Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్‌లో సూరత్‌ ఆహార భద్రతా సంతృప్త ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

గుజరాత్‌లో సూరత్‌ ఆహార భద్రతా సంతృప్త ప్రచారాన్ని  ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం


పేరెన్నికగన్న గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయి పటేల్ గారుకేంద్ర క్యాబినెట్ లో నా సహచరుడు శ్రీ సి.ఆర్పాటిల్ గారూగుజరాత్ రాష్ట్ర మంత్రులుఇక్కడ హాజరైన ప్రజలుసూరత్ లోని నా సోదరసోదరీమణులారా!

మీరంతా ఎలా ఉన్నారుమీరు బాగానే ఉన్నారాదేశ ప్రజలుగుజరాత్ ప్రజలు నాకు మూడోసారి ప్రధానిగా పనిచేసే అవకాశం కల్పించడం నా అదృష్టంఆ తర్వాత సూరత్ కు రావడం ఇదే తొలిసారిగుజరాత్ పెంచి పోషించిన వ్యక్తిని దేశం ప్రేమతో ఆలింగనం చేసుకుందిమీకు ఎప్పటికీ రుణపడి ఉంటానునా జీవితాన్ని తీర్చిదిద్దడంలో మీరు ముఖ్యమైన పాత్ర పోషించారునేడు నేను సూరత్‌కు వచ్చినప్పుడుసూరత్ ప్రేరణను గుర్తు తెచ్చుకోకుండాఅనుభూతి చెందకుండా ఎలా ఉండగలనుశ్రమదాతృత్వం – ఈ రెండు లక్షణాలే సూరత్‌ కు నిజంగా ప్రత్యేకతను తెచ్చిపెట్టాయిఒకరికి ఒకరు సహాయపడటంఅందరి అభివృద్ధిని వేడుక చేసుకోవడం సూరత్‌లో ప్రతి మూలలో కనిపించే గుణంసూరత్ లోని ఈ స్ఫూర్తినిభావోద్వేగాన్ని ప్రోత్సహించడంలో నేటి కార్యక్రమం ఒక ముందడుగు.

మిత్రులారా,

సూరత్ అనేక విషయాల్లో గుజరాత్‌లోనే కాదుదేశంలో కూడా ప్రముఖ నగరంగా ఉందిఇప్పుడుపేదలుఅట్టడుగున ఉన్నవారి కోసం ఆహారపోషక భద్రతను కల్పించే లక్ష్యంలో కూడా సూరత్ ముందువరసలో ఉందినూటికి నూరు శాతం మందికి ఆహార భద్రత కల్పించే విషయంలో సూరత్‌లో నిర్వహిస్తున్న ఫుడ్ సెక్యూరిటీ సాచురేషన్ (సంతృప్తతప్రచారం దేశంలోని ఇతర జిల్లాలకు కూడా ప్రేరణగా నిలవనుందిఆహార భద్రతలో 100% మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందేలా చేయడం ఈ సంతృప్త ప్రచార ఉద్దేశంఇందులో ఎటువంటి వివక్ష ఉండదుఏ ఒక్కరినీ వెనుకబడనివ్వదుఅసంతృప్తికి గానీఎలాంటి దోపిడీకి గానీ అవకాశం ఉండదుఈ కార్యక్రమం ప్రలోభాలకుఅనైతిక చర్యలకు ఎలాంటి ఆస్కారం లేకుండా అందరికీ సంపూర్ణ సంతృప్తిని అందించే పవిత్ర భావనను ముందుకు తీసుకెళ్తుందిప్రభుత్వమే లబ్ధిదారుల ముంగిటకు చేరుతుంటే ఎవరినైనా ఎలా వదిలేస్తారుఎవరినీ వదిలిపెట్టనప్పుడుఎవరూ నిర్లక్ష్యానికి గురికారుఅంతేకాకప్రతి ఒక్కరికీ ప్రయోజనాలు చేకూర్చాలనే ఉద్దేశ్యం ఉన్నప్పుడువ్యవస్థను దోపిడీ చేయడానికి ప్రయత్నించే వారు సహజంగానే తప్పుకుంటారు.

