Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గాజీపుర్ లో మ‌హారాజా సుహేల్ దేవ్ స్మార‌క త‌పాలా బిళ్ల విడుద‌ల మరియు వైద్య కళాశాల కు శంకుస్థాపన ల సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి ఉపన్యాసం

భార‌త్ మాతా కీ జయ్! భార‌త్ మాతా కీ జయ్! భార‌త్ మాతా కీ జయ్! మీరు నాతో పాటు ఒక నినాదాన్ని ఎలుగెత్తాల‌ంటూ నేను మిమ్మల్ని కోరుతున్నాను. నేను మ‌హారాజా సుహేల్ దేవ్ అని అంటాను. దానికి మీరు మీ రెండు చేతులను పైకి ఎత్తి ‘అమ‌ర్ ర‌హే’ అంటూ రెండు సార్లు చెప్పాలి.

మ‌హారాజా సుహేల్ దేవ్ అమ‌ర్ ర‌హే, అమ‌ర్ ర‌హే! మ‌హారాజా సుహేల్ దేవ్ అమ‌ర్ ర‌హే అమ‌ర్ ర‌హే! మ‌హారాజా సుహేల్ దేవ్ అమ‌ర్ ర‌హే అమ‌ర్ ర‌హే! మ‌హారాజా సుహేల్ దేవ్ అమ‌ర్ ర‌హే, అహ‌ర్ రేహే!

ప్రియ‌మైన నా సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

మ‌రోసారి గాజీపుర్‌ నేల‌మీద అడుగుపెట్టినందుకు నాకు చాలా సంతోషం గా వుంది. దేశ ర‌క్ష‌ణ‌ కోసం వీరోచితంగా పోరాడిన ఎంతో మంది వీరుల‌ ను అందించిన నేల ఇది. అంతే కాదు ఈ గ‌డ్డ‌ పైన ఎంతో మంది సాధువులు జీవించారు. మీరు క‌న‌బ‌రుస్తున్న ఉల్లాసం, ఉత్సాహాలే నా శ‌క్తి కి కార‌ణ‌మ‌ని చెబుతాను. ఎంతో చ‌లి గా వున్న ఈ శీత కాలం లో అత్య‌ధిక సంఖ్య‌ లో హాజ‌రై న‌న్ను ఆశీర్వ‌దిస్తున్నందుకు కృత‌జ్ఞ‌త‌లు. మీకు ఇవే నా ప్ర‌ణామాలు.

మిత్రులారా,

పూర్వాంచ‌ల్‌ ను దేశం లోని ఒక ముఖ్య‌మైన వైద్య ఆరోగ్య కేంద్రం గా తీర్చిదిద్ద‌డానికిగాను ఈ రోజు న నా ప‌ర్య‌ట‌న‌ లో అనేక ముఖ్య‌మైన చ‌ర్య‌ల‌ ను చేప‌ట్ట‌డం జ‌రుగుతుంది. అంతే కాదు ఈ ప్రాంతాన్ని వ్య‌వ‌సాయాని కి సంబంధించిన ప‌రిశోధ‌న కేంద్రం గా కూడా మార్చ‌బోతున్నాం. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌ను బ‌లోపేతం చేయ‌బోతున్నాం. గాజీపుర్ లో నిర్మించ‌బోతున్న నూత‌న వైద్య క‌ళాశాల‌ కోసం కొద్ది సేపటి క్రిత‌మే పునాది రాయి వేయ‌డం జ‌రిగింది.

ఈ రోజున పూర్వాంచ‌ల్ కు, మొత్తం ఉత్త‌ర్ ప్ర‌దేశ్ కు గర్వ‌కార‌ణ‌మైన మ‌రో విశిష్ట‌మైన ప‌ని ని చేయ‌డం జ‌రిగింది. దేశం లోని ప్ర‌తి ప్రాంత ప్ర‌తిష్ఠ ను ఇనుమ‌డింప‌చేయ‌డానికి ఉద్దేశించిన‌వే ఇలాంటి అవ‌కాశాలు. దేశం గొప్ప‌తనాన్ని, సంస్కృతి ని, దేశం కోసం ప‌ని చేసిన వీరుల ను, వారి ధైర్యాన్ని చాట‌డాని కి ఈ రోజు న కృషి చేశాం. మ‌హారాజా సుహేల్ దేవ్ స్మార‌కార్థం ఒక త‌పాలా బిళ్ల ను నేడు విడుద‌ల చేయ‌డం జ‌రిగింది. ఆయ‌న వీరోచిత గాథ ను త‌లచుకొని యావత్తు దేశం ప్ర‌ణామం ఆచరిస్తోంది. ఆయ‌న పేరు మీద విడుద‌ల చేసిన 5 రూపాయ‌ల‌ త‌పాలా బిళ్ల దేశ వ్యాప్తం గా గ‌ల తపాలా కార్యాలయాల ద్వారా ప్ర‌తి ఇంటి కి చేరుకొంటుంది. మ‌హారాజా సుహేల్ దేవ్ ఈ దేశాని కి చేసిన అద్భుత‌మైన సేవ‌పై నేటి త‌రం లో త‌గిన చైత‌న్యం క‌లిగించ‌డానికిగాను త‌పాలా బిళ్ల ద్వారా ఒక మంచి ప్ర‌య‌త్నం జ‌రిగింది.

