Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గబ్బర్ తీర్థంలో మహా హారతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి

గబ్బర్ తీర్థంలో మహా హారతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి


   విత్ర నవరాత్రి పర్వదినం సందర్భంగా గబ్బర్‌ తీర్థంలో నిర్వహించిన మహా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. గుజరాత్‌లోని 51 శక్తి పీఠాలలో ఒకటైన గబ్బర్ తీర్థానికి సమీపానగల అంబాజీ ఆలయంలోనూ శ్రీ మోదీ దర్శనం చేసుకుని, పూజలు చేశారు. ఆలయ ఆచార్యులు మహా హారతి నిర్వహించారు. మరోవైపు మౌంట్ అబూ పర్వత శ్రేణిలోని కొండలపై దుర్గామాత భారీ చిత్రాన్ని లేజర్ లైట్ల సహాయంతో ప్రదర్శించారు. ఇక్కడ భక్తుల కోసం  సౌకర్యాలను మెరుగుపరిచడంపై ప్రధానమంత్రి ఆలయ అధికారులతో చర్చించారు. దుర్గామాత ప్రార్థనల్లో పాల్గొన్న తర్వాత ఆయన తన రెండు రోజుల గుజరాత్ పర్యటనను ముగించారు. ప్రధాని వెంట ఈ పర్యటనలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు.