Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్‌లోని అదాలజ్‌ పరిధిలోగల త్రిమందిర్‌లో అత్యుత్త‌మ పాఠ‌శాల‌ల ప‌థ‌కం ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి

గుజరాత్‌లోని అదాలజ్‌ పరిధిలోగల త్రిమందిర్‌లో అత్యుత్త‌మ పాఠ‌శాల‌ల ప‌థ‌కం ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు గుజరాత్‌లోని అదాలజ్‌లోగల త్రిమందిర్‌లో రూ.10,000 కోట్ల అంచనా వ్యయంతో అమలుచేసే అత్యుత్త‌మ పాఠ‌శాల‌ల ప‌థ‌కాన్ని (మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌) ప్రారంభించారు. అదే సమయంలో దాదాపు రూ.4260 కోట్ల విలువైన మరికొన్ని ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో కొత్త-అత్యాధునిక తరగతి గదులు, కంప్యూటర్ లేబొరేటీరీలు సహా మౌలిక వసతులను మొత్తంగా ఉన్నతీకరించి విద్యా మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడానికి ఈ పథకం తోడ్పడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- అమృత కాలం కోసం అమృత తరం సృష్టికి గుజరాత్‌ ఒక చ‌రిత్రాత్మ‌క ముందడుగు వేసిందని పేర్కొన్నారు. “అభివృద్ధి చెందిన భారతదేశం.. గుజరాత్‌ రాష్ట్రం దిశగా ఈ పథకం ఒక అవకాశంగా ఉపయోగపడుతుంది” అని ప్రధాని పేర్కొన్నారు. గుజరాత్‌ రాష్ట్రవ్యాప్తంగా ‘అత్యుత్తమ పాఠశాలల పథకం’ కిందకు వచ్చే కొత్త తరాల వారితోపాటు పౌరులు, ఉపాధ్యాయులు, యువతరానికి ఆయన అభినందనలు తెలిపారు.

   టీవల 5జి సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కరణను ప్రస్తావిస్తూ- మనం ఇప్పటిదాకా 1 నుంచి  4వ తరం ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని ఉపయోగిస్తూ వచ్చినా, 5జి సాంకేతిక పరిజ్ఞాన దేశవ్యాప్త పరివర్తనకు నాంది కాగలదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. “గడచిపోయే ప్రతి తరంతోనూ  సాంకేతిక పరిజ్ఞానం జీవితంలోని ప్రతి చిన్న అంశాన్నీ మనతో అనుసంధానించింది. అదే సమయంలో మనం వివిధ తరాల పాఠశాలలనూ చూశాం” అని శ్రీ మోదీ ఈ సందర్భంగా అన్నారు. ఈ నేపథ్యంలో 5జి సాంకేతికత సామర్థ్యాల గురించి నొక్కిచెబుతూ- అత్యాధునిక.. సౌకర్యాలు, తరగతి గదులు, బోధనలకు మించి విద్యా వ్యవస్థను మరింత ఉన్నత శిఖరాలకు చేరుస్తామని ప్రధాని చెప్పారు. “మన చిన్నారి విద్యార్థులకు పాఠశాలల్లో ఇకపై వాస్తవిక సాదృశ మాధ్యమం శక్తితోపాటు ఇంటర్నెట్‌ సౌలభ్యాలు కూడా అనుభవంలోకి వస్తాయి” అని ఆయన చెప్పారు. ‘అత్యుత్తమ పాఠశాలల పథకం’ ద్వారా గుజరాత్‌ రాష్ట్రం దేశంలోనే తొలి, అత్యంత విశిష్టమైన ముందడుగు వేసిందని ప్రధానమంత్రి హర్షం వెలిబుచ్చారు. ఈ చరిత్రాత్మక  ఘనత సాధించిన ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ను, ఆయన బృందాన్ని ప్రధానమంత్రి అభినందించారు.

