Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కోల్ కాతా లో జ‌రిగిన కోల్‌ కాతా పోర్ట్ ట్ర‌స్ట్‌ 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భం లో నిర్వహించిన వార్షికోత్స‌వం లో పాలు పంచుకొన్న ప్ర‌ధాన మంత్రి


కోల్ కాతా పోర్ట్ ట్ర‌స్ట్ కు 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భం లో కోల్ కాతా లో ఈ రోజు న నిర్వహించిన వార్షికోత్స‌వాని కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హాజ‌రు అయ్యారు. ఈ సంద‌ర్భం లో ప్రధాన మంత్రి కోల్ కాతా లో ర‌బీంద్ర సేతు (హావ్ డా బ్రిడ్జి) తాలూకు ఇంట‌ర్ యాక్టివ్ లైట్ అండ్ సౌండ్ శో ను ప్రారంభించారు. స‌భా స్థ‌లి వ‌ద్ద ఏర్పాటు చేసిన ఒక అపురూప సాంస్కృతిక కార్య‌క్ర‌మాన్ని కూడా ఆయ‌న వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని సౌండ్ ఎండ్ లైట్ శో ను ఆరంభించిన సందర్భం లో ఏర్పాటు చేయడమైంది.

ఈ కార్య‌క్ర‌మాని కి ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ జ‌గ్‌ దీప్ ధ‌న్‌ ఖ‌ఢ్, ప‌శ్చిమ బెంగాల్‌ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ల‌తో పాటు ఇత‌ర ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు.

PM India

ర‌బీంద్ర సేతు ను విద్యుత్తు ను తక్కువ గా వినియోగించుకొనేటటువంటి విభిన్న రంగుల తో కూడిన 650 ఎల్ఇడి బల్బుల తో ఒక న‌వీన‌మైన రీతి న అలంక‌రించ‌డ‌మైంది. సంగీతానికి అనుగుణం గా అతి సుందరమైనటువంటి వెలుగుల ను విరజిమ్మే ప్రదర్శన కార్యక్రమం అదనపు హంగు గా ఉంటుంది. ఇంజినీరింగ్ లో ఓ అద్భుతం గా పరిగణించేటటువంటి హావ్ డా బ్రిడ్జి కి ఈ బల్బు లు వారసత్వ రూపు ను సంతరించగలవు. క్రొత్త గా ఆరంభించిన ఈ ఇంట‌ర్ యాక్టివ్ శో స్థానికుల‌నే కాక యాత్రికుల ను కూడా ఆక‌ర్షించుకోవడం లో తోడ్పడగలుగుతుందని ఆశిస్తున్నారు.

ర‌బీంద్ర సేతు ను 1943వ సంవ‌త్స‌రం లో నిర్మించడమైంది. ఈ వంతెన యొక్క 75వ వార్షిక వేడుక ను గ‌డ‌చిన సంవ‌త్స‌రం లో జరిపారు. ఈ వారధి లో ఎటువంటి న‌ట్ లను గాని లేదా బోల్టుల ను గాని ఉపయోగించలేదు. చీలల‌ ను అమర్చి వాటి ని బిగించ‌డం ద్వారా దీనిని ఏర్పాటు చేశారు. దీని నిర్మాణం లో 26,500 ట‌న్నుల ఉక్కు ను వాడారు. ఇందులో 23,000 ట‌న్నుల ఉక్కు బాగా ఉన్నతమైన శ్రేణి కి చెందినటువంటిది.