మిత్రులారా,

ఈ ప్రచారం కింద ఇక్కడ కొత్తగా 2.25 లక్షల మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారువీరిలో ఎక్కువమంది వృద్ధులైన తల్లులుఇంకా సోదరీమణులువృద్ధులువితంతువులుదివ్యాంగులు ఉన్నారుఈ స్నేహితులందరినీ ఇప్పుడు ఈ ప్రయత్నంలో చేర్చారుఇకపై ఈ కొత్త కుటుంబ సభ్యులకు ఉచిత రేషన్పౌష్టికాహారం కూడా అందనుందిలబ్దిదారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు.

మిత్రులారా,

మనందరికీ “రోటికపడా ఔర్ మకాన్” (ఆహారంవస్త్రంనివాసంఅనే మాట తెలిసే ఉంటుందిఆహారం అనేది వస్త్రంనివాసం కంటే కూడా ఎంత ముఖ్యమైనదో సూచిస్తుందిఒక పేదవాడికి ఆహారం గురించి ఆందోళన ఉంటేఆ బాధ ఏమిటన్నది నేను పుస్తకాలలో చదవాల్సిన అవసరం లేదునేను దాన్ని అనుభూతి చెందగలనుఅందుకే గత కొన్నేళ్లుగా మా ప్రభుత్వం నిరుపేదలకు ఆహార భద్రత కల్పించడానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందిఒక పేద ఇంటి లో పొయ్యి వెలగకుండాపిల్లలు కన్నీళ్లు పెట్టుకుని ఆకలితో పడుకుంటే– ఇందుకు భారత్ ఎంతమాత్రం అంగీకరించదుఅందుకే ప్రతి ఒక్కరికీ ఆహారంగృహవసతి కల్పించడం మా ప్రథమ ప్రాధాన్యాంశం.

మిత్రులారా,

ఈ రోజుమా ప్రభుత్వం పేదలకు నిజమైన తోడుగా నిలుస్తోందనివారికి అంకితభావంతో సేవలందిస్తోందని నేను సంతృప్తి చెందుతున్నానుకోవిడ్-19 మహమ్మారి సమయంలోమన పౌరులకు అత్యంత మద్దతు అవసరమైనప్పుడుమేము ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను ప్రారంభించాంఇది మానవత్వంతో నడిచే పథకంప్రతి పేద ఇంటిలో నిత్యం పొయ్యి వెలిగేలా చూసుకున్నాంఈ చొరవ ప్రపంచంలోనే అతిపెద్దదినిజంగా ప్రత్యేకమైనదిఇది నేటికీ కొనసాగుతోందిగుజరాత్ ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత విస్తరించడం సంతోషంగా ఉందిఆదాయ పరిమితిని పెంచడం ద్వారాదీని ప్రయోజనాలను ఎక్కువ మంది లబ్ధిదారులు పొందేలా గుజరాత్ చొరవ తీసుకుందినేడు కేంద్ర ప్రభుత్వం ప్రతి పేద ఇంటి పొయ్యి నిత్యం వెలిగేలా ఉండేందుకు ఏటా రూ.2.25 లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది.

మిత్రులారా,

వికసిత భారత్‘ దిశగా సాగే ప్రయాణంలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుందిదేశ ప్రజలలో పోషకాహార లోపంరక్తహీనతను నివారించేందుకు ప్రతి కుటుంబానికి సరిపడా పోషకాహారం అందించడమే మా లక్ష్యంపీఎం పోషణ్ పథకం కింద 12 కోట్ల మంది పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందుతోందిసాక్షం అంగన్ వాడీ కార్యక్రమం చిన్న పిల్లలుతల్లులుగర్భిణీ స్త్రీల పోషణ పై దృష్టి పెట్టిందిపీఎం మాతృ వందన యోజన కింద గర్భిణులకు సరైన పౌష్టికాహారం అందించేందుకు వేలాది రూపాయల ఆర్థిక సహాయం అందుతోంది.

మిత్రులారా,

పోషకాహారం అంటే మంచి ఆహారం మాత్రమే కాదుఇందులో పరిశుభ్రత కూడా ఒక కీలకమైన అంశంఅందుకే మా ప్రభుత్వం పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తోందిపరిశుభ్రత విషయానికి వస్తేజాతీయ పోటీ జరిగినప్పుడల్లా సూరత్ ఎల్లప్పుడూ టాప్ ర్యాంకింగ్ నగరాలలో ఒకటిగా ఉంటోందిఅందుకే సూరత్ ప్రజలను అభినందిస్తున్నాను.

