క్షయరహిత భారత్‌ను సాకారం చేసే ఉద్దేశంతో 100 రోజుల పాటు ఉధృత ఉద్యమాన్ని చేపట్టగా ఆ ఉద్యమం ఇటీవలే ముగిసింది. ఈ ఉద్యమ ముఖ్యాంశాల్ని తెలియజేస్తూ కేంద్ర మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా రాసిన ఓ వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. క్షయరహిత భారత్ ఆవిష్కారం దిశగా ఈ ఉద్యమం ఒక బలమైన పునాదిని వేసింది.
ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’లో ఒక సందేశంలో ఇలా పేర్కొంది:
‘‘క్షయపై భారత్ పోరాటం విశేష పురోగతిని నమోదు చేస్తోంది. 100 రోజుల పాటు ముమ్మరంగా సాగి ఇటీవలే ముగిసిన క్షయరహిత భారత్ ఉద్యమం ముఖ్యాంశాల్ని కేంద్ర మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా (@JPNadda) ఒక వ్యాసం రూపంలో వివరించారు. క్షయరహిత భారత్ సాధన దిశగా ఈ ఉద్యమం ఒక బలమైన పునాదిని వేసింది.. చదివి తీరాల్సిన వ్యాసమిది.’’
India’s fight against TB is witnessing remarkable progress. The Union Health Minister, Shri @JPNadda shares key insights on the recently concluded 100-day Intensified TB Mukt Bharat Abhiyaan which has set a strong foundation for a TB-free India – A must read. https://t.co/xxvrfofqVD
— PMO India (@PMOIndia) March 25, 2025