కేదార్ నాథ్ను మరియు బద్రినాథ్ ను అక్టోబర్ 21వ తేదీ నాడుసందర్శించనున్న ప్రధాన మంత్రి
18 Oct, 2022
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 అక్టోబరు 21వ తేదీనాడు ఉత్తరాఖండ్ ను సందర్శించనున్నారు. కేదార్ నాథ్ లో ఉదయం 8గంట ల 30 నిమిషాల కు శ్రీ కేదార్ నాథ్ దేవాలయం లో దైవ దర్శనం మరియు పూజ కార్యక్రమాలలో ఆయన పాలుపంచుకొంటారు. దాదాపు 9 గంటల వేళ లో కేదార్ నాథ్ రోప్ వే ప్రాజెక్టు కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తరువాత ఆది గురు శంకరాచార్య సమాధి స్థలాన్ని ఆయన సందర్శించనున్నారు. మందాకిని ఆస్థా పథ్ మరియు సరస్వతి ఆస్థా పథ్ ల వెంబడి నిర్మాణం కొనసాగుతూ ఉన్న పనుల యొక్క పురోగతి ని ఉదయం ఇంచుమించు 9 గంట ల 25 నిమిషాల కు ప్రధాన మంత్రి సమీక్షించనున్నారు.
తదనంతరం, ప్రధాన మంత్రి బద్రినాథ్ కు చేరుకొంటారు. అక్కడ సుమారు 11గంట ల 30 నిమిషాల కు శ్రీ బద్రినాథ్ దేవాలయం లో దైవ దర్శనం మరియు పూజా కార్యక్రమం లో ఆయన పాలుపంచుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల వేళ లో నది ముఖం అభివృద్ధి పనుల లో పురోగతి ని ఆయన సమీక్షించనున్నారు. ఆ తరువాత మధ్యాహ్నం 12 గంట ల 30 నిమిషాల కు మాణా గ్రామం లో రహదారి మరియు రోప్ వే ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తరువాత మధ్యాహ్నం సుమారు 2 గంటల వేళ లో అరైవల్ ప్లాజా మరియు సరస్సు ల అభివృద్ధి పనుల లో పురోగతి ని ఆయన సమీక్షించనున్నారు.
కేదార్ నాథ్ లో రోప్ వే దాదాపు గా 9.7 కిలోమీటర్ల పొడవు న ఏర్పాటు కానుంది. అది గౌరీ కుండ్ ను కేదార్ నాథ్ తో కలుపుతుంది. ఈ రెండు స్థలాల మధ్య ప్రయాణించడానికి ప్రస్తుతం 6-7 గంటలు పడుతున్నది కాస్తా ఈ రోప్ వే సాయం తో కేవలం 30 నిమిషాల కు తగ్గిపోనుంది. ఇక హేమ్ కుండ్ రోప్ వే గోవింద్ ఘాట్ ను హేమ్ కుండ్ సాహిబ్ తో కలుపుతుంది. ఇది సుమారు 12.4 కి.మీ. మేర ఏర్పాటవుతుంది. ప్రయాణ కాలం ఒక రోజు కు పైగా ఉన్నది కాస్తా దీని సాయంతో కేవలం 45 నిమిషాల కు తగ్గిపోనుంది. ఈ రోప్ వే ఘాంఢరియా ను కూడా కలుపుతూ సాగుతుంది. ఘాంఘరియా అనేది వేలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్కుకు ప్రవేశద్వారం గా ఉంది.
దాదాపు గా 2430 కోట్ల రూపాయల మొత్తం వ్యయం తో అభివృద్ధి పరచనున్న ఈ రోప్ వే లు పర్యావరణ అనుకూలమైన పద్ధతి లో రవాణా మాధ్యమం గా ఉంటూ, సురక్షితమైనటువంటి మరియు స్థిరమైనటువంటి రవాణా సౌకర్యాన్ని అందించనున్నాయి. మౌలిక సదుపాయాల పరంగా చూసినప్పుడు వీటిని ప్రధానమైనటువంటి అభివృద్ధి పనులు గా పేర్కొనవచ్చును. ఈ ప్రాజెక్టు లు ధార్మిక పర్యటన కు ధన్నుగా నిలవబోతున్నాయి. ఈ ప్రాజెక్టు లు ఆ ప్రాంతం లో ఆర్థిక అభివృద్ధి కి ఊతాన్ని ఇవ్వనున్నాయి. అంతేకాకుండా అనేక ఉపాధి అవకాశాల కల్పన కు కూడా ను తోడ్పడనున్నాయి.
ఈ యాత్ర లో భాగం గా దాదాపు గా 1000 కోట్ల విలువ కలిగిన రహదారి విస్తరణ పథకాల కు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మాణా నుండి మాణా పాస్ (ఎన్ హెచ్07) వరకు మరియు జోశీ మఠ్ నుండి మలారీ (ఎన్ హెచ్107 బి) వరకు.. ఈ రెండు రహదారి విస్తరణ పథకాలు మన సరిహద్దు ప్రాంతాల కు అన్ని రుతువుల లో రహదారి సంధానాన్ని అందించే దిశ లో మరొక అడుగు గా నిలవనుంది. కనెక్టివిటీ ని పెంచడానికి తోడు, ఈ ప్రాజెక్టు లు వ్యూహాత్మక దృష్టి కోణం లో చూసినా కూడా ను ప్రయోజనక కరం కానున్నాయి.
కేదార్ నాథ్, ఇంకా బద్రినాథ్ లు అత్యంత ముఖ్యమైన హిందూ పుణ్యక్షేత్రాల లో ఒకటి గా ప్రసిద్ధికెక్కాయి. ఈ ప్రాంతం సిఖ్కుల కు ఆరాధ్య తీర్థయాత్ర స్థలం అయినటువంటి హేమ్ కుండ్ సాహిబ్ కు కూడా నిలయం గా ఉంది. ఈ ప్రాంతాల లో ఆరంభం అవుతున్న కనెక్టివిటీ ప్రాజెక్టు లు ధార్మిక ప్రాముఖ్యం కలిగిన స్థలాల లో మౌలిక సదుపాయాల ను మెరుగుపరిచాలన్న, ఆయా క్షేత్రాల కు చేరుకోవడాన్ని సులభఃతరం చేయాలన్న ప్రధాన మంత్రి యొక్క నిబద్ధత ను చాటిచెప్పనున్నాయి.