మిత్రులారా,

దేశంలోని ప్రతి నగరంప్రతి గ్రామం మురికిని తొలగించి పరిశుభ్రత పాటించే దిశగా కృషి కొనసాగించాలన్నదే మా లక్ష్యంస్వచ్ఛభారత్ అభియాన్ వల్ల గ్రామాల్లో వ్యాధులు గణనీయంగా తగ్గాయని నేడు అనేక అంతర్జాతీయ సంస్థలు అంగీకరిస్తున్నాయిఅంతేకాకమన సి.ఆర్పాటిల్ ఇప్పుడు జల మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తున్నారుదీని కింద హర్ ఘర్ జల్ అభియాన్ అమలు జరుగుతోందిప్రతి ఇంటికీ పరిశుభ్రమైన నీరు చేరడంతో నీటి ద్వారా వచ్చే అనేక వ్యాధులు గణనీయంగా తగ్గాయి.

మిత్రులారా,

నేడుమా ఉచిత రేషన్ పథకం లక్షలాది మంది ప్రజల జీవితాన్ని సులభతరం చేసిందిఇప్పుడు అర్హులైన లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో ఆహార ధాన్యాలు అందుతున్నాయికానీ పదేళ్ల క్రితం అది సాధ్యపడలేదుమీరు ఊహించగలరామన దేశంలో కోట్లకు పైగా నకిలీ రేషన్ కార్డుదారులు ఉన్నారుగుజరాత్ లో వీటిని భూతియా కార్డులు (ఘోస్ట్ కార్డులుఅని పిలుస్తాంఅసలు పుట్టనే లేని ఐదు కోట్ల మంది వ్యక్తుల పేర్లు రేషన్ కార్డుల్లో ఉన్నాయిఈ నకిలీ గుర్తింపులను ఉపయోగించినిజమైన లబ్ధిదారులైన పేదలకు చెందాల్సిన ఆహారాన్ని దోచుకుంటున్నారుఈ విషయాన్ని మీరు నా దృష్టికి తెచ్చారుమరి నేను ఏమి చేశానువారిని పూర్తిగా తొలగించానుఈ ఐదు కోట్ల నకిలీ పేర్లను వ్యవస్థ నుంచి తొలగించిమొత్తం రేషన్ పంపిణీ వ్యవస్థను ఆధార్ కార్డుతో అనుసంధానం చేశాంఇప్పుడు మీరు ప్రభుత్వ రేషన్ దుకాణానికి వెళ్లినప్పుడుమీకు న్యాయమైన వాటా లభిస్తుందిరేషన్ కార్డులకు సంబంధించిన మరో పెద్ద సమస్యను పరిష్కరించాం.

సూరత్‌లో ఒడిశాతెలంగాణమహారాష్ట్రబీహార్ఉత్తరప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది వలస కూలీలు పని చేస్తున్నారుఒకప్పుడుఒక రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డు మరొక రాష్ట్రంలో అమలులో ఉండేది కాదుఈ సమస్యను మేము పరిష్కరించాం. “వన్ నేషన్వన్ రేషన్ కార్డ్”ను అమలు చేశాంఇప్పుడుమీ రేషన్ కార్డు ఎక్కడ జారీ చేసివున్నాదేశంలో ఎక్కడైనా మీరు మీ హక్కు పొందగలరు.ఇప్పటికే సూరత్ లోని పలువురు వలస కార్మికులు దీని ద్వారా లబ్ది పొందుతున్నారుసరైన ఉద్దేశ్యంతో విధానాలు రూపొందిస్తే అవి నిజంగా పేదలకు ఉపయోగపడతాయనడానికి ఇదే నిదర్శనం.

