Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

క‌రియ‌ప్ప గ్రౌండ్ లో ఎన్‌సిసి ర్యాలీ ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

క‌రియ‌ప్ప గ్రౌండ్ లో ఎన్‌సిసి ర్యాలీ ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేశనల్ కేడెట్ కోర్ (ఎన్‌ సిసి) ర్యాలీ ని ఉద్దేశించి దిల్లీ లోని క‌రియ‌ప్ప గ్రౌండ్ లో గురువారం నాడు ప్ర‌సంగించారు.  ఈ కార్య‌క్ర‌మం లో కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ల‌తో పాటు త్రివిధ సాయుధ బలాల ప్రధాన అధికారులు కూడా పాల్గొన్నారు.  ప్ర‌ధాన మంత్రి గౌర‌వ వంద‌నాన్ని ప‌రిశీలించి, ఎన్‌ సిసి దళాల క‌వాతు ను స‌మీక్షించారు.  ఈ కార్య‌క్ర‌మం లో భాగం గా ఏర్పాటు చేసిన ఒక సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌ ను కూడా ఆయ‌న తిల‌కించారు.      

ఈ సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, సామాజిక జీవ‌నం లో గ‌ట్టి క్ర‌మ‌శిక్ష‌ణ ను క‌లిగి ఉండే దేశాలు అన్ని రంగాల లోనూ వ‌ర్ధిల్లుతాయ‌న్నారు.  భార‌త‌దేశం లో సామాజిక జీవ‌నం లో క్ర‌మ‌శిక్ష‌ణ భావ‌న ను నింపడం లో ఎన్‌ సిసి కి ఒక ప్ర‌ధాన‌ పాత్ర ఉంది అని ఆయ‌న చెప్పారు.  ఒక అతి పెద్ద‌ది అయిటువంటి ఏక‌రూప‌త క‌లిగినటువంటి యువ‌జ‌న సంస్థ గా ఎన్‌ సిసి రోజు రోజు కు త‌న స్థాయి ని పెంచుకొంటున్నది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  భార‌తీయ ప‌రాక్ర‌మం, భార‌తీయ సేవ సంప్ర‌దాయాలు ఎక్క‌డయితే ప్రోత్సాహానికి నోచుకొంటున్నాయో, ఎక్క‌డయితే రాజ్యాంగం ప‌ట్ల జాగృతి అంకురిస్తున్న‌దో అటువంటి చోటులన్నింటా ఎన్‌ సిసి సైనిక విద్యార్థులు వారి ఉనికి ని చాటుకొంటున్నారు అని ఆయ‌న పేర్కొన్నారు.  ఇదే మాదిరిగా ప‌ర్యావ‌ర‌ణం, జ‌ల సంర‌క్ష‌ణ లతో సంబంధం ఉన్న ఏ ప‌థ‌కం లో అయినా గాని ఎన్‌ సిసి కి భాగ‌స్వామ్యం ఉంద‌ని ఆయ‌న చెప్పారు.  క‌రోనా వంటి విప‌త్తుల కాలం లో ఎన్ సిసి కేడెట్ లు అందించిన తోడ్పాటుకు గాను వారిని ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంసించారు.

మ‌న రాజ్యాంగం లో పొందుప‌ర‌చిన విధుల‌ ను నెర‌వేర్చ‌వ‌ల‌సిన బాధ్య‌త పౌరులంద‌రికి ఉంది అని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  పౌరులు, పౌర స‌మాజం ఈ బాధ్యత ను పాటించిన‌పుడల్లా అనేక స‌వాళ్ళ‌ను సాఫ‌ల్యంగా మార్చుకోవచ్చని ఆయ‌న అన్నారు.  పౌర స‌మాజం లో ఈ విధ‌మైన క‌ర్త‌వ్య ప‌రాయ‌ణ‌త్వం, భ‌ద్ర‌త ద‌ళాల ధైర్యం.. ఇవే మ‌న దేశం లో ఒక పెద్ద భాగాన్ని ప్ర‌భావితం చేస్తున్నటువంటి న‌క్స‌లిజమ్, మావోయిజమ్ ల వెన్ను ను విరిచాయని శ్రీ మోదీ అన్నారు.  ప్ర‌స్తుతం న‌క్స‌లిజమ్ తాలూకు భయం దేశం లో చాలా పరిమితమైన భాగానికి కుదించుకుపోయింది, ప్ర‌భావితులైన యువ‌తీయువకులు అభివృద్ధి తాలూకు ప్ర‌ధాన స్ర‌వంతి లో చేర‌డానికి హింసా మార్గాన్ని విడ‌చిపెట్టారు అని ఆయ‌న వివ‌రించారు.

