Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్‌లోని నవ్‌సారి రోడ్డు దుర్ఘటనలో ప్రాణనష్టంపై ప్రధాని సంతాపం


   గుజరాత్‌లోని నవ్‌సారిలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించినవారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి పరిహారం చెల్లించనున్నట్లు శ్రీ మోదీ ప్రకటించారు.

ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“నవసారి రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం దిగ్భ్రాంతి కలిగించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ‘పీఎంఎన్‌ఆర్‌ఎఫ్’ నుంచి రూ.2 లక్షల వంతున, క్షతగాత్రుల చికిత్స నిమిత్తం రూ.50,000 వంతున అందజేస్తాం: ప్రధాని మోదీ” అని ప్రకటించింది.

****

DS/ST