మిత్రులారా,

భార‌త‌మాత గౌర‌వ‌మ‌ర్యాద‌ల‌ను కాపాడ‌డానికి పోరాటాలు చేసిన వీరుల్లో మ‌హారాజా సుహేల్ దేవ్ కూడా ఒక‌రు. మ‌హారాజా సుహేల్ దేవ్ వ్య‌క్తిత్వాన్నుండి దేశం లోని అణ‌గారిన వ‌ర్గాలు స్ఫూర్తి ని పొందుతుంటాయి. అలాంటి వీరుడి ని స్మ‌రించుకోవ‌డ‌మ‌నేది స‌బ్ కా సాథ్‌, స‌బ్ కా వికాస్ అనే విధాన ప్రాధాన్య‌ాన్ని చాటుతోంది. మ‌హారాజా సుహేల్ దేవ్ పాల‌న చేస్తున్న రోజుల్లో ప్ర‌జ‌లు త‌మ ఇంటి కి తాళాలు వేసుకోవాల‌ని భావించే వారు కాద‌ని అంటారు. ఆయ‌న త‌న పాల‌న కాలం లో పేద ప్ర‌జ‌ల‌కు సాధికారిత ను క‌ల్పించాల‌ని, వారి జీవితాలు సుఖంగా సాగాల‌ని ఎంత‌గానో శ్ర‌మించారు. ఆయ‌న రోడ్లు వేయించారు. తోట‌లు సాగు చేయించారు. పాఠ‌శాల‌ లను ప్రారంభించారు. అలాగే దేవాల‌యాల ను నిర్మించారు. అలా త‌న రాజ్యాన్ని ఎంతో అందం గా తీర్చిదిద్దారు. మ‌న దేశం మీద విదేశీయులు దాడి చేసిన‌ప్పుడు వారిని మ‌హారాజా సుహేల్ దేవ్ ఎంతో ధైర్యం గా ఎదుర్కొన్నారు. వారి పైన విజ‌యాన్ని సాధించారు. విదేశీయుల‌ పై యుద్ధం చేయ‌డానికి త‌న‌తో క‌లసి రావాల‌ని తోటి రాజుల‌ ను కోరారు. ఆ విధం గా శ‌త్రువుల‌ ను భ‌య‌ కంపితుల‌ ను చేశారు. అసాధార‌ణ‌మైన యుద్ధ‌వీరుని కి ఉదాహ‌ర‌ణ‌ గా నిలుస్తుంది మ‌హారాజా సుహేల్ దేవ్ జీవితం. ఆయ‌న ఒక నైపుణ్య‌ం క‌లిగిన వ్యూహ‌క‌ర్త‌. ఎంతో బ‌ల‌మైన రాజ్యాల ఐక్య‌ వేదిక‌ ను రూపొందించారు. ఆయ‌న అంద‌రితో క‌లసిపోయే వారు. అంద‌రి కోసం ప‌ని చేసే వారు.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

దేశం గ‌ర్వించ‌ద‌గ్గ యుద్ధ వీరుల‌ను స్మ‌రించుకొని వారికి ప్ర‌ణామాలు అర్పించి ఘ‌న నివాళి ఘ‌టించ‌డం మా ప్ర‌భుత్వ బాధ్య‌త‌. గ‌తంలో ప్ర‌భుత్వాలు వారిని విస్మ‌రిస్తే మా ప్ర‌భుత్వం మునుపెన్న‌డూ లేని విధంగా వారిని స్మ‌రించుకుంటోంది.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

మ‌నం మ‌హారాజా సుహేల్ దేవ్ ను గురించి మాట్లాడుకున్న‌ప్పుడు త‌ప్ప‌కుండా గుర్తు కు వ‌చ్చే ప్రాంతం బ‌హ‌రాయిచ్ జాన‌ప‌దానికి చెందిన చితౌరా. ఆ ప్ర‌దేశం లోనే త‌న‌పై దాడి చేసిన‌ వారి ని మ‌హారాజా జ‌యించారు. ఆయ‌న సాధించిన అద్భుత విజ‌యాన్ని రేప‌టి త‌రాల‌ కు తెలియ‌జేయ‌డానికిగాను అక్క‌డ మ‌హారాజా విగ్ర‌హాన్ని స్థాపించాల‌ని శ్రీ యోగీ జీ నాయ‌క‌త్వం లోని ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాని కి ఈ ఆలోచ‌న వ‌చ్చినందుకు, చ‌రిత్ర‌ ను వెలికి తీయ‌డానికి ప్ర‌య‌త్నం చేసినందుకు అభినంద‌న‌లు. అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు. మీరంద‌రూ ఇదే విధం గా మ‌హారాజా సుహేల్ దేవ్ ఇచ్చిన స్ఫూర్తి ని కొన‌సాగించాల‌ని కోరుతున్నాను.

భార‌త‌దేశ రక్ష‌ణ‌, భ‌ద్ర‌త ల విష‌యం లో కీల‌క పాత్ర పోషించిన‌ వారిని, దేశ పౌరుల సామాజిక జీవితాన్ని ఉన్న‌తం చేసిన‌ వారి ని చిర‌కాలం గుర్తుంచుకోవాల‌నే ఉద్దేశంతో బిజెపి ఆధ్వ‌ర్యం లోని కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఎంతో గొప్ప‌దైన మ‌న దేశ చారిత్రాత్మ‌క‌, పురాత‌న సంస్కృతి కాల‌క్ర‌మంలో మ‌రుగున ప‌డ‌కుండా, భావిత‌రాలు కూడా తెలుసుకునేలా మేం జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాం.