   డచిన రెండు దశాబ్దాల్లో రాష్ట్ర విద్యావ్యవస్థలో వచ్చిన విశేష మార్పులపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఒకనాడు గుజరాత్లో విద్యారంగం అధ్వాన స్థితిలో ఉండేదని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలోని ప్రతి 100 మంది పిల్లలకు 20 మంది ఏనాడూ పాఠశాల ముఖం కూడా చూసినవారు కాదన్నారు. పాఠశాలకు వెళ్లగలిగిన విద్యార్థులు కూడా 8వ తరగతి తర్వాత బడి మానేసేవారని వివరించారు. ఇక బాలికల విషయానికొస్తే- అసలు పాఠశాలకు వెళ్లనిచ్చే అవకాశంమే లేదని, వారి పరిస్థితి మరింత ఘోరంగా ఉండేదని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్యా కేంద్రాల కొరతను ప్రస్తావిస్తూ- శాస్త్రవిజ్ఞాన విద్యపై ఎలాంటి ప్రణాళికలూ ఆనాడు లేవని ఎత్తిచూపారు. అయితే, “ఈ రెండు దశాబ్దాల్లో గుజరాత్ ప్రజలు తమ రాష్ట్ర విద్యా వ్యవస్థలో గుణాత్మక మార్పును చూపించారు” అని శ్రీ మోదీ నొక్కిచెప్పారు. ఈ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 1.25 లక్షలకుపైగా కొత్త తరగతి గదులు నిర్మించామని, 2 లక్షల మందికిపైగా ఉపాధ్యాయులను నియమించామని ప్రధానమంత్రి వివరించారు. “శాల ప్రవేశోత్సవ్‌, కన్యా కేలావని మహోత్సవ్‌ వంటి పథకాలను ప్రారంభించిన రోజు నాకు ఇంకా గుర్తుంది. ఒక ఇంటినుంచి కుమారుడు, కుమార్తె ఇద్దరూ తొలిసారి పాఠశాలకు వెళ్లే సందర్భాన్ని ఒక వేడుకలా చేసుకునేవారు” అని శ్రీ మోదీ గుర్తుకు తెచ్చుకున్నారు.

   విద్య నాణ్యతపై దృష్టి సారించే పండుగ ‘గుణోత్సవ్’ గురించి కూడా ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఈ రూపంలో విద్యార్థుల నైపుణ్యాలు, సామర్థ్యాలను విశ్లేషించి సముచిత పరిష్కారాలు సూచించేవారమని పేర్కొన్నారు. గుజరాత్‌లోని విద్యా సమీక్ష కేంద్రంలో ఇవాళ మరింత ఆధునిక సాంకేతికత ఆధారిత ‘గుణోత్సవ్’ నిర్వహిస్తుండటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. “కొన్ని ప్రత్యేక.. భారీ విద్యారంగ ప్రయోగాల్లో గుజరాత్ సదా ఒక భాగంగా ఉంటూ వచ్చింది. ఆ మేరకు మేము గుజరాత్‌లో తొట్టతొలి ఉపాధ్యాయ శిక్షణ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాం” అని పేర్కొన్నారు.

   రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో తాను ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్తూ తమ కుమార్తెలను పాఠశాలకు పంపాల్సిందిగా ప్రజలను అభ్యర్థించే వాడినని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. “ఇవాళ గుజరాత్‌లో దాదాపు ప్రతి ఇంటినుంచి కుమారుడు, కుమార్తె ఇద్దరూ పాఠశాలకు వెళ్లడమే కాదు… కళాశాల విద్యను కూడా పూర్తి చేస్తున్నారంటే ఆ కృషి ఫలితమే”నని వ్యాఖ్యానించారు. ఆ మేరకు పిల్లలను పాఠశాలకు పంపాలన్న తన అభ్యర్థనపై సానుకూల రీతిలో స్పందించిన తల్లిదండ్రులను కూడా ఆయన అభినందించారు.

ఒక దశాబ్దం కిందటే, టెలివిజన్ గుజరాత్ లోని 15,000 పాఠశాలల్లోకి చేరుకొన్నది. అంతేకాదు, 20 వేల కు పైచిలుకు స్కూళ్ళ లో కంప్యూటర్ ఆధారిత ప్రయోగశాల లు వెలిశాయి కూడా ను. మరి అలాగే ఆ తరహా వ్యవస్థ లు అనేకం చాలా ఏళ్ళ క్రితమే గుజరాత్ లోని పాఠశాలల్లో ఒక విడదీయలేనటువంటి భాగం గా మారాయి అని ప్రధాన మంత్రి అన్నారు. విద్య బోధన రంగం లో సాంకేతిక విజ్ఞానానిది  కీలక పాత్ర అని ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, ప్రస్తుతం గుజరాత్ లో ఒక కోటి కి పైచిలుకు విద్యార్థులు మరియు 4 లక్షల మంది కి పైగా టీచరు లు వారి యొక్క హాజరు ను ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ రోజు న గుజరాత్ లో 20 వేల పాఠశాల లు విద్య తాలూకు 5జి శకం లోకి అడుగుపెడుతున్నాయి అని కూడా అని ఆయన వివరించారు.

