భావి తరాల ను పర్యావరణం పట్ల సున్నితత్వం కలిగిన వారు గా తీర్చిదిద్దవలసిన అవసరం ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. మన రాష్ట్రాల లో విశ్వవిద్యాలయాలు, ప్రయోగశాలలు ‘జయ్ అనుసంధాన్’ మంత్రాన్ని అనుసరిస్తూ పర్యావరణ పరిరక్షణ తో ముడిపడిన నూతన ఆవిష్కరణల కు అగ్ర ప్రాథమ్యాన్ని కట్టబెట్టాలి అని ఆయన అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడం లో సాంకేతిక విజ్ఞానాన్ని అక్కున చేర్చుకోవాలి అని కూడా ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ‘‘అడవుల లో నెలకొని ఉండే స్థితుల పై అధ్యయనం, పరిశోధన లు కూడా సమాన ప్రాధాన్యం కలిగివున్నవే’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

పశ్చిమ దేశాల లో అడవుల లో మంటలు చెలరేగుతున్న దామాషా ఆందోళనకరం గా ఉంది అని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, కార్చిచ్చు కారణం గా ప్రపంచం లో వెలువడుతున్న ఉద్గారాల లో భారతదేశం యొక్క వాటా ఏమంత పెద్దది కాకపోయినప్పటికీ మనం అన్ని కాలాల్లో అప్రమత్తం గా ఉండక తప్పదు అన్నారు. ప్రతి రాష్ట్రం లోను అరణ్యాల లో చెలరేగే మంటల ను ఆర్పివేసేటటువంటి యంత్రాంగం సాంకేతిక విజ్ఞాన ఆధారితమైంది గా, పటిష్టమైంది గా రూపొందాలి అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. అలాగే మన ఫార్టెస్ట్ గార్డుల కు శిక్షణ ను ఇప్పించాలి; మరీ ముఖ్యం గా, అడవుల లో మంట లు చెలరేగినప్పుడు వాటిని ఆర్పే విషయం లో ప్రత్యేకమైన శ్రద్ధ ను తీసుకోవాలి అని కూడా శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

పర్యావరణ పరమైన ఆమోదాన్ని పొందడం లో ఉన్న జటిలతల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, అలాగే దేశ ప్రజల జీవన ప్రమాణాల ను మెరుగు పరచడం లో ప్రయాసల కు అడ్డంకులు ఎదురవుతున్నాయి అన్నారు. పండిత్ జవాహర్ లాల్ నెహ్ రూ గారు 1961వ సంవత్సరం లో ఆరంభించిన సర్ దార్ సరోవర్ ఆనకట్ట ను గురించి ఒక ఉదాహరణ గా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. పర్యావరణం పేరిట సాగించిన గూడుపుఠాణీ ల కారణం గా ఈ డ్యామ్ నిర్మాణం పూర్తి కావడానికి దశాబ్దాలు పట్టింది అని ఆయన అన్నారు. వేరు వేరు భారతదేశం యొక్క అభివృద్ధి ని ఆటంక పరచడం లో ప్రపంచ సంస్థల వద్ద నుండి మరియు ఫౌండేశన్ ల వద్ద నుండి కోట్ల కొద్దీ రూపాయలు నిధులు గా తీసుకొంటూ అర్బన్ నక్సల్స్ పోషించిన పాత్ర ను కూడా ప్రధాన మంత్రి ఆనవాలు పట్టారు. ఆనకట్ట యొక్క ఎత్తు ను పెంచడానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు తిరస్కరించడం లో ఆ కోవ కు చెందిన వ్యక్తుల కుట్ర లు ఉన్న సంగతి ని కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఈ గూడుపుఠాణీల ను వమ్ము చేయడానికి కొంత కాలం పట్టింది. అయితే, గుజరాత్ ప్రజానీకానిదే పైచేయి అయింది. ఈ డ్యాము ను పర్యావరణాని కి ఒక బెదరింపు అని అభివర్ణించడం జరుగుతోంది, మరి ప్రస్తుతం ఇదే డ్యాము పర్యావరణాన్ని కాపాడుతూ ఉన్నది గా పేరు ను తెచ్చుకొన్నది అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రతి ఒక్కరు వారి వారి రాష్ట్రాల లో ఈ తరహా అర్బన్ నక్సల్స్ సమూహాల వల లో చిక్కుకోకుండా జాగ్రత్త గా ఉండాలి అని ప్రధాన మంత్రి కోరారు. రాష్ట్రాల లో పర్యావరణ పరమైన ఆమోదం కోసం 6,000 కు పైగా ప్రతిపాదన లు, అలాగే ఫారెస్ట్ క్లియరెన్సు ల కోసం 6,500 దరఖాస్తులు ఎదురుచూస్తున్నాయి అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ‘‘ప్రతి ఒక్క సముచితమైన ప్రతిపాదన ను త్వరలోనే ఆమోదించడానికి రాష్ట్రాలు ప్రయత్నించాలి. ఈ విధమైన అనిశ్చిత స్థితి కారణం గా, వేల కొద్దీ కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల పనులు నిలచిపోయి ఉన్న సంగతి ని మీరు ఊహించవచ్చును’’ అని ఆయన అన్నారు. పెండింగు పనుల భారం తగ్గి, క్లియరెన్సు లు త్వరితగతి న లభించడానికి పని పరిస్థితుల లో ఒక మార్పు ను తీసుకు రావలసిన అవసరం ఉంది అని కూడా ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. పర్యావరణ పరమైన అనుమతి ని ఇవ్వడం లో మనం ఆ ప్రాంత ప్రజల అభివృద్ధి కి ప్రాధాన్యాన్ని, అలాగే నియమాల పాలన కు కూడా పూచీ పడాలి అని ఆయన అన్నారు. ‘‘ఇది ఇటు ఆర్థిక వ్యవస్థ కు, అటు జీవావరణానికి కూడా గెలుపు ను అందించే స్థితి అవుతుంది’’ అని ఆయన అన్నారు. ‘‘పర్యావరణం పేరు ను అనవసరం గా లేవనెత్తడం ద్వారా ‘ఈజ్ ఆఫ్ లివింగ్ మరియు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ల మార్గం లో ఎటువంటి అడ్డంకి ని ఎదురుకానీయ కూడదు అనేదే మన ప్రయత్నం కావాలి. పర్యావరణ పరమైన క్లియరెన్సు అనేది ఎంత తొందరగా దక్కితే అభివృద్ధి అంత త్వరగా చోటు చేసుకొంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

