వికసిత భారత్ సంకల్ప యాత్ర లబ్ధిదారులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలితాలు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో చేరేలా చూడాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా వికసిత భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నారు.
ప్రధానమంత్రితో గుజరాత్‌లోని భరూచ్‌కి చెందిన వికసిత భారత్ సంకల్ప యాత్ర లబ్ధిదారుడు,ఐటీఐ సర్టిఫికెట్, హార్డ్ వెర్ ఇంజనీరింగ్ డిప్లొమా పొందిన రైతు శ్రీ అల్పేష్‌భాయ్ చందూభాయ్ నిజామా మాట్లాడారు. వ్యవసాయ రంగంలో ఎందుకు ప్రవేశించావు అని చందూభాయ్ నిజామా ని ప్రధానమంత్రి ప్రశ్నించారు. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి తనకు వారసత్వంగా సంక్రమించిన 40 ఎకరాల భూమిలో వ్యవసాయం చేపట్టానని చందూభాయ్ నిజామా వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల సహాయంతో సబ్సిడీ ధరకు వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేశానని ఆయన ప్రధానికి తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ కింద తనకు 3 లక్షల రూపాయల సబ్సిడీ అందిందని కూడా ఆయన వివరించారు. దీనికి స్పందించిన ప్రధానమంత్రి ‘ మీ అంత వయస్సులో ఉన్నప్పుడు నాకు లక్ష రూపాయలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలీదు. మీరు లక్షల గురించి మాట్లాడుతున్నారు. మార్పు అంటే ఇదే’ అని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ సబ్సిడీ పొంది లబ్ది పొందిన శ్రీ అల్పేష్‌భాయ్ చందూభాయ్ నిజామా ను అభినందించిన ప్రధానమంత్రి ఇతర రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పరికరాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఆత్మ (అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ) ప్రాజెక్ట్‌లతో తనకు 2008 నుంచి ఉన్న అనుబంధాన్ని ఆయన వివరించారు. ఆత్మ ద్వారా తాను ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకున్నానని శ్రీ అల్పేష్‌భాయ్ తెలిపారు. . భరూచ్‌లో ప్రధాని సమక్షంలో ఆత్మ ద్వారా తాను ‘ఉత్తమ రైతు అవార్డు’ అందుకున్న అంశాన్ని శ్రీ అల్పేష్‌భాయ్ గుర్తు చేసుకున్నారు.
పక్కనే చిరునవ్వులు చిందిస్తూ కనిపించిన శ్రీ అల్పేష్‌భాయ్ కుమార్తెను ప్రధానమంత్రి పలకరించారు. ‘భారత్ మాతా కీ జై’ అని అన్నారు. దీనికి స్పందించిన శ్రీ అల్పేష్‌భాయ్ కుమార్తె ‘భారత్ మాతా కీ జై’ అని నినదించారు. చుట్టుపక్కల ఉన్న ప్రజలు ‘భారత్ మాతా కీ జై’ అని నినాదం చేయడంతో ప్రధానమంత్రి ఆనందం వ్యక్తం చేశారు.
శ్రీ అల్పేష్‌భాయ్ వంటి వారు వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్న యువతకు స్ఫూర్తి అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.ఆధునిక పద్ధతులు, ఆవిష్కరణలు కొత్త ఆలోచనలతో పొలాల నుంచి మార్కెట్ (బీజ్ సే బజార్ తక్) వరకు మెరుగైన వాతావరణాన్ని అందిస్తామని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. “విద్యావంతులైన యువత వ్యవసాయం లోకి ప్రవేశించడం ప్రభుత్వ సంకల్పానికి బలాన్నిస్తుంది” అని ఆయన అన్నారు. వ్యవసాయంలో డ్రోన్లు వినియోగించాలని రైతులకు ప్రధానమంత్రి సూచించారు. . త్వరలో 5 గ్రామాలకు రానున్న ‘మోడీ కి గ్యారెంటీ’ వాహనానికి భారీ స్వాగతం పలకాలని ప్రధానమంత్రి కోరారు.
***
Viksit Bharat Sankalp Yatra focuses on saturating government benefits, making sure they reach citizens across India. https://t.co/24KMA2DSac
— Narendra Modi (@narendramodi) December 9, 2023