Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఖుంటి లోక్‌సభ స్థానం పరిధిలోని గుమ్లా సమితిలో మహిళా వికాస్‌ మండల్ వార్షిక సర్వసభ్య సమావేశంలో 15,000 మంది పాల్గొనడంపై ప్రధాని ప్రశంస


   జార్ఖండ్‌ రాష్ట్రంలోని ఖుంటి లోక్‌సభ స్థానం పరిధిలోగల గుమ్లా సమితిలో మహిళా వికాస్ మండల్ వార్షిక సర్వసభ్య సమావేశానికి 15,000 మంది మహిళలు హాజరు కావడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ మేరకు ఖుంటి లోక్‌సభ స్థానం పరిధిలోగల  పాల్‌కోట్‌ (గుమ్లా) సమితిలో నిర్వహించిన మహిళా వికాస్ మండల్ వార్షిక సర్వసభ్య సమావేశంలో 15,000 మంది మహిళలు పాల్గొన్నారంటూ కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అర్జున్‌ ముండా చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ-

ప్రధానమంత్రి ఒక ట్వీట్‌ద్వారా ఇచ్చిన సందేశంలో:

 “ఇదెంతో అభినందించదగిన ప్రయత్నం. మహిళల భాగస్వామ్యం పెరగడం వారి సాధికారతకు, అభివృద్ధికి ఒక సంకేతం” అని పేర్కొన్నారు.