Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

క్షేత్ర స్థాయి లో మార్పు ను తీసుకువస్తున్న వ్యక్తుల ను ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’)కార్యక్రమం మెచ్చుకొంటోంది: ప్రధాన మంత్రి


‘‘వాయస్ ఆఫ్ ఇండియా-మోదీ ఎండ్ హిజ్ ట్రాన్స్ ఫార్మేటివ్ మన్ కీ బాత్ ’’ అనే పేరు తో ఒక కాఫీ టేబల్ బుక్ ను తీసుకు వచ్చిన సిఎన్ఎన్ న్యూజ్ 18 నెట్ వర్క్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు. ఈ పుస్తకాన్ని భారతదేశం ఉప రాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ న్యూజ్ 18 రైజింగ్ ఇండియా సమిట్ లో ఆవిష్కరించారు. ఈ పుస్తకం దీని లో ప్రస్తావించినటువంటి వ్యక్తుల ను మరియు వారు కలుగజేసినటువంటి ప్రభావాన్ని గుర్తిస్తున్నది.

 

ఉప రాష్ట్రపతి చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిస్పందిస్తూ –

‘‘ #MannKiBaat (‘మనసు లో మాట’) కార్యక్రమం తాలూకు అత్యంత సుందరమైనటువంటి కోణం ఏమిటి అంటే అది క్షేత్ర స్థాయి లో మార్పు ను తీసుకు వచ్చే వ్యక్తుల ను గురించి ప్రశంసిస్తుండడమే. ఈ కార్యక్రమం వంద భాగాల ను పూర్తి చేసుకోనున్న తరుణం లో, ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో ప్రస్తావన కు వచ్చిన వ్యక్తుల ను మరియు వారు కలుగజేసినటువంటి ప్రభావాల ను గుర్తించిన @CNNnews18 యొక్క ప్రయాస ను నేను అభినందిస్తున్నాను.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

****

DS