ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్, కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు (సిఎపిఎఫ్) చెందిన గ్రూప్ -ఎ ఎక్సిక్యుటివ్ కేడర్ అధికారులకు, ఆర్గనైజ్‌డ్ గ్రూప్ -ఎ సర్వీసు(ఒజిఎఎస్) హోదా ఇచ్చే ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే వీరికి నాన్ ఫంక్షనల్ ఫైనాన్షియల్ అప్ గ్రెడేషన్ ( ఎన్.ఎఫ్.ఎఫ్.యు), నాన్ ఫంక్షనల్ సెలక్షన్ గ్రేడ్ (ఎన్.ఎఫ్.ఎస్.జి) ప్రయోజనాల వర్తింపునకు ఆమోదం తెలిపింది.
ప్రయోజనాలు…..
దీని ఫలితంగా
(ఎ) సి.ఎ.పి.ఎఫ్‌కు చెందిన అర్హులైన గ్రూప్ -ఎ ఎక్సిక్యుటివ్ కేడర్ అధికారులకు ఎన్.ఎఫ్.ఎఫ్.మంజూరు చేయడానికి వీలు కలుగుతుంది. అలాగే
(బి) సి.ఎ.పి.ఎఫ్‌కు చెందిన గ్రూప్ -ఎ ఎక్సిక్యుటివ్ కేడర్ అధికారులు , నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం 30 శాతం పెరుగుదల రేటుతో ఎన్.ఎఫ్.ఎస్.జి ప్రయోజనాలను పొందడానికి వీలు కలుగుతుంది.
నేపథ్యం……
సి.ఎ.పి.ఎఫ్ కు చెందిన పలువురు గ్రూప్ -ఎ ఎక్సిక్యుటివ్ కేడర్ అధికారులు తమకు ఒ.జి.ఎ.ఎస్ హోదా కల్పించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పలు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే తమకు ఎన్.ఎఫ్.ఎఫ్.యు, ఎన్.ఎఫ్.ఎస్.జి ప్రయోజనాలు లభించేట్టు చూడాలని కోరారు. ఢిల్లీ హైకోర్టు 02-09-2015, అలాగే 15-12-2015లలో జారీ చేసిన ఆదేశాల ప్రకారం సి.ఎ.పి.ఎఫ్ కు చెందిన గ్రూప్-ఎ, ఎక్సిక్యుటివ్ కేడర్ అధికారులను ఓ.జి.ఎ.ఎస్ కేడర్ వారిగా పరిగణిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే వీరికి ఎన్.ఎఫ్.ఎఫ్.యు, ఎన్.ఎఫ్.ఎస్.జి ప్రయోజనాలు వర్తింపచేయాలని ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వం, మరి కొందరు దాఖలు చేసిన స్పెషల్ లీవు పిటిషన్లను సుప్రీంకోర్టు 2019 ఫిబ్రవరి 5న తోసిపుచ్చింది. సి.ఎ.పి.ఎఫ్‌కు చెందిన గ్రూప్ -ఎ అధికారులకు ఎన్.ఎఫ్.ఎఫ్.యు అలాగే ఎణ్.ఎఫ్.ఎస్.జిని మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పును, జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్ధించింది.