కొద్ది రోజుల క్రితం దేశ ప్రజల కు సమర్పణం చేసినటువంటి దిల్లీ లోని ప్రగతి మైదాన్ సొరంగ మార్గాన్ని ఒక ఉదాహరణ గా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ‘‘ఈ సొరంగ మార్గం కారణం గా, దిల్లీ ప్రజల కు రహదారి మధ్య లో నిలబడిపోయే అవస్థ తగ్గింది. ప్రతి సంవత్సరం 55 లక్షల కు పైగా లీటర్ ల ఇంధనాన్ని ఆదా చేయడం లో కూడా ప్రగతి మైదాన్ టనల్ సహాయకారి కాగలదు’’ అని ఆయన అన్నారు. ఇది ఏటా సుమారు 13 వేల టన్నుల కర్బన ఉద్గారాల ను తగ్గిస్తుంది. అంటే ఇది 6 లక్షల పైచిలుకు వృక్షాల తో సమానం అని నిపుణులు చెబుతున్న మాట లు. ‘‘అవి ఫ్లయ్ ఓవర్ లు కావచ్చు, రహదారులు కావచ్చు, ఎక్స్ ప్రెస్ వే లు కావచ్చు లేదా రైల్ వే పథకాలు కావచ్చు, వాటి యొక్క నిర్మాణం కర్బన ఉద్గారాల ను తగ్గించడం లో దోహదం చేస్తుంది. క్లియరెన్సు ను ఇచ్చే వేళ లో, ఈ కోణాన్ని మనం చిన్నచూపు చూడకూడదు’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

పర్యావరణాని కి సంబంధించిన అన్ని విధాలైన క్లియరెన్సుల కు ఒక సింగిల్ విండో పద్ధతి అయినటువంటి ‘పరివేశ్’ పోర్టల్ ను ఉపయోగించుకోవడం గురించి ప్రధాన మంత్రి నొక్కిచెప్తూ, ఆమోదాల ను పొందడం లో రద్దీ ని తగ్గించడం లో ఆ పోర్టల్ యొక్క పారదర్శకత్వం మరియు ప్రభావశీలత ను గురించి వివరించారు. ‘‘8 సంవత్సరాల కిందట, పర్యావరణ సంబంధి క్లియరెన్సు కు 600 పైచిలుకు రోజుల వ్యవధి పట్టేది, ఇప్పుడు దీనికి 75 రోజులే పడుతోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

పిఎమ్ గతిశక్తి నేశనల్ మాస్టర్ ప్లాన్ అమలు లోకి వచ్చిన ప్పటి నుండి మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల లో సమన్వయం అధికం అయింది; మరో పక్క అనేక ప్రాజెక్టు లు జోరు అందుకొన్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. పిఎమ్ గతిశక్తి నేశనల్ మాస్టర్ ప్లాన్ అనేది పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఒక గొప్ప ఉపకరణం గా కూడా ఉంది అని ఆయన అన్నారు. విపత్తు లు వాటిల్లితే వాటి కి ఎదురొడ్డి నిలచే తరహా మౌలిక సదుపాయాలు నెలకొనాల్సిన అవసరం గురించి కూడా ఆయన నొక్కిచెప్పారు. జలవాయు పరివర్తన కు సంబంధించిన సవాళ్ళ ను ఎదుర్కొంటూనే ఆర్థిక వ్యవస్థ లోని ప్రతి నూతన రంగాన్ని మనం ప్రభావశీలం గా ఉపయోగించుకోవాలి అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసికట్టు గా ఒక గ్రీన్ ఇండస్ట్రియల్ ఇకానమి దిశ లో ముందుకు పోవాలి’’ అని ప్రధాన మంత్రి చెప్పారు.

