క్షయవ్యాధిని నిర్మూలించాలన్న భారతదేశ లక్ష్యానికి తోడ్పాటును అందిస్తున్న ప్రతి ఒక్కరినీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హృదయపూర్వకంగా అభినందించారు. క్షేత్ర స్థాయిలో చేస్తున్న ప్రయత్నాలు వేగంపుంజుకుంటున్నాయనీ, ఈ కృషి ఆరోగ్యప్రదమైన, క్షయవ్యాధికి తావులేని భారత్కు బాట పరుస్తోందనీ ఆయన స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రి శ్రీ జె.పి. నడ్డా ‘ఎక్స్’లో పొందుపరిచిన ఒక సందేశానికి ప్రధాని ప్రతిస్పందిస్తూ..
‘‘క్షయవ్యాధిపై పోరాటాన్ని బలపరచడంతోపాటు టీబీ రహిత భారత్ (#TBMuktBharat) కోసం తోడ్పాటును అందిస్తున్న వారందరినీ నేను అభినందిస్తున్నాను. ఈ ప్రయత్నం క్షేత్ర స్థాయిలో జోరందుకుంటూ, ఆరోగ్యభరితమైన భారత్ ఆవిష్కారానికి ఎలా పూచీపడుతోందనేది గమనించదగ్గ విషయం’’ అని రాశారు.
I compliment all those who are strengthening the fight against TB and contributing to a #TBMuktBharat. It is noteworthy how this effort is gaining momentum at the grassroots level, thus ensuring a healthier India. https://t.co/geWc0AwcsY
— Narendra Modi (@narendramodi) March 26, 2025