మిత్రులారా,

మ‌హారాజా సుహేల్ దేవ్ గొప్ప యుద్ధ వీరుడు మాత్ర‌మే కాదు. ఆయ‌న ద‌యార్ధ్ర హృద‌యుడు కూడాను. మ‌న ప్ర‌భుత్వం, వ్య‌వ‌స్థ‌ లు ఆయ‌న‌ లోని ద‌యాగుణాన్ని అనుస‌రించేలా మేం మా శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నాం. ఇందుకోసం కేంద్ర ప్ర‌భుత్వం, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అన్ని ర‌కాల కార్య‌క్ర‌మాల‌ ను చేప‌డుతూ చిత్త‌శుద్ధి తో ప‌ని చేస్తున్నాయి. స‌మాజం లోని పేద‌లు, అణ‌గారిన వ‌ర్గాలు, ద‌ళితులు, వెన‌క‌బ‌డిన వ‌ర్గాలు, పీడిత వ‌ర్గాల ను సాధికారుల‌ ను చేసి వారు త‌మ సొంత కాళ్ల మీద నిల‌బ‌డి అన్ని హ‌క్కుల‌ ను అనుభ‌వించేలా చేయ‌డానికి కృషి చేస్తున్నాం. ఈ క‌ల‌లను నెరవేర్చడానికి మేం కృషి చేస్తున్నాం. అట్ట‌డుగు వ‌ర్గాల‌వారి స్వ‌రం… వ్య‌వ‌స్థ‌లో అంద‌రికీ విన‌ప‌డాలని భావించాం.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

ఈ రోజున మా ప్ర‌భుత్వం సామాన్య‌ ప్ర‌జ‌ల‌ కు అందుబాటు లోకి వ‌చ్చింది. మ‌న‌ కు ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారాల ను క‌నుగొన‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం. వోట్ల‌ కోసం అప్ప‌టిక‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌ లు చేయ‌డం, కొత్త కార్య‌క్ర‌మాలు ప్రారంభించ‌డ‌ం అనే గ‌త ప్ర‌భుత్వాల సంప్ర‌దాయాన్ని మేం పూర్తి గా మార్చివేశాం. ప్ర‌భుత్వం లో వ‌చ్చిన మార్పును, విలువ‌ల ను ఎవ‌రైనా గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ కార‌ణంగానే మ‌న స‌మాజం లోని పేద‌ల గొంతు అంద‌రికీ వినిపిస్తోంది. వారి స‌మ‌స్య‌ల‌ ను తెలుసుకోవ‌డం జ‌రుగుతోంది.

మిత్రులారా,

స‌మాజం లో అట్ట‌డుగు స్థాయిలో వున్న వ్య‌క్తి కి గౌర‌వ‌ప్ర‌ద‌మైన జీవితాన్ని ఇవ్వాల‌నే ఉద్య‌మం ఇప్పుడిప్పుడే ఎదుగుతూ విస్త‌రిస్తోంది. ఇందుకోసం మా ప్ర‌భుత్వం ఎంతో బ‌ల‌మైన పునాది వేసింది. ఈ పునాది మీద బ‌ల‌మైన నిర్మాణాన్ని నెల‌కొల్పాల్సిన ప‌ని ఇంకా చేయాల్సివుంది. ఇందులో భాగంగానే ఈ దిశ‌ గా పూర్వాంచ‌ల్ లో ఆరోగ్య సేవ‌ల‌ ను విస్త‌రించే ప‌ని ని మొద‌లుపెట్టాం. ఆరోగ్య‌ సంరక్షణ రంగాన్ని తీసుకుంటే ఈ విష‌యంలో వెనుక‌బ‌డిన పూర్వాంచ‌ల్ ప్రాంతాన్ని భ‌విష్య‌త్తు లో ప్ర‌ముఖ ఆరోగ్య కేంద్రంగా తీర్చిదిద్ద‌డాని కి ప‌నుల‌ను వేగ‌వంతం చేశాం.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

కాసేప‌టి క్రిత‌మే వైద్య క‌ళాశాల కోసం శంకుస్థాపన చేయడం జ‌రిగింది. ఇది ఈ ప్రాంతం లో ఆధునిక వైద్య సౌక‌ర్యాల‌ ను అందించ‌డ‌మే కాకుండా గాజీపుర్ కోసం ప్ర‌తిభ‌ గ‌ల వైద్యుల‌ ను అందిస్తుంది. వైద్యుల‌వ్వాల‌నే ఈ ప్రాంతం యువ‌త క‌ల‌ లు నెర‌వేరుతాయి. ఈ వైద్య క‌ళాశాల‌ను 250 కోట్ల రూపాయలతో నిర్మించ‌డం జ‌రుగుతోంది. దీని నిర్మాణం పూర్త‌ి అయ్యే స‌రికి గాజీపుర్ జిల్లా ఆసుప‌త్రి 300 ప‌డ‌క‌ ల సామ‌ర్థ్యాన్ని పొందుతుంది. ఈ ఆసుప‌త్రి గాజీపుర్ తో పాటు చుట్టుప‌క్కల జిల్లాల ప్ర‌జ‌ల‌ కు కూడా సేవ‌లు అందిస్తుంది. చాలా కాలం గా మీరు దీనికోసం డిమాండ్ చేస్తూ వ‌చ్చారు. మా స‌హ‌చ‌రుడు మ‌నో సిన్హా జీ ఈ డిమాండ్ ను వినిపిస్తూనే వ‌చ్చారు. త్వర‌లోనే ఈ ఆసుప‌త్రి మీకు సేవ‌లందించ‌గ‌ల‌దు. అంతే కాదు 100 ప‌డ‌క‌ ల ప్ర‌సూతి ఆసుప‌త్రి ని కూడా గాజీపుర్ లో నిర్మించ‌డం జ‌రుగుతుంది. జిల్లా ఆసుప‌త్రి కి ఆధునిక అంబులెన్సుల సౌక‌ర్యాన్ని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ఈ సౌక‌ర్యాల‌న్నిటి ని స‌మీప భ‌విష్య‌త్తు లో విస్త‌రించ‌డం జ‌రుగుతుంది.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

