ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గాంధీనగర్-ముంబయి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కు గాంధీనగర్ స్టేశన్ లో ఆకుపచ్చ జెండా ను చూపించి ఆ రైలు ను ప్రారంభించారు. అక్కడి నుండి కాలూపుర్ రైల్ వే స్టేశన్ వరకు అదే రైలు లో ఆయన ప్రయాణించారు.
ప్రధాన మంత్రి గాంధీ నగర్ స్టేశను కు చేరుకొన్నప్పుడు, ఆయన వెంట గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, గుజరాత్ గవర్నరు శ్రీ ఆచార్య దేవవ్రత్, రైల్ వేస్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ మరియు గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ హర్ దీప్ సింహ్ పురీ ఉన్నారు. ప్రధాన మంత్రి వందే భారత్ ఎక్స్ ప్రెస్ 2.0 రైలు పెట్టెల ను పరిశీలించారు; అలాగే ఆ రైలు లో ఉన్న సదుపాయాల ను ఆయన గమనించారు. శ్రీ నరేంద్ర మోదీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు 2.0 యొక్క లోకోమోటివ్ ఇంజను యొక్క కంట్రోల్ సెంటర్ ను కూడా పరిశీలించారు.
ఇది జరిగిన తరువాత ప్రధాన మంత్రి గాంధీనగర్ మరియు ముంబయి ల మధ్య రాక పోక లు జరిపే వందే భారత్ ఎక్స్ ప్రెస్ తాలూకు కొత్త, ఉన్నతీకరించిన వర్షను కు పచ్చ జెండా ను చూపెట్టి, అదే రైలు లో అక్కడ నుండి కాలూపుర్ రైల్ వే స్టేశన్ వరకు ప్రయాణించారు. ప్రధాన మంత్రి రైల్ వేస్ సిబ్బంది కుటుంబ సభ్యులు, మహిళా నవపారిశ్రామికవేత్తలు, పరిశోధకులు మరియు యువజనులు సహా తన తోటి ప్రయాణికుల తో ముచ్చటించారు కూడాను. ఆయన వందే భారత్ రైళ్ళ ను విజయవంతం చేయడం కోసం కఠోరం గా శ్రమించిన శ్రమికులు, ఇంజినీర్ లు మరియు ఇతర సిబ్బంది తో కూడా మాట్లాడారు.
గాంధీనగర్, ముంబయి ల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ 2.0 గేమ్ చేంజర్ గా నిరూపణ కాగలదు; అంతేకాకుండా భారతదేశం లోని రెండు ప్రధాన వ్యాపార కేంద్రాల మధ్య కనెక్టివిటీ కి ప్రోత్సాహాన్ని కూడా అందించగలదు. దీనితో గుజరాత్ లో వ్యాపార సంస్థ ల యజమానుల కు ముంబయి కి వెళ్ళేటప్పుడు, అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పునడు విమాన యానాన్ని పోలిన సౌకర్యాలు దక్కగలవు. వారికి విమాన సర్వీసుల కు చెల్లించే ఖరీదైన చార్జీల ను చెల్లించవలసిన అగత్యమూ తలెత్తదు. గాంధీనగర్ నుండి ముంబయి వరకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ 2.0 రైలు ద్వారా ఒక వైపు ప్రయాణానికి ఇంచుమించు 6-7 గంటల సమయం పట్టవచ్చని అంచనా.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ 2.0 అనేక చక్కనైనటువంటి మరియు విమాన యానం వంటి అనుభూతి ని అందిస్తుంది అని చెప్పాలి. దీనిలో దేశీయం గా అభివృద్ధిపరచిన ట్రైన్ కలిఝన్ అవాయిడన్స్ సిస్టమ్ – ‘కవచ్’ సహా ఉన్నత అత్యాధునిక సురక్ష సౌకర్యాల ను జతపరచడమైంది.