ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 12న వర్చువల్ పద్ధతి లో జరిగే లీడర్స్ సమిట్ ఆఫ్ ద క్వాడ్రిలాటరల్ ఫ్రేమ్ వర్క్ ఒకటో సమావేశం లో పాలుపంచుకోనున్నారు. ఈ శిఖర సమ్మేళనం లో ఆయన తో పాటు ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని శ్రీ యోశిహిదే సుగా, యుఎస్ఎ అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ ఆర్. బైడెన్ లు కూడా పాల్గొంటారు.
ఈ నేత లు ఉమ్మడి హితం ముడిపడ్డ ప్రాంతీయ అంశాల ను, ప్రపంచ అంశాల ను గురించి చర్చిస్తారు. అలాగే, ఒక స్వతంత్రమైన, బాహాటమైన, సమ్మిళితమైన ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని పరిరక్షించే దిశ లో సహకారం అవసరపడే రంగాల విషయం లో వారి వారి అభిప్రాయాల ను ఒకరు మరొకరికి వెల్లడించుకోనున్నారు. జల వాయు పరివర్తన, సముద్ర సంబంధిత భద్రత, కొత్త గా చోటు చేసుకొంటున్న మహత్వపూర్ణ సాంకేతిక విజ్ఞానం, ప్రతిఘాతుకత్వ శక్తి కలిగినటువంటి సరఫరా వ్యవస్థ వంటి సమకాలీన సవాళ్ళ పట్ల అభిప్రాయాల వెల్లడించుకొనే అవకాశాన్ని కూడా ఈ శిఖర సమ్మేళనం అందించనుంది.
కోవిడ్-19 మహమ్మారి తో తలపడటానికి జరుగుతున్న ప్రయత్నాల ను గురించి నేత లు చర్చించనున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం లో సురక్షితమైన, సమానమైన, చౌకయిన టీకామందుల కు పూచీపడటానికి సహకరించుకొనే అవకాశాల ను కూడా వారు పరిశీలించనున్నారు.
***