వేల కోట్ల రూపాయ‌ల విలువైన ఆరోగ్య రంగ సౌక‌ర్యాల‌ ను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతోంది. గాజీపుర్ లో నూత‌నం గా వైద్య క‌ళాశాల‌, గోర‌ఖ్ పుర్ లో ఎఐఐఎం ఎస్‌, వారాణసీ లో అనేక ఆధునిక ఆసుప‌త్రులు, పాత ఆసుప‌త్రు ల విస్త‌ర‌ణ.. ఇలా అనేక సౌక‌ర్యాలు పూర్వాంచ‌ల్ కు స‌మ‌కూరుతున్నాయి.

మిత్రులారా,

దేశాని కి స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌రువాత మొద‌టిసారిగా పేదల‌ కు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లకు ఆరోగ్య సౌక‌ర్యాలు క‌ల్పించ‌డానికి పెద్ద ఎత్తున ప్రాధాన్య‌ం ఇవ్వ‌డం జ‌రుగుతోంది. ఆయుష్మాన్ భార‌త్ యోజ‌న లేదా పిఎంజెఎవై … దీన్ని కొంత మంది మోదీకేర్ గా అభివ‌ర్ణిస్తున్నారు. ఎంత మందికి వీలైతే అంత‌మంది కి ఆయుష్మాన్ భార‌త్ యోజ‌న ప్ర‌యోజ‌నాల‌ ను అందించ‌డానికి కృషి జ‌రుగుతోంది. ఈ ప‌థ‌కం లో భాగం గా కేన్స‌ర్ వంటి జ‌బ్బుల‌ కు చికిత్స చేయ‌డానికి వీలుగా 5 ల‌క్ష‌ల రూపాయల వ‌ర‌కు ఆర్ధిక సహాయాన్ని అంద‌జేయ‌డం జ‌రుగుతోంది. ఈ ప‌థ‌కాన్ని ప్రవేశ‌పెట్టిన 100 రోజుల్లోనే 6.5 లక్ష‌ల పేద సోద‌ర సోద‌రీమ‌ణుల‌ కు ఉచిత చికిత్స ను అందించ‌డం జ‌రిగింది. ఈ ప‌ని దేశ‌వ్యాప్తం గా ఉన్న ఆసుప‌త్రుల్లో జ‌రుగుతోంది. ఇలా ల‌బ్ధి పొందుతున్న‌ వారిలో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ కు చెందిన 14000 మంది వున్నారు. చికిత్స‌కోసం ఆర్ధిక స్తోమ‌త లేక మ‌ర‌ణం కోసం వేచి చూసిన‌ వారు వీరి లో ఉన్నారు. అంతే కాదు సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి తీవ్ర‌మైన జ‌బ్బుల‌ తో న‌ర‌కాన్ని అనుభ‌వించిన‌వారు ఉన్నారు. చికిత్స తీసుకుంటే మొత్తం కుటుంబం అప్పుల పాల‌వ్వాల్సిందేన‌ని వారు భ‌య‌ప‌డ్డారు. గ‌తం లో వారు మందుల‌ ను కొనుక్కోలేక చాలా ఇబ్బందులు ప‌డ్డారు. ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కం వారిలో కొత్త ఆశ‌ల ను చిగురింప చేసింది. చికిత్స కోసం ఆసుప‌త్రుల‌కు వెళ్ల‌వ‌చ్చ‌నే న‌మ్మ‌కాన్ని క‌లిగించింది. వారి కి అవ‌స‌ర‌మైన శస్త్ర చికిత్స లు జ‌రుగుతున్నాయి. చికిత్స అనంతరం వారు చాలా సంతోషం గా వారి ఇళ్ల‌కు చేరుకుంటున్నారు. అంతే కాదు దేశం లోని ప్ర‌తి కుటుంబాన్ని ప్ర‌ధాన మంత్రి జీవ‌న జ్యోతి యోజ‌న‌, సుర‌క్షా బీమా యోజ‌న వంటి ప‌థ‌కాల‌ తో అనుసంధానం చేయ‌డానికి ప్ర‌భుత్వం కృషి చేస్తోంది. రోజు కు 90 పైస‌లు, నెల‌ కు ఒక రూపాయి వంతున ప్రీమియం చెల్లించేలా ఈ ప‌థ‌కాలు ప్ర‌స్తుతం అమ‌లు లో వున్నాయి. అనుకోని ప‌రిస్థితుల్లో జ‌ర‌గ‌రానిది జ‌రిగితే 2 ల‌క్ష‌ల రూపాయల వ‌ర‌కు ఆర్ధిక సహాయాన్ని అందించ‌డం జ‌రుగుతుంది. ఈ రెండు బీమా ప‌థ‌కాల్లో దేశం లోని 20 కోట్ల మంది కి పైగా ప్ర‌జ‌లు చేరారు. వీరిలో ఒక కోటీ 75 ల‌క్ష‌ల మంది ఉత్త‌ర్ ప్ర‌దేశ్ రాష్ట్రాని కి చెందిన‌ వారు ఉన్నారు. ఇప్ప‌టికే 3,000 కోట్ల రూపాయ‌ల మేర‌కు వారికి ప్రయోజనం చేకూరింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుండి సుమారు 400 కోట్ల రూపాయల మేర‌కు ల‌బ్ధి ని పొందారు.

