ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొరియా లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి నేడు ప్రసంగించారు.
వారు తనకు సాదర స్వాగతం పలికినందుకు గాను ఆయన ధన్యవాదాలు తెలిపారు.
భారతదేశాని కి మరియు కొరియా కు మధ్య ఉన్నటువంటి బంధాలు కేవలం వ్యాపార పరమైన ప్రాతిపదిక ను కలిగినవి కాదని ఆయన అన్నారు. ఇరు దేశాల కు మధ్య ఉన్నటువంటి సంబంధానికి ప్రధాన ప్రాతిపదిక గా ప్రజా సంబంధాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
భారతదేశాని కి మరియు కొరియా కు మధ్య యుగాల నాటి నుండి ఉన్న లంకెల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. రాణి సూర్యరత్న అయోధ్య నుండి వేలాది కిలో మీటర్లు పయనించి కొరియా రాజు ను పెళ్ళాడిన విషయాన్ని ఆయన గుర్తు కు తెచ్చారు. కొరియా ప్రథమ మహిళ శ్రీమతి కిమ్ జుంగ్-సూక్ ఇటీవల దీపావళి రోజు న అయోధ్య ను సందర్శించిన విషయాన్ని సైతం ఆయన జ్ఞప్తి కి తెచ్చారు.
బౌద్ధం ఉభయ దేశాల కు మధ్య ఉన్నటు వంటి మైత్రి బంధాన్ని మరింతగా బలోపేతం చేసినట్లు ప్రధాన మంత్రి చెప్పారు.
కొరియా లో అభివృద్ధి కి, పరిశోధన కు మరియు నూతన ఆవిష్కరణ లకు భారతీయ సముదాయం తోడ్పాటు ను అందిస్తున్నదని తెలుసుకోవడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని ప్రధాన మంత్రి అన్నారు.
కొరియా లో యోగా కు మరియు భారతీయ పండుగల కు ఉన్న లోక ప్రియత్వాన్ని గురించి ఆయన ప్రస్తావించారు. భారతీయ వంటకాలు కొరియా లో వేగం గా ప్రజాదరణ పాత్రమవుతున్నాయని కూడా ఆయన అన్నారు. భారతీయ క్రీడ అయిన ‘కబడ్డీ’ లో కొరియా ఏశియన్ గేమ్స్ లో అద్భుత ప్రదర్శన ను ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రపంచం అంతటా విస్తరించిన భారతీయ సముదాయం భారతదేశాని కి రాయబారుల వంటి వారంటూ ప్రధాన మంత్రి అభివర్ణించారు. వారి యొక్క కఠోర శ్రమ, ఇంకా క్రమశిక్షణ లు ప్రపంచవ్యాప్తం గా భారతదేశ ప్రతిష్ట ను పెంచినట్లు ఆయన వెల్లడించారు.
భారతదేశం ఈ సంవత్సరం మహాత్మ గాంధీ 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోందని ప్రధాన మంత్రి వెల్లడించారు. ప్రపంచం బాపూ ను గురించి మరిన్ని విషయాల ను తెలుసుకొనితీరాలని, మరి ఈ లక్ష్యాన్ని అనుసరించడం మన కర్తవ్యం గా ఉందని ఆయన చెప్పారు.
కొరియా తో భారతదేశం బంధాలు పటిష్టం అవుతున్నాయని, ఈ ప్రాంతం లో శాంతి కోసం, స్థిరత్వం కోసం మరియు సమృద్ధి కోసం ఉభయ దేశాలూ కలసి పని చేస్తున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. భారతీయ బ్రాండ్ లు ప్రస్తుతం కొరియా లో స్థానాన్ని సంపాదించుకొన్నాయని, మరి అలాగే కొరియా కు చెందిన బ్రాండ్ లు భారతదేశం లో ఇంటింటా పరిచయాని కి నోచుకొన్నవేనని కూడా ఆయన తెలిపారు.
భారతదేశం లో ఇటీవల చోటుచేసుకొన్న ఆర్థికాభివృద్ధి ని గురించి ప్రధాన మంత్రి సుదీర్ఘం గా వివరించారు.
భారతదేశం త్వరలోనే 5 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ కానుందని ఆయన చెప్పారు.
‘వ్యాపారం చేయడం లో సౌలభ్యం’ మరియు ‘జీవించడం లో సౌలభ్యం’ అంశాల లో గొప్ప పురోగతి జరిగినట్లు ఆయన వివరించారు. జిఎస్‌టి, ఇంకా నగదు రహిత ఆర్థిక వ్యవస్థ ల వంటి సంస్కరణల ను గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
భారతదేశం లో అన్ని వర్గాల వారికి ఆర్థిక సేవల అందజేత విప్లవాన్ని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ సందర్భం గా బ్యాంకు ఖాతాల ను గురించి, బీమా ను గురించి, ఇంకా ముద్ర రుణాల ను గురించి ఆయన వివరించారు.
అనేక కార్య సాధన ల కారణం గా భారతదేశం యొక్క ప్రతిష్ట పెరుగుతోందని ఆయన చెప్పారు. పేదల కు ఉచితంగా వ్యాధి చికిత్స ను అందించడం గురించి, ప్రపంచం లోకెల్లా అత్యంత ఎత్తయిన విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ని గురించి, ఇంకా ‘డిజిటల్ ఇండియా’ను గురించి ఆయన ప్రస్తావించారు.
పరిశుభ్రమైన శక్తి రంగం లో భారతదేశం లో చోటుచేసుకొన్న పరిణామాల ను గురించి మరియు అంతర్జాతీయ సౌర వేదిక ఏర్పాటు ను గురించి కూడా ప్రధాన మంత్రి మాట్లాడారు.
ప్రస్తుతం భారతదేశం లో ఒక కొత్త శక్తి చోటు చేసుకున్నదని ప్రధాన మంత్రి అన్నారు. రేపటి రోజు న తాను భారతదేశ ప్రజల తరపున, మరి ప్రవాసీ భారతీయుల పక్షాన సియోల్ శాంతి బహుమతి ని స్వీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ప్రయాగ్‌రాజ్ లో ప్రస్తుతం కొనసాగుతున్న కుంభ్ మేళా ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించి, ఈసారి కుంభ్ లో స్వచ్ఛత కు ప్రాముఖ్యం ఇచ్చిన సంగతి ని ప్రపంచం గమనిస్తోందన్నారు. కొరియా లో నివసిస్తున్న భారతీయ సముదాయం వారి స్వీయ ప్రయత్నాల ద్వారా భారతదేశం లో పర్యటన రంగాన్ని ప్రోత్సహించాలని ఆయన ఉద్బోధించారు.