Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గత పదేళ్లలో, పులులు, చిరుతలు, ఖడ్గమృగాల జనాభా కూడా పెరిగింది.. ఇది వన్యప్రాణుల సంరక్షణకు మనం ఎంత ప్రాధాన్యాన్నిస్తున్నామో, వాటికి చాలా కాలం కొనసాగగల నివాసస్థానాలను కల్పించడానికి ఎంతగా కృషిచేస్తున్నామో సూచిస్తోంది: ప్రధానమంత్రి


గత పది సంవత్సరాల్లో పులులు, చిరుతలు, ఖడ్గమృగాల జనాభా పెరిగిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని ఈ రోజు మాట్లాడుతూ, వన్యప్రాణులను సంరక్షించడానికి మనం ఎంత ప్రాధాన్యాన్నిస్తున్నామో, పర్యావరణానికి తక్కువ నష్టం కలిగిస్తూ ఎక్కువ కాలం కొనసాగగలిగే నివాసస్థానాలను వాటికి కల్పించడానికి ఎంతగా కృషిచేస్తున్నామో ఈ పరిణామం తెలియజేస్తోందన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, అందులో:

‘‘గత పదేళ్లలో పులులు, చిరుతలు, ఖడ్గమృగాల జనాభా సైతం పెరిగింది. ఇది వన్యప్రాణులను సంరక్షించడానికి మనం ఎంత ప్రాధాన్యాన్నిస్తున్నామో, అలాగే పర్యావరణానికి తక్కువ నష్టం కలిగే విధంగా వాటికి ఎక్కువ కాలం కొనసాగగలిగే నివాసస్థానాలను కల్పించడానికి ఎంతగా కృషిచేస్తున్నామో ఈ పరిణామం సూచిస్తోంది. #WorldWildlifeDay’’ అని పేర్కొన్నారు.

 

 

***

MJPS/SR