Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గంగా తలావ్ ను సందర్శించిన ప్రధాని

గంగా తలావ్ ను సందర్శించిన ప్రధాని


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మారిషస్ లోని పవిత్ర గంగా తలావ్ ను నేడు సందర్శించారు. ఆ పవిత్ర స్థలంలో పూజలు చేసిన ఆయన, త్రివేణి సంగమం నుంచి తెచ్చిన పవిత్ర జలాన్ని అక్కడ కలిపారు.

మహా కుంభమేళా నుంచి గంగా తలావ్ కు పవిత్ర జలాన్ని ప్రధానమంత్రి తీసుకురావడం రెండు దేశాల మధ్య ఆధ్యాత్మిక ఐక్యతకు మాత్రమే కాదు, సుసంపన్నమైన సంప్రదాయాలను పరిరక్షించి, ముందుకు తీసుకెళ్లడంలో వారి అంకిత భావానికి కూడా సంకేతం. ఆ సంప్రదాయాలే ఉమ్మడి సాంస్కృతిక సంబంధాలకు మూలం.