క‌రోనా కాలం స‌వాళ్ళ‌ తో కూడుకొన్నది అయిన‌ప్ప‌టికీ కూడా అది దేశం లో అసాధార‌ణ‌మైన కృషి కి అవ‌కాశాల‌ ను వెంటబెట్టుకు వ‌చ్చింది, దేశం సామ‌ర్ధ్యాల‌ ను మెరుగు ప‌ర‌చింది, దేశాన్ని ఆత్మ‌నిర్భ‌ర్ గా తీర్చిదిద్దింది, సామాన్య స్థితి నుంచి ఉత్త‌మ‌ స్థితి కి చేరేలా చూసింది అని ప్ర‌ధాన‌ మంత్రి అన్నారు.  దీనిలో యువ‌త ది ఓ కీల‌క‌మైన పాత్ర అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

స‌రిహ‌ద్దు ప్రాంతాల‌ లో, కోస్తా తీర ప్రాంతాల‌ లో ఎన్‌ సిసి ని విస్త‌రించే ప్ర‌ణాళిక‌ల‌ ను ప్ర‌ధాన మంత్రి వెల్ల‌డిస్తూ, ఆ కోవ‌ కు చెందిన 175 జిల్లాల‌ లో ఎన్‌ సిసి కి ఒక కొత్త భూమిక‌ ను గురించి తాను ఆగ‌స్టు 15 నాటి ప్ర‌సంగం లో ప్ర‌క‌టించిన సంగ‌తి ని గుర్తు కు తెచ్చారు.  దీనికోసం సైన్యం, వాయు సేన‌, నౌకాద‌ళం సుమారు ఒక ల‌క్ష మంది కేడెట్ లకు  శిక్ష‌ణ‌ ను అందిస్తున్నాయ‌ని ఆయ‌న తెలిపారు.  వీరిలో మూడింట ఒక వంతు మంది సైనిక విద్యార్థినులు ఉన్నార‌న్నారు.  ఎన్‌ సిసి తాలూకు శిక్ష‌ణ సంబంధిత మౌలిక స‌దుపాయాల‌ ను బ‌లోపేతం చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు.  ఇదివ‌ర‌కు కేవ‌లం ఒక ఫైరింగ్ సిమ్యులేట‌ర్ ఉంటే ప్ర‌స్తుతం అటువంటివి 98 ఏర్పాటు అవుతున్నాయ‌న్నారు.  మైక్రో ఫ్లయిట్ సిమ్యులేట‌ర్  ల‌ను కూడా 5 నుంచి 44 కు, రోయింగ్ సిమ్యులేట‌ర్ లను 11 నుంచి 60 కి పెంచ‌డం జ‌రుగుతోంద‌న్నారు.
 