మిశన్ స్కూల్స్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో భాగం అయినటువంటి ప్రాజెక్టుల ను గురించి ప్రధాన మంత్రి మరిన్ని వివరాల ను తెలియజేస్తూ, ఈ స్కూళ్ళ లో 50 వేల కొత్త తరగతి గదుల ను మరియు ఒక లక్ష కు పై చిలుకు స్మార్ట్ క్లాస్ రూముల ను నిర్మించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పాఠశాల లు కేవలం ఒక ఆధునికమైనటువంటి, డిజిటల్ యుక్తమైనటువంటి మరియు భౌతిక మౌలిక సదుపాయాల ను కలిగి ఉండడం ఒక్కటే కాకుండా, ఇది బాలల విద్యాభ్యాసంలోనూ, బాలల జీవితాలలోనూ ఒక పెద్ద మార్పు ను తీసుకువచ్చేందుకు ఉద్దేశించినటువంటి ఒక ఉద్యమం కూడాను అని ఆయన అన్నారు.  ఇక్కడ బాలల సామర్థ్యాన్ని పెంచడం కోసం ప్రతి ఒక్క దశ లో కృషి చేయడం జరుగుతుంది అని ఆయన అన్నారు.
ఈ చర్య లు అన్నీ కూడాను 5జి రాక తో గొప్ప ప్రయోజనాల ను పొందుతాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఎలాగంటే ఇది అత్యుత్తమమైన కంటెంట్ ను రూపొందించడం లోను, బోధన కళ ను బలోపేతం చేయడం లోను మరియు ఉపాధ్యాయుల ను ప్రతి ఒక్కరి కి, మారుమూల ప్రాంతాల కు కూడా అందుబాటు లో ఉంచడం లో సహాయకారి అవుతుంది అని ఆయన అన్నారు. విద్య సంబంధి ఐచ్ఛికాల పరం గా చూసుకొన్నప్పుడు వైవిధ్యం మరియు సరళత్వం అనే అంశాలు నూతన జాతీయ విద్య విధానాన్ని క్షేత్ర స్థాయి కి తీసుకు వస్తాయి అని ఆయన అన్నారు. త్వరలో రాబోయే 14.5 వేల పిఎమ్-ఎస్ హెచ్ ఆర్ ఐ స్కూల్స్ ను గురించి కూడా ప్రధాన మంత్రి మాట్లాడారు. ఇవి జాతీయ విద్య విధానం అమలు లో నమూనా పాఠశాలలు గా ఉంటాయని ఆయన వివరించారు. ఈ పథకానికి 27 వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం జరుగుతుంది.

కొత్త జాతీయ విద్య విధానం దేశాన్ని బానిస మనస్తత్వం బారి నుండి విముక్తం చేసేందుకు, ప్రతిభ ను మరియు నూతన ఆవిష్కరణ ను ప్రోత్సహించేందుకు జరుగుతున్న ఒక ప్రయత్నం గా ఉంది అని ప్రధాన మంత్రి వివరించారు. ఆంగ్ల భాష తాలూకు జ్ఞానాన్ని తెలివితేటల కు ఒక కొలమానం గా తీసుకోవడం శోచనీయం అని ప్రధాన మంత్రి అన్నారు. భాష అనేది కేవలం సమాచార ప్రసారాని కి ఒక మాధ్యమం. అయితే అనేక దశాబ్దాల తరబడి దేశం గ్రామాలలోని మరియు పేద కుటుంబాల లోని ప్రతిభావంతుల తాలూకు ప్రయోజనాన్ని అందుకోవడంలో భాష ఒక అడ్డంకి గా మారింది అని ఆయన అన్నారు. ఇక ఈ స్థితి లో మార్పు ను తీసుకురావడం జరుగుతోంది. ఇప్పుడు విద్యార్థులు విజ్ఞానశాస్త్రాన్ని, సాంకేతిక విజ్ఞానాన్ని మరియు వైద్య శాస్ర్తాన్ని భారతీయ భాషల లో సైతం చదువుకొనేందుకు ఐచ్ఛికాన్ని పొందడం మొదలుపెట్టారు. పాఠ్య క్రమాల ను గుజరాతీ భాష తో సహా ఏడు భారతీయ భాషల లో సిద్ధం చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. కొత్త జాతీయ విద్య విధానం తాలూకు ‘ఏ ఒక్కరి ని వెనుక పట్టు న వదలివేయకూడదు’ అనేటటువంటి భావన ను గురించి ఆయన పునరుద్ఘాటిస్తూ, ప్రస్తుతం ఒక అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించడం కోసం ‘సబ్ కా ప్రయాస్’ (అందరి కృషి) కి తరుణం ఆసన్నం అయింది అని పేర్కొన్నారు.

