కలకత్తా ఉన్నత న్యాయ స్థానం యొక్క సర్క్యూట్ బెంచ్ ను జల్ పాయీగుడీ లో ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ బెంచ్ అధికార పరిధి లో నాలుగు జిల్లాలు ఉంటాయి. అవే.. దార్జిలింగ్, కలింపోంగ్, జల్ పాయీగుడీ మరియు కూచ్ బిహార్.. లు.
కలకత్తా ఉన్నత న్యాయ స్థానం యొక్క పూర్తి స్థాయి కోర్టు 1988వ సంవత్సరం లో సమావేశమైన అనంతరం చేసిన నిర్ణయాని కి, కలకత్తా ఉన్నత న్యాయ స్థానం యొక్క సర్క్యూట్ బెంచ్ ను జల్ పాయీగుడీ లో ఏర్పాటు చేయాలని 2006 వ సంవత్సరం జూన్ 16వ తేదీన కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాని కి అనుగుణం గా తాజా నిర్ణయం ఉంది. కలకత్తా ఉన్నత న్యాయ స్థానం యొక్క ప్రధాన న్యాయమూర్తి నాయకత్వం లో న్యాయమూర్తుల బృందమొకటి జల్ పాయీగుడీ లో సర్క్యూట్ బెంచ్ కోసం ప్రతిపాదించిన ప్రదేశాన్ని 2018వ సంవత్సరం ఆగస్టు 30వ తేదీ న సందర్శించి, అక్కడ మౌలిక సదుపాయాల పరంగా చోటు చేసుకొంటున్న పురోగతి ని అంచనా వేసింది.
**