మిత్రులారా,

గత దశాబ్దకాలంగా దేశవ్యాప్తంగా పేదల సాధికారత కోసం ఒక లక్ష్యంతో పనిచేశాంనిరుపేదలు ఎవరిపైనా ఆధారపడకుండాభిక్షాటన చేయాల్సిన అవసరం లేకుండా రక్షణ కవచం నిర్మించాంపక్కా ఇళ్లుమరుగుదొడ్లుగ్యాస్ కనెక్షన్లుకుళాయి నీటి కనెక్షన్లు ఇవ్వడం ద్వారా పేదలలో ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాంఆ తర్వాత పేద కుటుంబాలకు బీమా భద్రత వలయాన్ని ఏర్పాటు చేశాంతొలిసారిగా దాదాపు 60 కోట్ల మంది భారతీయులకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స భరోసా కల్పించాంగతంలో పేద కుటుంబాలు జీవిత బీమాప్రమాద బీమా గురించి ఆలోచించేవారు కాదుకానీ మా ప్రభుత్వం పేదదిగువ మధ్యతరగతి ప్రజలకు బీమా భద్రత కల్పించిందిప్రస్తుతం 36 కోట్ల మంది ప్రభుత్వ బీమా పథకాల్లో చేరారుఇప్పటికే రూ.16,000 కోట్లకు పైగా బీమా క్లెయిమ్ లను పేద కుటుంబాలకు అందించారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారుమరో మాటలో చెప్పాలంటేఈ డబ్బు సంక్షోభ సమయాల్లో వారికి సహాయపడింది.

మిత్రులారా,

ఎవరూ పట్టించుకోని వారినిమోదీ పట్టించుకున్నారుఆ రోజులు గుర్తున్నాయాఒకప్పుడు ఒక పేదవాడు వ్యాపారం మొదలెట్టాలని భావించినప్పుడుబ్యాంకులు వారికి లోన్లు ఇవ్వకపోవడమే కాదుఅసలు లోపలికి కూడా రానిచ్చేవి కాదుబ్యాంకులు గ్యారంటీ కోరేవికానీ పేదవాడు ఎక్కడి నుంచి గ్యారంటీ తీసుకొస్తాడుఎవరు పేదవానికి గ్యారంటీ ఇస్తారుఅందుకేఒక పేద తల్లి కుమారుడైన మోదీ స్వయంగా వారి గ్యారంటీదారుడిగా నిలవాలని నిర్ణయించుకున్నారుపేదల గ్యారంటీ బాధ్యతను మోదీ తీసుకుని ముద్ర యోజనను ప్రారంభించారుఈరోజుముద్ర యోజన కింద ఎటువంటి పూచీకత్తు లేకుండానే 32 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేశారుప్రతిరోజూ మాపై విమర్శలు చేసే వారికి, 32 లక్షల కోట్ల రూపాయలను రాసి చూడమని చెప్పండి—అందులో ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా వారికి అర్థం కావడం కష్టంజీరో సీట్లు ఉన్నవారు ఈ సంఖ్యలను ఎలా అర్థం చేసుకుంటారుమోదీ ఈ గ్యారంటీ తీసుకునిఎటువంటి పూచీకత్తు లేకుండా ప్రజలకు 32 లక్షల కోట్ల రూపాయలను అందించారు.

మిత్రులారా,

గతంలో వీధి వ్యాపారులకుహాకర్లకుఫుట్ పాత్ కార్మికులకు ఎలాంటి సాయం చేసేందుకు ఎవరూ లేరుఒక పేద కూరగాయల వ్యాపారిని ఊహించుకోండిఅతనికి సరుకులు కొనడానికి ఉదయం 1,000 రూపాయలు అవసరంవడ్డీ వ్యాపారి వద్దకు వెడితే రూ.1000 తన పుస్తకంలో రాసి కేవలం రూ.900 మాత్రమే ఇచ్చాడురోజంతా కష్టపడిరుణం తిరిగి చెల్లించడానికి సాయంత్రం తిరిగి వెళ్ళినప్పుడు వడ్డీ వ్యాపారి మొత్తం 1,000 రూపాయలు డిమాండ్ చేశాడుఇప్పుడు చెప్పండిఆ పేదవాడు ఎలా బతుకుతాడుతన పిల్లల్ని ఎలా పోషించుకుంటాడుఅలాంటి వారికి నేరుగా బ్యాంకు రుణాలు అందించేందుకు మా ప్రభుత్వం స్వనిధి యోజనను ప్రారంభించిందిఈ ఏడాది బడ్జెట్ లో మరో అడుగు ముందుకేసి వీధి వ్యాపారులుహాకర్ల కోసం ప్రత్యేక క్రెడిట్ కార్డును ప్రకటించాంఅదేవిధంగామన విశ్వకర్మ సహచరుల గురించి కూడా మేము ఆలోచన చేశాంతరతరాలుగా మన దేశానికి సేవ చేస్తున్న చేతివృత్తులునైపుణ్యం కలిగిన కార్మికుల గురించి కూడా మేము ఆలోచించాంతొలిసారిగా పీఎం విశ్వకర్మ పథకం కింద వేలాది మంది స్నేహితులకు శిక్షణ ఇస్తున్నారువారి కళను మెరుగుపరచడానికి వారికి ఆధునిక పనిముట్లుకొత్త డిజైన్ నైపుణ్యాలను అందిస్తున్నారువారికి ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారుఫలితంగా వారు తమ సాంప్రదాయ వ్యాపారాలను విస్తరిస్తున్నారు. ‘సబ్ కా సాథ్సబ్ కా వికాస్‘ అంటే ఇదేగరీబీ హఠావో (పేదరిక నిర్మూలననినాదం విని దశాబ్దాలుగా భారతీయులు విసిగిపోయారుప్రతి ఎన్నికల సమయంలో గరీబీ హఠావో‘ నినాదాలు పునరావృతమవుతున్నా పేదరికం మాత్రం తగ్గలేదుకానీ భారతదేశంలోని 25 కోట్లకు పైగా పేద కుటుంబాలు పేదరికం నుంచి బయటపడేలా చేసిన వ్యక్తిగా మీరు నన్ను తీర్చిదిద్దారు.