ఫీల్డ్ మార్ష‌ల్ క‌రియ‌ప్ప కు ఈ రోజు న ఆయన జ‌యంతి సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రద్ధాంజలి ఘటించారు.  ఈ నాటి స‌భాస్థ‌లి శ్రీ క‌రియ‌ప్ప పేరిట ఏర్ప‌ాటైంది అంటూ ఆయ‌న ప్ర‌స్తావించారు.  సాయుధ ద‌ళాలలో సైనిక విద్యార్థినుల కు కొత్త కొత్త అవ‌కాశాలు అందివ‌స్తున్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఇటీవ‌ల ఎన్‌ సిసి లో గ‌ర్ల్ కేడెట్ ల సంఖ్య లో 35 శాతం వృద్ధి నమోదైంద‌ని చెప్తూ దీని పట్ల ఆయ‌న సంతృప్తి ని వ్య‌క్తం చేశారు.  1971 నాటి బాంగ్లాదేశ్ యుద్ధం లో విజ‌యానికి 50 సంవ‌త్స‌రాలు అయిన సంద‌ర్భం లో సాయుధ బ‌ల‌గాల‌ కు కూడా ప్ర‌ధాన మంత్రి న‌మ‌స్సులు అర్పించారు.  సైనిక విద్యార్థుల‌ ను జాతీయ యుద్ధ స్మార‌క చిహ్నాన్ని సంద‌ర్శించ‌వ‌ల‌సిందిగా ప్ర‌ధాన మంత్రి సూచ‌న చేశారు.  అంతేకాకుండా, మార్పు చేర్పుల‌ను చేసిన‌టువంటి శౌర్య పుర‌స్కారాల పోర్ట‌ల్ తో అనుబంధాన్ని క‌లిగివుండాల‌ంటూ కూడా ఆయ‌న వారికి విజ్ఞ‌ప్తి చేశారు.  ఎన్‌ సిసి డిజిట‌ల్ ప్లాట్‌ ఫార్మ్ ఆలోచ‌న‌ ల వెల్ల‌డి కి ఒక వేదిక గా చాలా వేగం గా ఎదుగుతోంద‌ని కూడా ఆయ‌న అన్నారు.

వార్షిక ఉత్స‌వాల ను గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ఈ సంవ‌త్స‌రం భార‌త‌దేశం స్వాతంత్య్రం తాలూకు 75వ సంవ‌త్స‌రం లోకి, నేతాజీ సుభాశ్ చంద్ర బోస్ 125వ జయంతి లోకి అడుగుపెడుతోంద‌న్నారు.  నేతాజీ కి చెందిన వైభ‌వోపేత‌మైనటువంటి ఉదాహ‌ర‌ణ నుంచి ప్రేర‌ణ‌ ను పొందండి అంటూ సైనిక విద్యార్థుల‌ కు ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.  భార‌త‌దేశం స్వాతంత్య్రం సంపాదించుకొన్న అనంత‌రం 100 సంవ‌త్స‌రాల మైలు రాయికి చేరుకొనే తదుపరి 25-26 సంవ‌త్స‌రాల కాలాన్ని గురించి సైతం సైనిక విద్యార్థులు ఎరుక ను క‌లిగి ఉండాలి అని శ్రీ మోదీ అన్నారు.

 

దేశం ర‌క్ష‌ణ ప‌ర‌మైన స‌వాళ్ళ తో పాటు వైర‌స్ సంబంధిత స‌వాలు ను త‌ట్టుకోవ‌డం లో క‌న‌బ‌ర‌చిన సామ‌ర్ధ్యాల‌ ను గురించి ప్ర‌ధాన మంత్రి త‌న ప్ర‌సంగం లో వివ‌రించారు.  ప్ర‌పంచం లోనే అత్యుత్త‌మ‌ యుద్ధ యంత్రాంగాల‌ లో ఒకదానిని దేశం క‌లిగివుంది అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.  కొత్త రాఫేల్ యుద్ధ విమానాలు యుఎఇ, సౌదీ అరేబియా, గ్రీస్ ల సాయం తో గ‌గ‌న‌త‌లం లోనే ఇంధ‌నాన్ని నింపుకొన్న విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించి, ఈ విన్యాసం గ‌ల్ఫ్ దేశాల తో సంబంధాలు ప‌టిష్టం కావ‌డానికి అద్దం ప‌ట్టిందన్నారు.  ఇదే మాదిరిగా 100కు పైగా ర‌క్ష‌ణ సంబంధిత సామ‌గ్రి ని భార‌త‌దేశం లోనే త‌యారు చేయాల‌ని దేశం నిర్ణ‌యించుకొంద‌న్నారు.  దీనితో పాటు, 80 తేజ‌స్ శ్రేణి పోరాట విమానాల కోసం వాయు సేన ఇచ్చిన ఆర్డ‌రు కృత్రిమ మేధ (ఎఐ) సంబంధిత సంగ్రామం ప‌ట్ల శ్ర‌ద్ధ‌ ను పెంచింద‌ని, ఇది ర‌క్ష‌ణ సామ‌గ్రి కి భార‌త‌దేశం ఒక బ‌జారు గా ఉండే క‌ంటే ఆ త‌ర‌హా సామ‌గ్రి  కి ప్ర‌ధాన‌ ఉత్ప‌త్తిదారు గా నిల‌బ‌డ‌టానికి పూచీ ప‌డుతుంది అని ఆయ‌న అన్నారు.