మిత్రులారా,

కేవ‌లం 90 పైస‌ల ప్రీమియంతో వారికి 400 కోట్ల రూపాయ‌లు అందాయి. దాంతో బాధితుల కుటుంబాల‌ కు ఆర్ధిక భ‌రోసా ల‌భించింది.

మిత్రులారా,

ఇలాంటి గొప్ప గొప్ప ప‌నులు చేయాలంటే ప్ర‌భుత్వాలు పార‌ద‌ర్శ‌కం గా, సున్నితం గా ప‌ని చేయాలి. అంతే కాదు స్వార్థ ప్ర‌యోజ‌నాలను ప‌క్క‌న‌ పెట్టి ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌ కు ప‌ట్టం క‌ట్టాలి. వ్య‌వ‌స్థ‌ లో శాశ్వ‌త మార్పుల‌ ను చేసిన‌ప్పుడే అలాంటి పెద్ద పెద్ద ప‌నుల‌ ను పూర్తి చేయ‌గ‌లం. దూర‌దృష్టి తో శాశ్వ‌త‌మైన‌, చిత్త‌శుద్ధి తో కూడిన ప్ర‌య‌త్నాలు చేయ‌డం వ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంది.

మిత్రులారా,

దేశం లో విత్త‌నం వేసిన‌ప్ప‌టి నుండి పంట‌ ను బజారు లో విక్ర‌యించేటంత‌ వ‌ర‌కు అనేక సౌక‌ర్యాల‌ ను ఏర్పాటు చేయడం జ‌రిగింది. ఇందులో భాగం గా కాశీ లో వ‌రి ప‌రిశోధ‌న కేంద్రాన్ని ఏర్పాటు చేశాము. వారాణసీ లో, గాజీపుర్ లో కార్గో కేంద్రాలు తెరిచాం. గోర‌ఖ్ పుర్ వ‌ద్ద ఎరువుల క‌ర్మాగారాన్ని నెల‌కొల్పాము. బ‌న్ సాగ‌ర్ వ‌ద్ద నీటిపారుద‌ల ప్రాజెక్టుల ను నిర్మించాం. గాజీపుర్ లోని కార్గో సెంట‌ర్ గురించి మ‌నోజ్ జీ చెప్పారు. మ‌నం పండించే ప‌చ్చి మిర్చి ని, బ‌ఠాణీల‌ ను దుబయ్ లో విక్రయించడానికి ఈ కార్గో కేంద్రం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అన్నారు. త‌ద్వారా మ‌న రైతుల‌ కు బజారు లో మంచి ధ‌ర‌లు ల‌భిస్తున్నాయి.
రైతుల ఆదాయాల‌ ను రెండింత‌లు చేయ‌డానికిగాను ఈ రోజు న ప్ర‌తి ప‌ని ని పార‌ద‌ర్శ‌కం గా చేయ‌డం జ‌రుగుతోంది. త‌క్కువ ఖ‌ర్చుతోనే అధిక ఆదాయాన్ని పొంద‌డానికి వీలుగా ఎంతో జాగ్ర‌త్త‌ గా ప‌నుల‌ను చేయ‌డం జ‌రుగుతోంది.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

మ‌ధ్య‌ ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్ ఎన్నిక‌ల్లో వోట్ల‌ ను పొంద‌డానికి ప్ర‌జ‌ల‌ ను మ‌భ్య‌పెట్టే రాజ‌కీయాల‌ ను చేశారు. అక్క‌డ ప్ర‌భుత్వాలు మార‌గానే ఎరువుల‌ కోసం రైతులు బారుల‌ లో నిల‌బ‌డుతున్నారు. ఎరువుల‌ కోసం, యూరియా కోసం ఎదురు చూసే రైతుల‌ ను లాఠీల‌ తో కొట్ట‌డం మళ్లీ మొదలైంది. నల్లబజారు వ్యాపారులు మళ్లీ చెల‌రేగిపోతున్నారు. క‌ర్నాట‌క‌ లో ల‌క్ష‌లాది రైతు ల రుణాల‌ ను మాఫీ చేస్తామ‌ని హామీలు ఇచ్చారు.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

ఈ వాస్తవాన్ని అవ‌గాహ‌న చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించండి. క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్ ఈ మ‌ధ్య‌నే ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. రైతుల‌ కు రుణ‌ మాఫీ చేస్తామ‌ని హామీ ని ఇచ్చి.. దొడ్డిదారి న అధికారం లోకి వ‌చ్చింది. రుణ‌ మాఫీ చేస్తామ‌ని ల‌క్ష‌లాది రైతుల‌ కు హామీ ని ఇచ్చారు. కానీ వారి లో ఎంద‌రి రుణాల‌ ను మాఫీ చేశారు ? నన్ను చెప్ప‌మంటారా ? ఎంత‌ మంది ల‌బ్ధి పొందారో తెలుసా ? నేను చెప్ప‌నా ? మీకు ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. ల‌క్ష‌లాది మంది రైతుల‌ కు రుణ‌ మాఫీ ని అందిస్తామ‌ని చెప్పి వారి వోట్ల‌ ను కొల్ల‌గొట్టారు. ప్ర‌జ‌ల‌ ను వంచించి వారు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. పాల‌న చేప‌ట్టిన‌ త‌రువాత ఎంత‌మంది కి రుణ‌ మాఫీ చేశారో తెలుసా? కేవ‌లం.. కేవ‌లం.. కేవ‌లం.. 800 మంది కి.