మిత్రులారా,

ఇక్కడ సూరత్ లో మధ్యతరగతి కుటుంబాలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నాయిదేశాభివృద్ధిలో మధ్యతరగతి కీలక పాత్ర పోషిస్తోందిఅందుకే గత దశాబ్దకాలంగా మధ్యతరగతి సాధికారత కోసం మా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందిఈ ఏడాది బడ్జెట్ కూడా ఆ నిబద్ధతను కొనసాగిస్తోందితాజాగా ప్రకటించిన ఆదాయపు పన్ను ఉపశమనం దుకాణదారులువ్యాపార యజమానులువేతన ఉద్యోగులకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందిఇప్పుడు, 12 లక్షల రూపాయల వరకు ఆదాయం పూర్తిగా పన్ను రహితం– ఇదిఇంతకు ముందు ఎవరూ ఊహించనిదికానీ మేము దానిని చేసామువేతన జీవులకు రూ.12.75 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంపన్ను శ్లాబులను కూడా పునర్వ్యవస్థీకరించిప్రతి పన్ను చెల్లింపుదారుడికి ప్రయోజనం కలిగేలా చూశాంఇప్పుడు దేశంలోగుజరాత్సూరత్ లలో మధ్యతరగతి కుటుంబాలకు ఎక్కువ ఖర్చుపెట్టే ఆదాయం ఉంటుందివారు తమ అవసరాల కోసం ఎక్కువ ఖర్చు చేయవచ్చువారి పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టవచ్చు.

మిత్రులారా,

సూరత్ పారిశ్రామికవేత్తల నగరంఅనేక చిన్న పరిశ్రమలకుఎంఎస్ఎంఇలకు నిలయంసూరత్ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందిస్థానిక సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోందిఅందుకే ఎంఎస్ఎంఇలకు గణనీయమైన మద్దతు లభిస్తోందిమొదటమేము ఎంఎస్ఎంఇ ల నిర్వచనాన్ని మార్చాంవాటి విస్తరణకు కొత్త మార్గాలను తెరిచాంఈ ఏడాది బడ్జెట్ ఈ నిర్వచనాన్ని మరింత మెరుగుపరిచిందిగత కొన్నేళ్లుగా ఎంఎస్ఎంఇ లకు రుణాలు పొందడం సులభతరం చేశాంఎంఎస్ఎంఇలను ఆదుకునేందుకు ఈ బడ్జెట్లో రూ.5 లక్షల పరిమితితో ప్రత్యేక క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టాంఇది వారికి గణనీయమైన ఆర్థిక మద్దతును అందిస్తుందిఎస్సీఎస్టీ వర్గాలకు చెందిన మరింత మంది యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది ఎంఎస్ఎంఇ రంగంలోకి ప్రవేశించేలా ప్రోత్సహించడమే మా ప్రయత్నంఇందులో ముద్ర పథకం ప్రధాన పాత్ర పోషించిందిదళితులుఆదివాసీలుమహిళలకు తొలిసారిగా ఈ ఏడాది బడ్జెట్ లో రూ.2 కోట్ల వరకు రుణాలు ప్రకటించారుఇది సూరత్గుజరాత్ యువతకు ఎంతో మేలు చేస్తుందిమీరందరూ ముందుకు వచ్చి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నానునేను మీతో ఉన్నాను.

