ఖేలో ఇండియా పేరా గేమ్స్ ఒకటో సంచిక లో పాలుపంచుకొంటున్న క్రీడాకారిణుల కు మరియు క్రీడాకారుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలిపారు.
యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ ఖేలో ఇండియా పేరా గేమ్స్ ఒకటో సంచిక దిల్లీ లో ప్రారంభం కావడం గురించి తెలియజేస్తూ, ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన సమాచారాని కి ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ –
‘‘ఒకటో ఖేలో ఇండియా పేరా గేమ్స్ ఆరంభం అవుతూ ఉన్న తరుణం లో, ఆ క్రీడల లో పాలుపంచుకొంటున్న క్రీడాకారిణుల కు మరియు క్రీడాకారుల కు ఇవే నా యొక్క శుభాకాంక్షలు. సమ్మిళితత్వం మరియు సశక్తీకరణ ల దిశ లో ఇది ఒక మహత్తరమైనటువంటి అడుగు గా ఉంది.’’ అని ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో పేర్కొన్నారు.
As the First Khelo India Para Games begin, my best wishes to all those athletes who are taking part. It is a monumental step towards inclusion and empowerment! https://t.co/l0kvfhT8Xd
— Narendra Modi (@narendramodi) December 11, 2023