మీరు చెప్పండి ఇవి ఎలాంటి హామీలో ? ఎలాంటి ఆట‌లు వారు ఆడ‌గ‌ల‌రో మీరు చెప్పండి ?

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, కాంగ్రెస్ వారు రైతుల‌ ను ఎలా మోసం చేశారో అర్థం చేసుకోండి. రుణ‌ మాఫీ కాని వారి వెంట పోలీసులు ప‌డ్డారు. బ్యాంకుల‌ కు తిరిగి రుణాలు చెల్లించాల‌ని హెచ్చ‌రిస్తున్నారు.

మిత్రులారా,

రాజ‌కీయంగా ల‌బ్ధి పొంద‌డానికి అప్ప‌టిక‌ప్పుడు తీసుకునే నిర్ణ‌యాలు దేశాన్ని ప‌ట్టి పీడించే స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారాల‌ను అందివ్వ‌వు. 2009 ఎన్నిక‌ల‌కు ముందు ఏం జ‌రిగిందో మీ అంద‌రికీ తెలుసు. 2009 ఎన్నిక‌ల‌ కు ముందు మోస‌పూరిత హామీల‌ ను ఇచ్చారు. క‌ర్నాట‌క‌ లో ఇచ్చిన‌ట్టుగానే రుణ మాఫీ హామీ ని దేశ‌మంతా ఇచ్చారు. ఇక్క‌డ‌కు వ‌చ్చి న రైతుల‌ ను అడ‌గాల‌ని అనుకుంటున్నాను. ప‌ది సంవ‌త్స‌రాల క్రితం 2009వ సంవత్సరం లో మీ రుణాలు మాఫీ అయ్యాయా ? లేదో ? ఇప్పుడు చెప్పండి. మీకు ఏదైనా ఆర్ధిక సాయం ల‌భించిందా? ఆ రోజు న హామీ ని ఇచ్చారా ? లేదా ? హామీ ని ఇచ్చి ప్ర‌భుత్వం ఏర్ప‌డిందా ? లేదా ? ఆ త‌రువాత వారు మిమ్మ‌ల్ని మ‌రచిపోలేదా ? అటువంటి వ్యక్తుల‌ ను మీరు న‌మ్ముతారా ? మ‌భ్య‌పెట్టే హామీల‌ను ఇచ్చే వారి ని మీరు న‌మ్ముతారా ? అటువంటి మోస‌గాళ్ల‌ ను మీరు న‌మ్ముతారా ? ప్ర‌జ‌లను మోసం చేసే అలాంటి వారి ని మీరు న‌మ్ముతారా ?

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

ఈ విష‌యం తెలిస్తే మీరు ఆశ్చ‌ర్య‌పోతారు. ఆ రోజుల్లో దేశ‌వ్యాప్తం గా గ‌ల రైతుల‌ కు 6 ల‌క్ష‌ల కోట్ల రూపాయల అప్పులు ఉండేవి. అయితే వారు ఎంత రుణ‌ మాఫీ చేసింది మీకంద‌రికీ తెలుసు. రుణ‌ మాఫీ చేస్తామంటూ ఎన్నిక‌ల్లో హామీ ని ఇచ్చి గెలిచిన త‌రువాత నాట‌కం మొద‌లైంది. రైతులు ఎలా మోస‌పోయారో అనే దాని కి గ‌ణాంకాలే నిద‌ర్శ‌నం. 6 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల రుణాలు ఉంటే ఎంత మేర‌కు మాఫీ అయిందో మీకు తెలుసా ? నన్ను చెప్ప‌మంటారా ? మోస‌పూరిత హామీ లు ఎలా చేశారో మీరు ఒక సారి గుర్తు కు తెచ్చుకోండి. 6 ల‌క్ష‌ల కోట్ల రూపాయలకు పైగా రుణాలు ఉంటే వాటి లో 60 వేల కోట్ల‌ రూపాయలను మాత్ర‌మే మాఫీ చేశారు. 6 ల‌క్ష‌ల కోట్ల రూపాయల రుణాలు ఎక్క‌డ‌ ? అర‌వై వేల కోట్ల రూపాయల రుణాల మాఫీ ఎక్క‌డ‌ ? పైపెచ్చు, సిఎజి ఇచ్చిన నివేదిక ప్ర‌కారం, రుణ‌ మాఫీ లో 35 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ ను అటు రైతుల‌కు గానీ, ఇటు రుణాల‌ను చెల్లించ‌డానికి గానీ ఉప‌యోగించ‌లేదు. అంత పెద్ద మొత్తం మోస‌గాళ్ల జేబుల లోకి పోయింది. ఇది ప్ర‌జ‌ల డ‌బ్బు ను వృథా చేయ‌డం కాదా ? ఇది దొంగ‌త‌నం కాదా ? రుణాలు మాఫీ అయిన‌ వారి లో కూడా స‌ర్టిఫికెట్లు అందుకోని వారు ఎంద‌రో ఉన్నారు. ఫ‌లితం గా వారి ఖాతాల‌ కు వ‌డ్డీ జ‌మ అవుతూ వ‌చ్చింది. దాంతో పేద రైతులు ఎక్కువ వ‌డ్డీ తో రుణాల‌ ను చెల్లించవలసి వ‌చ్చింది. ఇది ఆ నాడు జ‌రిగిన పాపం.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