మిత్రులారా,

భారత్ అభివృద్ధికి దోహదపడే వివిధ రంగాల్లో సూరత్ గణనీయమైన పాత్ర పోషిస్తోందినగరంలో టెక్స్ టైల్స్కెమికల్స్ఇంజినీరింగ్ కు సంబంధించిన పరిశ్రమల విస్తరణకు కృషి చేస్తున్నాంసూరత్ ను ప్రపంచ స్థాయి కనెక్టివిటీతో గ్లోబల్ బిజినెస్ హబ్ గా మార్చాలన్నదే మా లక్ష్యంఇందుకోసం సూరత్ విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని అభివృద్ధి చేశాంవెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ఢిల్లీముంబయి ఎక్స్ప్రెస్ వేరాబోయే బుల్లెట్ ట్రైన్ వంటి ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సూరత్ వృద్ధికి కీలకం కానున్నాయిఇంకాసూరత్ మెట్రో కూడా నగరం కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తుందిఇది భారతదేశంలో ఉత్తమంగా అనుసందానమైన నగరాలలో ఒకటిగా మారుస్తుందిఈ ప్రయత్నాలు సూరత్ ప్రజల జీవితాన్ని సులభతరం చేయడమే కాకుండా వారి జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరుస్తున్నాయి.

మిత్రులారా,

మీకు గుర్తున్నట్లుగాకొన్ని రోజుల క్రితంనేను మన దేశంలోని మహిళలను వారి విజయ గాథలువిజయాలుస్ఫూర్తిదాయక జీవిత ప్రయాణాలను నమో యాప్ లో పంచుకోవాలని కోరానునమో యాప్ లో ఎంతో మంది అక్కాచెల్లెళ్లుకూతుళ్లు తమ కథలను పంచుకున్నారని తెలిస్తే మీరు సంతోషిస్తారురేపు మహిళా దినోత్సవంఈ ప్రత్యేక సందర్భంలోఈ స్ఫూర్తిదాయక సోదరీమణులుకుమార్తెలలో కొంతమందికి నా సోషల్ మీడియా ఖాతాలను అందిస్తున్నానుఈ మహిళలు వివిధ రంగాల్లో దేశాభివృద్ధికిసమాజానికి విశేష కృషి చేశారువారి విజయగాథలు దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది తల్లులుసోదరీమణులుకుమార్తెలకు ప్రేరణగా నిలుస్తాయి. ‘నారీ శక్తి‘ (మహిళా శక్తిసాధించిన విజయాలను వేడుక చేసుకోవడానికి చేసుకోవడానికి మహిళా దినోత్సవం ఒక అవకాశం. ‘నారీ శక్తి‘ దేశంలోని ప్రతి రంగంలో ఎలా ప్రభావం చూపిస్తుందో మనం చూస్తున్నాంగుజరాత్ కూడా ఇందుకు నిదర్శనంరేపు నవసరిలో నారీ శక్తికి ప్రత్యేకించిన ఒక ప్రధాన కార్యక్రమంలో పాల్గొంటానుసూరత్ లో నేటి కార్యక్రమం కూడా మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందిచాలా పెద్ద సంఖ్యలో తల్లులుఅక్కచెల్లెమ్మలు మాకు ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చారని నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను.

మిత్రులారా,

సూరత్ ఒక మినీ భారత్‌గాప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతూనే ఉంటుందిఈ లక్ష్యాన్ని సాధించేందుకు మేము నిరంతరం కృషి చేస్తూనే ఉంటాంజీవంతో నిండిన ప్రజలు నిండుగా జీవించే ప్రదేశం ప్రతిదీ అద్భుతంగా ఉండేందుకు అర్హమైనదిమరోసారిలబ్ధిదారులందరికీ హృదయపూర్వక అభినందనలునా సూరత్ సోదర సోదరీమణులారామీకు హృదయపూర్వక ధన్యవాదాలుమళ్లీ కలుద్దాంరామ్రామ్!

ధన్యవాదాలు!

గమనికప్రధాన మంత్రి ప్రసంగంలో కొన్ని భాగాలు గుజరాతీలో ఉన్నాయివాటి భావాన్ని తీసుకున్నాం.

***