కేడెట్ లు స్థానికం గా ఉత్ప‌త్తి అయ్యే వ‌స్తువుల వినియోగం ప‌ట్ల మొగ్గు చూపాల‌ని (‘వోకల్ ఫార్ లోకల్’) ప్ర‌ధాన మంత్రి ఉద్భోదించారు.  యువ లోకం లో ఒక కొత్త పోక‌డ‌లు పోయిన‌టువంటి బ్రాండు గా ఖాదీ ఆవిర్భవించిన సంగ‌తి ని ఆయ‌న ప్ర‌స్తావించి, ఫ్యాశన్ ప‌రం గా, పెళ్ళిళ్ళ‌లోను, పండుగ ల వేళ‌ల్లోను, ఇంకా ఇత‌ర‌త్రా సన్నివేశాలలోను స్థానిక ఉత్ప‌త్తుల కు పెద్ద‌ పీట వేయ‌డాన్ని గురించి ప్ర‌స్తావించారు.  స్వ‌యంస‌మృద్ధ‌ియుత భార‌త‌దేశానికి ఆత్మ‌విశ్వాసం క‌లిగిన యువ‌త ఎంతైనా ముఖ్య‌ం అని ఆయ‌న చెప్పారు.  ఈ దిశ‌ లో ప్ర‌భుత్వం శరీర దారుఢ్యం, విద్య‌, నైపుణ్య సాధ‌న రంగం లో కృషి చేస్తోంద‌న్నారు.  అట‌ల్ టింక‌రింగ్ ల్యాబ్స్ నుంచి ఆధునిక విద్య సంస్థ‌ల వ‌ర‌కు, స్కిల్ ఇండియా నుంచి ‘ముద్ర’ (MUDRA) ప‌థ‌కాల వ‌ర‌కు ఈ విషయం లో కొత్త వేగ గ‌తి ని గ‌మ‌నించ‌వ‌చ్చ‌ని ఆయ‌న చెప్పారు.  ‘ఫిట్ ఇండియా’, ‘ఖేలో ఇండియా’ ఉద్య‌మాలు, ఎన్‌ సిసి లో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల ద్వారా శ‌రీర దృఢ‌త్వానికి, క్రీడ‌ల‌కు ఇదివ‌ర‌కు ఎన్నడు లేనంత‌ గా ప్రోత్సాహాన్ని ఇవ్వ‌డం జ‌రుగుతోంది అని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  నూత‌న జాతీయ విద్య విధానం విద్యార్థులు వారి ఆస‌క్తి కి, అవ‌స‌రాల‌ కు త‌గిన స‌బ్జెక్టును ఎంపిక చేసుకొనే వెసులుబాటు ను ఈ విధానం లో క‌ల్పించ‌డ‌ం ద్వారా యావ‌త్తు వ్య‌వ‌స్థ ను విద్యార్థి కేంద్ర బిందువుగా ఉండేట‌ట్లు మార్చివేస్తున్నద‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.  సంస్క‌ర‌ణ‌లు అందించే అవ‌కాశాల ను యువ‌తీ యువ‌కులు స‌ద్వినియోగం చేసుకొంటే దేశం ముందుకు సాగుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

 

 

 

***