ఆనాడు మోస‌పోయిన‌ వారు మ‌రో సారి బ్యాంకుల ద‌గ్గ‌ర కు వెళ్లి రుణాలు తీసుకోలేక‌పోయారు. వారు మద్యాని కి బానిస‌ల‌య్యారు. వ‌డ్డీ వ్యాపార‌స్తుల ద‌గ్గ‌ర‌ కు వెళ్లి అధిక వ‌డ్డీ కి రుణాలు తీసుకోవలసి వ‌చ్చింది.

మిత్రులారా,

రుణాల మాపీ కార‌ణంగా ఎవ‌రు ల‌బ్ధి ని పొందారు ? రైతులు మాత్రం ల‌బ్ధి ని పొంద‌లేదు. కాబ‌ట్టి ఈ సారి మీరు కాంగ్రెస్ మోసాలు, అబ‌ద్ధాల ప‌ట్ల అప్ర‌మ‌త్తం గా ఉండండి. స్వామినాథన్ క‌మిశన్ చేసిన సిఫార‌సుల ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌లేద‌నే విష‌యాన్ని గుర్తు తెచ్చుకోండి. కాంగ్రెస్ ప్ర‌భుత్వం సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి స్వామినాథన్ క‌మిశన్ సిఫార‌సుల ఫైలు ను వెలికి తీయ‌లేదు. రైతులు పంట‌లు పండించ‌డానికి అయ్యే వ్య‌యాని కి ఒక‌టిన్న‌ర రెట్లు సొమ్ము ను క‌లిపి మ‌ద్ద‌తు ధ‌ర ప్ర‌క‌టించాల‌ని స్వామినాథన్ క‌మిశన్ పేర్కొంది. వారు 11 సంవ‌త్స‌రాల క్రిత‌మే స్వామినాథన్ క‌మిశన్ సిఫార‌సులను అమ‌లు చేసి వుంటే మ‌న రైతులు రుణాల ఊబి లో కూరుకుపోయి ఉండే వారు కాదు. వారి కి రుణాల అవ‌స‌ర‌మే ఉండేది కాదు. కానీ కాంగ్రెస్ ఆ ఫైలు ను తొక్కి పెట్టి మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌ ను పెంచ‌లేదు. దాంతో రైతుల జీవితాలు ధ్వంస‌ం అయ్యాయి. వారు రుణాల ఊబి లో కూరుకుపోయారు. ఇది కాంగ్రెస్ చేసిన పాప ఫ‌లితం. బిజెపి ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే ఆ ఫైలు ను బయట‌కు తీసి 22 పంట‌ల‌ కు మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌ ను పెంచింది. పంట పండించ‌డానికి అయ్యే వ్య‌యానికి ఒక‌టిన్న రెట్లు సొమ్ము ను క‌లిపింది.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

గ‌త నాలుగు సంవ‌త్స‌రాలు గా రైతుల‌ కోసం అనేక మంచి ప‌నులు చేయ‌డం జ‌రిగింది. మా ప్ర‌భుత్వం ఏర్పడిన త‌రువాత చిన్న‌, సన్న‌కారు రైతులు బ్యాంకు సేవ‌ల‌ ను పొందేలా చూశాం. మండీల‌ లో నూత‌న సౌక‌ర్యాల ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ఆధునిక సాంకేతికత సాయం తో మండీల‌ ను అభివృద్ధి చేయ‌డం జ‌రిగింది. శీత‌లీక‌ర‌ణ గిడ్డంగుల‌ ను, మెగా ఫుడ్ పార్కుల ను అభివృద్ధిప‌ర‌చ‌డం జ‌రిగింది.

మిత్రులారా,

అటు పారిశ్రామిక వేత్త‌ల‌ కు, ఇటు రైతుల‌ కు అవ‌స‌ర‌మైన ప్రాథమిక సౌక‌ర్యాల‌ ను మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. పూర్వాంచ‌ల్ లో ర‌వాణా సౌక‌ర్యాలు మెరుగు ప‌ర‌చ‌డానికిగాను ఈ నాలుగున్న‌రేళ్ల‌ లో అనేక ప్రాజెక్టుల‌ ను ఇప్ప‌టికే పూర్తి చేశాం. మ‌రికొన్నింటి ని భ‌విష్యత్తు లో పూర్తి చేస్తాం. పూర్వాంచ‌ల్ ఎక్స్ ప్రెస్ ర‌హ‌దారి కి సంబంధించిన ప‌నులు శ‌ర‌వేగం గా కొన‌సాగుతున్నాయి. .
కిందటి సారి గాజీపుర్ ను సంద‌ర్శించిన‌ప్పుడు తారిఘాట్ గాజీపుర్ రెయిల్ రోడ్డు వంతెన కోసం పునాది రాయిని వేయ‌డం జ‌రిగింది. ఈ వంతెన త్వ‌ర‌లోనే అందుబాటు లోకి వ‌స్తుంద‌ని నాకు చెప్పారు. పూర్వాంచ‌ల్ ప్ర‌జ‌లు ఢిల్లీ, హావ్ డా ప్రాంతాల‌కు వెళ్లాల‌నుకుంటే వారికి ఇది ప్ర‌త్యామ్నాయ మార్గం గా ఉంటుంది.

