Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి నివాళి

గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి నివాళి


   హాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. జాతిపితకు నివాళిగా ఖాదీ, హస్తకళా ఉత్పత్తులు కొనుగోలు చేయాలని శ్రీ మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారతదేశం స్వాతంత్ర్య అమృత మహోత్సవం నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాది గాంధీ జయంతి మరింత ప్రత్యేకమైనదని శ్రీ మోదీ నొక్కి చెప్పారు. మహాత్మా గాంధీపై తన మనోభావాల వీడియోను కూడా ఆయన ప్రజలతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

#గాంధీ జయంతినాడు మహాత్మునికి నివాళి అర్పిస్తున్నాను. భారతదేశం స్వాతంత్ర్య అమృత మహోత్సవం నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాది గాంధీ జయంతి మనకెంతో ప్రత్యేకం. మనమంతా సదా బాపూజీ ఆశయాలను పాటిద్దాం. ఈ మేరకు ఆయనకు నివాళిగా ఖాదీ, హస్తకళా ఉత్పత్తులు కొనుగోలు చేయాలని నేను మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

*****

DS/ST