పర్యావరణ మంత్రిత్వ శాఖ ఒక నియంత్రణదారు సంస్థ గా మాత్రమే కాక ప్రజల ఆర్థిక సశక్తీకరణ కు ఒక గొప్ప మాధ్యమం గా కూడా అని ప్రధాన మంత్రి తన ప్రసంగం చివర లో పేర్కొన్నారు. ‘‘గమనించడాని కి, నేర్చుకోవడాని కి, ఆచరణ లో పెట్టడాని కి ఏక్ తా నగర్ లో ఎంతో ఉందన్న సంగతి ని మీరు గ్రహిస్తారు. గుజరాత్ లో కోట్ల కొద్దీ ప్రజల కు అమృతాన్ని అందిస్తున్నటువంటి సర్ దార్ సరోవర్ ఆనకట్ట ఉన్నది ఇక్కడే’’ అని కూడా ఆయన అన్నారు. ‘‘సర్ దార్ సాహెబ్ భారీ విగ్రహం ‘ఏకత ప్రతిజ్ఞ’ కు కట్టుబడి ఉండాలి అనేటటువంటి ప్రేరణ ను మనకు అందిస్తున్నది’’ అని ఆయన అన్నారు.

కేవడియా, ఏక్ తా నగర్ లలో ఉన్నటువంటి జ్ఞానార్జన అవకాశాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, జీవావరణాన్ని మరియు ఆర్థిక వ్యవస్థ ను ఏకకాలం లో అభివృద్ధి చేయడం, పర్యావరణాన్ని పటిష్ట పరచడం, కొత్త ఉపాధి అవకాశాల ను కల్పించడం, పర్యావరణ ప్రధానమైనటువంటి పర్యటనల ను అధికం చేసే ఒక సాధనం గా జీవవైవిధ్యం, మరి మన ఆదివాసి సోదరీమణులు, మన ఆదివాసి సోదరుల సంపద వృద్ధి తో పాటు వన సంపద లో పెరుగుదల ఏ విధం గా చోటు చేసుకొంటుంది అనేటటువంటి వంటి సమస్యల కు పరిష్కారాల ను ఇక్కడ కనుక్కోవచ్చును అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారి లో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, పర్యావరణం, అడవులు, జల వాయు పరివర్తన శాఖ కేంద్ర మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ ఉన్నారు.

పూర్వరంగం

సహకారాత్మక సమాఖ్యవాదం యొక్క భావన ను ముందుకు తీసుకుపోయే క్రమం లో బహుముఖ విధానం ద్వారా ప్లాస్టిక్ కాలుష్యాన్ని తొలగించడం, జలవాయు పరివర్తన కు వ్యతిరేకం గా సమర్థవంతం గా పోరాడడానికి లైఫ్ స్టయిల్ ఫార్ ఇన్ వైరన్ మెంట్ (LiFE – ‘లైఫ్’) పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటూ రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికల ను రూపొందించడం వంటి అంశాల ను పరిశీలించి ఉత్తమమైన విధానాల ను రూపొందించడం లో ఈ సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వాల కు మధ్య మరింత సమన్వయాన్ని ఏర్పరచడం కోసం నిర్వహించడం జరుగుతున్నది. సారం కోల్పోయిన భూముల ను తిరిగి వినియోగం లోకి తీసుకురావడం మరియు వన్యజీవుల సంరక్షణ అనే అంశాల పై ప్రత్యేక శ్రద్ధ ను తీసుకొంటూ అటవీప్రాంతాల రక్షక కవచాన్ని పెంచడం పైన కూడా ఈ సమావేశం దృష్టి ని సారించనుంది.

సెప్టెంబర్ 23వ మరియు 24వ తేదీ లలో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల సమావేశం లో ఆరు ఇతివృత్తాలు ఆధారం గా సాగేటటువంటి సదస్సులు ఉంటాయి. వాటి లో ఎల్ఐఎఫ్ఇ (లైఫ్ స్టయిల్ ఫార్ ఇన్ వైరన్ మెంట్); జలవాయు పరివర్తన తో పోరాటం (అప్ డేటింగ్ స్టేట్ ఏక్శన్ ప్లాన్స్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఫార్ మిటిగేశన్ ఆఫ్ ఎమిశన్స్ ఎండ్ ఆడాప్టేశన్ టు క్లైమేట్ ఇంపాక్ట్ స్); ‘పరివేశ్’ (సింగిల్ విండో సిస్టమ్ ఫార్ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ క్లియరెన్సెస్); ఫారెస్టరి మేనిజ్ మెంట్; కాలుష్యం నివారణ మరియు నియంత్రణ; వన్యజీవుల నిర్వహణ; ప్లాస్టిక్స్ మరియు వ్యర్థ పదార్థాల నిర్వహణ లపై ప్రధానం గా దృష్టి ని సారించడం జరుగుతుంది.