Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కొత్త ఎయిమ్స్‌ ప్రభావంపై ఒక ట్వీట్‌ను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి


   శ్చిమ బెంగాల్‌ను ఉటంకిస్తూ కేంద్ర సహాయ మంత్రి శ్రీ నిసిత్ ప్రామాణిక్ చేసిన ట్వీట్ థ్రెడ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. దేశమంతటా ఏర్పాటవుతున్న ఎయిమ్స్‌ వల్ల సమకూరే ప్రయోజనాలను ఉదాహరిస్తూ ప్రామాణిక్‌ ఈ ట్వీట్‌ చేశారు.

దీనిపై ప్రధాని కిందివిధంగా ట్వీట్ చేశారు:

“పశ్చిమ బెంగాల్‌ను ఉదాహరిస్తూ వెలువడిన ఈ ట్వీట్‌ దేశవ్యాప్తంగా ఏర్పాటవువుతున్న మరిన్ని ఎయిమ్స్‌ వల్ల ఒనగూడే ప్రయోజనాలను ప్రముఖంగా వివరిస్తోంది. ఈ సందర్భంగా మా ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తుండటంతోపాటు స్థానిక భాషలలో వైద్యవిద్యను అభ్యసించే వీలు కల్పిస్తుండటం గమనార్హం. ఇది కచ్చితంగా ప్రజలకు ప్రయోజనకరమే” అని పేర్కొన్నారు.

 

 

***

DS