Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేంద్ర రిజ‌ర్వు పోలీసు ద‌ళంలో గ్రూప్ ఎ అధికారుల కాడ‌ర్ రివ్యూకు మంత్రిమండలి ఆమోదం


కేంద్ర రిజ‌ర్వు పోలీసు ద‌ళం (సి ఆర్ పి ఎఫ్‌)లో గ్రూప్ ఎ అధికారుల కాడ‌ర్ స‌మీక్ష‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు. ఇందులో భాగంగా డిప్యూటీ క‌మాండెంట్ నుండి స్పెష‌ల్ డిజి హోదా వ‌ర‌కు భిన్న స్థాయిలలో 90 కొత్త పోస్టులను ఏర్పాటు చేస్తారు. ఈ అద‌న‌పు పోస్టుల ఏర్పాటు వ‌ల్ల సి ఆర్ పి ఎఫ్ లో నిర్వ‌హ‌ణ సామ‌ర్థ్యాలు పెర‌గ‌డంతో పాటు సామ‌ర్థ్యాల నిర్మాణం, పాల‌నా సామ‌ర్థ్యాల ప‌టిష్ఠ‌త కూడా చోటు చేసుకొంటుంది.

కాడ‌ర్ రివ్యూ అనంత‌రం సి ఆర్ పి ఎఫ్‌ లో గ్రూప్ ఎ పోస్టుల సంఖ్య 4,210 నుంచి 4,300కు పెరుగుతుంది. అవి ఇలా ఉన్నాయి.. :

1. ఒక స్పెష‌ల్ డిజి (హెచ్ ఎ జి + లెవెల్) పోస్టు పెంపు.

2. నికరంగా 11 ఇన్ స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ (ఎస్ ఎ జి లెవెల్) పోస్టుల పెంపు.

3. డి ఐ జి / క‌మాండెంట్ / 2-1/ సి (జెఎజి లెవెల్‌) పోస్టులు నిక‌రంగా 277 మేరకు పెంపు.

4. నికరంగా199 డిప్యూటీ క‌మాండెంట్ (ఎస్ టిఎస్ లెవెల్‌) పోస్టుల త‌గ్గింపు.

 
పూర్వ రంగం :

కేంద్ర సాయుధ ద‌ళాల్లో కేంద్ర రిజ‌ర్వు పోలీసు ద‌ళం (సి ఆర్ పి ఎఫ్‌) ఒక‌టి. 1939లో దీనిని ఏర్పాటు చేశారు. 1983లో తొలిసారి, 1991లో రెండోసారి కాడ‌ర్ రివ్యూలు జ‌రిగాయి. 1991 త‌రువాత లాంఛ‌నంగా కాడ‌ర్ రివ్యూ చేయ‌క‌పోయినా, 2004, 2009 సంవ‌త్స‌రాలలో భారీ పున‌ర్ నిర్మాణం, సామ‌ర్థ్యాల జోడింపు జ‌రిగింది. ఈ సంద‌ర్భాల్లో వాటికి దీటుగా సూప‌ర్ వైజ‌రీ సిబ్బందిని, క్షేత్ర‌ స్థాయి సిబ్బందిని పెంచ‌కుండానే అద‌న‌పు బెటాలియన్ లను ఏర్పాటు చేశారు. 

***