Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్ బనస్కాంతా బాణాసంచా కర్మాగారం పేలుడు దుర్ఘటనలో


గుజరాత్ బనస్కాంతా బాణాసంచా కర్మాగారం పేలుడు దుర్ఘటనలో ప్రాణనష్టం జరగడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు విచారం వ్యక్తం చేశారుపీఎంఎన్ఆర్ఎఫ్ నిధుల నుంచి చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలుక్షతగాత్రులకు రూ. 50,000 చొప్పున తక్షణ సహాయం అందించనున్నట్లు ప్రకటించారు.

ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

గుజరాత్ బనస్కాంతా బాణాసంచా కర్మాగారంలో పేలుడు దుర్ఘటనలో ప్రాణనష్టం జరగడం నన్ను కలిచివేసిందిమరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నానుగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానుప్రమాదం బారిన పడ్డవారికి స్థానిక పాలనా యంత్రాంగం సహాయ సహకారాలు అందిస్తోంది.

పీఎంఎన్ఆర్ఎఫ్ నిధుల నుంచి చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల  తక్షణ సాయాన్ని అందిస్తాంక్షతగాత్రులకు రూ. 50,000 నష్టపరిహారాన్ని విడుదల చేస్తున్నాం: PM @narendramodi”.  

 

 

***

MJPS/SR