Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గత ‘మన్ కీ బాత్’పై ప్రచురితమైన ఓ పత్రికను ప్రజల దృష్టికి తెచ్చిన ప్రధానమంత్రి; ఏప్రిల్ 24న తదుపరి ‘మన్ కీ బాత్’


   న్ కీ బాత్’ గత కార్యక్రమం ఆధారంగా ప్రచురితమైన ఒక పత్రిక గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో సమాచారం పంచుకున్నారు. అలాగే ఏప్రిల్ 24నాటి తన తదుపరి ‘మన్ కీ బాత్’ సంచిక కోసం ఎదురు చూడాల్సిందిగా కోరారు.

ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:

   ‘‘గత నెల #మన్ కీ బాత్’పై ఒక ఆసక్తికరమైన మ్యాగజైన్ ప్రచురితమైంది. ఈ కార్యక్రమంలో మనం భారతదేశం నుంచి ఎగుమతుల పెరుగుదల, ఆయుర్వేద అంకుర సంస్థలు, జల సంరక్షణ, సంప్రదాయ ఉత్సవాలు వగైరా విభిన్న అంశాలపై చర్చించాం. ఈ నేపథ్యంలో ఈ నెల 24న తదుపరి సంచికలో కలుద్దాం’’ అని పేర్కొన్నారు.

ప్రత్యేక పత్రిక కోసం కింది వెబ్ చిరునామాలో చూడండి:

http://davp.nic.in/ebook/mib/MannKiBaat_Hindi/index.html”

 

****

DS