మిత్రులారా,

గ‌త నాలుగు నాలుగున్న‌ర సంవ‌త్స‌రాల్లో తూర్పు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కు సంబంధించిన ప‌లు ముఖ్య‌మైన రైల్వే ప్రాజెక్టుల‌ ను పూర్తి చేయ‌డం జ‌రిగింది. అనేక స్టేశన్ లను ఆధునికీకరించ‌డం జ‌రిగింది. రైల్వే లైన్ల‌ కు సంబంధించి డ‌బుల్ లైన్ లు వేయ‌డం, విద్యుదీక‌ర‌ణ ప‌నులు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు కొత్త రైళ్ల‌ ను ప్రారంభించ‌డం జ‌రిగింది. గ్రామీణ రహదారులు, జాతీయ ర‌హ‌దారులు, పూర్వాంచ‌ల్ ఎక్స్ ప్రెస్ వేలాంటివి పూర్త‌యితే ఈ ప్రాంతం స్వ‌రూప స్వ‌భావాలే పూర్తి గా మారిపోతాయి. వారాణసీ, కోల్ కాతా ల నడుమ ఈ మ‌ధ్య‌నే ప్రారంభ‌మైన నీటి ర‌వాణామార్గం తో గాజీపుర్ కు త‌ప్ప‌కుండా ల‌బ్ధి చేకూరుతుంది. ఇక్క‌డ నిర్మించ‌బోయే జెట్టీకోసం పునాది రాయి ని వేయ‌డం జ‌రిగింది. ఈ అన్ని సౌక‌ర్యాల‌ తో ఈ ప్రాతం వాణిజ్య‌, వ్యాపార కూడ‌లి గా అవ‌త‌రిస్తుంది. కొత్త కొత్త వ్యాపారాలు రావ‌డ‌మే కాకుండా ఇక్క‌డి యువ‌త‌ కు ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయి.

మిత్రులారా,

స్వ‌రాజ్ తీర్మానాల‌ ను పూర్తి చేసుకొనే దిశ‌ గా మ‌నం అడుగులు వేస్తున్నాం. ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న‌, స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్‌, ఉజ్వ‌ల యోజ‌న‌, ఆయుష్మాన్ భారత్ యోజ‌న‌, ముద్రా యోజ‌న‌, సౌభాగ్య యోజ‌న లాంటివి ప‌థ‌కాలు మాత్ర‌మే కాదు. అవి ప్ర‌జ‌ల‌ ను సాధికారుల‌ను చేసే ప‌థ‌కాలు. చిన్నారుల‌ కు విద్య‌, య‌వ‌త‌ కు ఆదాయం, వృద్ధుల‌ కు అవ‌స‌ర‌మ‌య్యే మందులు, రైతుల‌ కు నీటి వ‌న‌రులు, ప్ర‌జ‌ల ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రించే యంత్రాంగం.. ఇవి అభివృద్ధి కి సంబంధించిన ఐదు పాయ‌లు. వీటి ని సాకారం చేయ‌డానికిగాను ముందు చెప్పిన ప‌థ‌కాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

భ‌విష్య‌త్తు మీది. మీ చిన్నారుల‌ ది. ఈ యువ‌తీయువ‌కుల‌ ది. నేను మీ చిన్నారుల భ‌విష్య‌త్తు కోసం ఎంతో నిజాయతీ గా, మ‌రెంతో ప్రేమ‌ తో రాత్రి ప‌గ‌లు అనే తేడా లేకుండా ప‌ని చేస్తున్న కాప‌లాదారుడి ని మాత్ర‌మే. మీ ప్రేమ, ఆద‌ర‌ణ‌లు య‌థావిధి గా నాపైన ఉంటాయ‌ని భావిస్తున్నాను. ఈ కాప‌లాదారుని కార‌ణం గా కొంత‌ మంది దొంగ‌లు ప్ర‌శాంతం గా నిద్ర‌ పోలేక‌పోతున్నారు. మీ ఆశీస్సులు, న‌మ్మ‌కం ఇదే విధంగా కొన‌సాగితే ఈ దొంగ‌ల‌ ను ఎక్క‌డ ఉంచాలో అక్క‌డ ఉంచుతాను.

నూత‌న వైద్య క‌ళాశాల‌ ను నిర్మించుకుంటున్నందుకు మీకు మ‌రో సారి నా అభినంద‌న‌లు. మ‌హారాజా సుహేల్ దేవ్ చేసిన అత్యున్న‌త సేవ‌ల‌ కు నా ప్ర‌ణామాలు. దీంతో నా ప్ర‌సంగాన్ని ముగిస్తున్నాను.

రెండు రోజుల్లో నూత‌న సంవత్స‌రం ప్రారంభ‌మ‌వుతుంది. నూత‌న సంవ‌త్స‌ర ఆగ‌మ‌నం సంద‌ర్భం గా మీకు అంద‌రి కి నా శుభాభినంద‌న‌లు.

భార‌త్ మాతా కీ జయ్!
భార‌త్ మాతా కీ జయ్ !!

**