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ 2.0 రైలు అధిక ఉన్నతమైనటువంటి మరియు మెరుగైనటువంటి సౌకర్యాల తో ముస్తాబైంది. కేవలం 52 సెకనుల లో దీని గతి 0 నుండి 100 కిలో మీటర్ లు ప్రతి గంట కు అందుకోగలుగుతుంది; మరి అలాగే దీని అధికతమ వేగం ఒక్కొక్క గంట కు 180 కిలో మీటర్ ల వరకు ఉండగలదు. ఇదివరకటి వర్శన్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు బరువు 430 టన్నులు ఉండగా, దానితో పోలిస్తే ఈ ఉన్నతమైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ యొక్క బరువు 392 టన్నులు ఉంటుంది. దీనిలో వై-ఫై కంటెంట్ ఆన్-డిమాండ్ సౌకర్యాన్ని కూడా చేర్చడం జరిగింది. ప్రయాణికుల కు సమాచారాన్ని మరియు వినోదాన్ని అందించడం కోసమంటూ ప్రతి ఒక్క రైలు పెట్టె లోనూ 32 అంగుళాల తెర ఉంటుంది. అదే మునుపటి రైలు లో అయితే, ప్రతి రైలు పెట్టె లో 24 అంగుళాల తెర ఉండింది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ సరికొత్త వర్శను పర్యావరణ అనుకూలత ను కూడా కలిగి ఉంటుంది. దీని లో అమర్చిన ఎయర్ కండిశనర్ లు 15 శాతం అధిక విద్యుత్తు ను ఆదా చేయగలుగుతాయి అన్నమాట. అంతేకాకుండా, ఈ రైలు పెట్టెల లో ట్రాక్శన్ మోటారు యొక్క ధూళి కి తావు ఉండనటువంటి స్వచ్ఛమైన ఎయర్ కూలింగ్ ను కల్పించినందువల్ల దీనిలో ప్రయాణం మరింత హాయి ని అందించనుంది. ఇంతకు ముందు ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రయాణికుల కు మాత్రమే అందించిన సైడ్ రిక్లాయినర్ సీటు సదుపాయాన్ని ఇక అన్ని తరగతుల లోను అందుబాటు లోకి తీసుకు రావడం జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ కోచ్ లో 180 డిగ్రీ లు తిరిగే సీట్ ల అదనపు సౌకర్యాన్ని కల్పించడమైంది.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ యొక్క నూతన డిజైన్ లో, గాలి ని శుభ్రపరచడం కోసం రూఫ్-మౌంటెడ్ పేకేజ్ యూనిట్ (ఆర్ఎమ్ పియు) లో ఒక ఫోటో- కేటెలిటిక్ అల్ట్రావాయలెట్ ఎయర్ ప్యూరిఫికేశన్ సిస్టమ్ ను ఏర్పాటు చేయడమైంది. ఈ వ్యవస్థ ను చండీగఢ్ లో గల సెంట్రల్ సైంటిఫిక్ ఇన్ స్ట్రుమెంట్స్ ఆర్గనైజేశన్ (సిఎస్ఐఒ) సిఫారసు కు అనుగుణం గా ఆర్ఎమ్ పియు యొక్క రెండు చివరల లో అమర్చడమైంది. తత్ఫలితం గా బయటి తాజా గాలి ని మరియు తిరిగి వచ్చే గాలి ని జల్లెడపట్టి శుభ్రపరచడానికి వీలు ఉంటుంది; అంతేకాక వాటి నుండి వచ్చే క్రిములు, సూక్ష్మజీవులు, వైరస్ లు మొదలైనవాటికి తావు ఉండదన్నమాట.
PM @narendramodi is on board the Vande Bharat Express from Gandhinagar to Ahmedabad. People from different walks of life, including those from the Railways family, women entrepreneurs and youngsters are his co-passengers on this journey. pic.twitter.com/DzwMq5NSXr
— PMO India (@PMOIndia) September 30, 2022