విజ్ఞానశాస్త్రం మరియు జ్ఞానం సంబంధి రంగం లో భారతదేశం లోని పూర్వుల యొక్క తోడ్పాటు ను గురించి ప్రధాన మంత్రి గుర్తు చేస్తూ విద్య అనేది ప్రాచీన కాలం నుండే భారతదేశం యొక్క అభివృద్ధి లో కేంద్ర స్థానం లో నిలచింది అని వ్యాఖ్యానించారు. భారతదేశం స్వాభావికం గా జ్ఞానాని కి  సమర్థకురాలు గా ఉంటూ వచ్చింది. మరి మన పూర్వికులు ప్రపంచంలోకెల్లా అత్యుత్తమం అయినటువంటి విశ్వవిద్యాలయాల ను నిర్మించారు. అంతేకాక వందల సంవత్సరాల కు పూర్వమే అతి పెద్ద పుస్తకాలయాల ను నెలకొల్పారు అని ఆయన వివరించారు. భారతదేశం మీద దండయాత్ర లు జరిగి మరి భారతదేశం లోని ఈ సంపద ను నాశనం చేయడం కోసం తంత్రాలు సాగిన కాలం అంటూ ఒకటి ఉండడం పట్ల ప్రధాన మంత్రి విచారాన్ని వ్యక్తంచేశారు. మనం విద్య పట్ల మనకు ఉన్న గట్టి పట్టుదల ను విడనాడలేదు అని కూడా ఆయన చెప్పారు. ఈ కారణంగానే ఈనాటికి కూడాను జ్ఞానం మరియు శాస్త్రవిజ్ఞాన జగత్తు లో, నూతన ఆవిష్కరణలలో, భారతదేశం ఒక భిన్నమైనటువంటి గుర్తింపు ను కలిగివుంది అని ఆయన అన్నారు. ‘ఆజాదీ కా అమృత్ కాల్’ లో దీని పురాతన ప్రతిష్ఠ ను తిరిగి పొందడానికి ఒక అవకాశం ఉంది’’, అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ప్రధాన మంత్రి తన ప్రసంగం చివర లో, ప్రపంచంలో ఒక గొప్ప జ్ఞానయుక్త ఆర్థిక వ్యవస్థ గా మారేందుకు భారతదేశాని కి అపారమైన శక్తియుక్తులు ఉన్నాయి అని ప్రముఖం గా ప్రకటించారు. ‘‘21వ శతాబ్దం లో చాలా వరకు నూతన ఆవిష్కరణ లు శాస్త్ర విజ్ఞానానికి, సాంకేతిక విజ్ఞానానికి సంబంధించినవి భారతదేశం నుండే వెల్లడి అవుతాయి’’ అని చెప్పడానికి నేను ఏ  మాత్రం వెనుకాడను అని ఆయన అన్నారు. గుజరాత్ కు సంబంధించినంతవరకు ఒక మహత్తరమైన అవకాశం లభించనుంది అని కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ‘‘ఇంత వరకు గుజరాత్ అంటే వ్యాపారం మరియు వర్తకం.. ఈ రెండు అంశాల కు, అలాగే తయారీ కి కూడా పేరు దక్కింది. అయితే 21వ శతాబ్దం లో, గుజరాత్ దేశాని కి ఒక జ్ఞాన కేంద్రంగానూ, నూతన ఆవిష్కరణల నిలయంగానూ అభివృద్ధి చెందుతోంది. ఈ భావన కు మిశన్ స్కూల్స్ ఆఫ్ ఎక్స్ లెన్స్ మరింత ఉన్నతి ని తప్పక ప్రసాదించగలదని నేను భావిస్తున్నాను’’ అని చెబుతూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

ఈ కార్యక్రమం లో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవ్ వ్రత్, గుజరాత్ ప్రభుత్వం లో మంత్రి శ్రీ జీతూభాయి వాఘాని, శ్రీ కుబేర్ భాయి దిండోర్ మరియు శ్రీ కిరీట్ సింహ్ వాఘేలా తదితరులు పాల్గొన్నారు.

 

*****

DS/TS

***