కస్టమ్స్ వ్యవహారాలలో పరస్పర అంశంపై పరస్పరం సహాయాన్ని అందించుకోవడం, ఇంకా సహకరించుకోవడం అనే అంశాలపై భారతదేశం మరియు ఫిలిప్పీన్స్ ల మధ్య ఒక ఒప్పంద పత్రంపై సంతకాలకు మరియు ఆ ఒప్పందం యొక్క అనుమోదానికి సంబంధించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ ఒప్పందం కస్టమ్స్ సంబంధిత నేరాల నివారణలోను మరియు దర్యాప్తునకు అవసరమైన సమాచారాన్ని అందుబాటులోకి తీసుకు రావడంలోను సహాయపడుతుంది. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య వాణిజ్యం సాఫీగా జరిగేందుకు మరియు రెండు దేశాల మధ్య వస్తువుల వ్యాపారం సమర్థమైన రీతిలో జరిగేందుకు కావలసిన క్లియరెన్సులకు మార్గాన్ని సుగమం చేయగలదని ఆశిస్తున్నారు.
జాతీయ స్థాయిలో తత్సంబంధిత న్యాయపరమైన ఏర్పాట్లను ఉభయ దేశాలు పూర్తి చేసిన తరువాత ఈ ఒప్పందం అమలులోకి రాగలదు.
పూర్వరంగం:
ఇరు దేశాల కస్టమ్స్ అధికారుల మధ్య సమాచారంతో పాటు రహస్య సమాచారం యొక్క ఆదాన ప్రదానం కోసం ఒక లీగల్ ఫ్రేమ్ వర్క్ కు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. కస్టమ్స్ చట్టాలు సముచిత రీతిలో వర్తించే విధంగాను, కస్టమ్స్ నేరాల నివారణలోను మరియు కస్టమ్స్ నేరాల దర్యాప్తు లోను ఈ ఒప్పందం సహాయకారిగా ఉండడంతో పాటు, చట్ట సమ్మతమైన వ్యాపారం అభివృద్ధి చెందేందుకు కూడా ఈ ఒప్పందం తోడ్పడనుంది. ఇరు పక్షాలకు చెందిన కస్టమ్స్ పాలన యంత్రాంగాల సహ సమ్మతితో ప్రతిపాదిత ఒప్పందం యొక్క ముసాయిదా పాఠాన్ని ఖరారు చేయడమైంది. భారతదేశ కస్టమ్స్ విభాగం యొక్క అవసరాలను మరియు ఆందోళనలను ఈ ముసాయిదా ఒప్పందం లెక్క లోకి తీసుకొంటుంది. మరీ ముఖ్యంగా, ప్రకటించిన కస్టమ్స్ విలువ యొక్క ఖచ్చితత్వానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం పైన, రెండు దేశాల మధ్య లావాదేవీలు జరుగుతున్న వస్తువుల యొక్క సర్టిఫికెట్స్ ఆఫ్ ఆరిజిన్ యొక్క ప్రామాణికత పైన ఈ ముసాయిదా ఒప్పందం శ్రద్ధ వహిస్తుంది.
***