Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిత్వ‌ శాఖ‌, బిల్‌ & మిలిండా గేట్స్ ఫౌండేష‌న్ కు మ‌ధ్య స‌హ‌కార ఒప్పంద పత్రంపై సంత‌కానికి ఆమోదం


ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్ మెంట్ సర్వీసెస్ (ఐ సి డి ఎస్‌)ను ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ కమ్యూనికేష‌న్ టెక్నాల‌జీ సాయంతో రియల్ టైమ్ మానిటరింగ్ (ఐసిటి-ఆర్ టి ఎమ్) చేసేందుకు, ఇంకా ఇతర సాంకేతిక సంబంధ సేవ‌లలో కూడా సహకరించుకోవడానికి కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిత్వ‌ శాఖ‌ (ఎమ్ డబ్ల్యు సి డి), బిల్‌ & మిలిండా గేట్స్ ఫౌండేష‌న్ (బి ఎమ్ జి ఎఫ్) లు సహకారపూర్వక అవగాహన పత్రం (ఎమ్ ఒ సి) పైన సంతకాలు చేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ వహించారు.

ఈ స‌హ‌కార ఒప్పందం వ‌ల్ల ఒన‌గూరే లాభాలు..:

1. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్ మెంట్ సర్వీసెస్ లో ఐసిటి-ఆర్ టి ఎమ్ ను అమలు చేయడం సేవలు సకాలంలో అందుతున్నదీ లేనిదీ పర్యవేక్షించేందుకు అధికారులకు సహాయకారి కాగలదు.

2. పంచుకోదగ్గ జాతీయ స్థాయి సమాచార ప్రచార ఉద్యమం, కమ్యూనికేషన్ వ్యూహం మరియు దిశా నిర్దేశం, అవసరాలను నెరవేర్చగల కమ్యూనికేషన్ లు, స్థానిక సందర్భాలకు తగినట్లు ఉండే ఉత్పాదనలు, ఇంకా సామగ్రిని, పెద్ద స్థాయిలో ప్రసారం కోసం అభివృద్ధి ప్ర‌ణాళిక‌లను తయారు చేయడానికి వీలు ఉంటుంది.

3. ఉన్నత స్థాయికి చెందిన పోషకాహార నిపుణుల బృందాల ద్వారా వారి సాంకేతిక‌ స‌హాయాన్ని పొందవ‌చ్చు.

ఐసి డి ఎస్ సిస్టమ్స్ స్ట్రెంతెనింగ్ & న్యూట్రిషన్ ఇంప్రూవ్ మెంట్ ప్రాజెక్ట్ (ఐ ఎస్ ఎస్ ఎన్ ఐ పి) ఒకటో ద‌శ లో భాగంగా ఎనిమిది భాగ‌స్వామ్య రాష్ట్రాల్లోని అత్యంత ద‌య‌నీయ ప‌రిస్థితులు నెలకొన్న 162 జిల్లాలలో ల‌క్ష అంగ‌న్ వాడీ కేంద్రాల (ఎ డబ్ల్యు సి ల) కు ఐ సి టి- ఆర్ టి ఎమ్ ను అనుసంధానం చేయ‌నున్నారు. ఫలితంగా 0-6 ఏళ్ల వ‌య‌స్సున్న చిన్నారులు, గ‌ర్భవతులు, పిల్లలకు పాలు ఇచ్చే త‌ల్లులు ల‌బ్ధిని పొందుతారు.

8 రాష్ట్రాల (అవి.. ఆంధ్ర‌ ప్ర‌దేశ్‌, బిహార్, ఛ‌త్తీస్ గ‌ఢ్, జార్ఖండ్, మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్, ఉత్త‌ర‌ ప్ర‌దేశ్) కు చెందిన 162 అత్య‌ధిక పౌష్టికాహార లోప‌ం ఉన్న జిల్లాలు ఈ స‌హ‌కార ఒప్పందం ప్రయోజనాలను అందుకోగలవు.

ఫౌండేష‌న్ అందించే స‌హాయం..:

1. గ‌ర్భం దాల్చడానికి ముందు, కడుపుతో ఉన్నపుడు, శిశువులకు వారి ఒకటో, రెండో ఏడాది కాలాలలో అవ‌స‌ర‌మైన పౌష్టికాహారాన్ని జాతీయ, రాష్ట్ర స్థాయిలలో అందించేందుకు ఆయా ప్రభుత్వాలకు సాంకేతిక స‌హ‌కారాన్ని అందజేస్తుంది.

2. ఐసిటి-ఆర్ టి ఎమ్, ఇంకా ఐ సి డి ఎస్ వ్య‌వ‌స్థ‌ను బలోపేతం చేయ‌టం, ఐసి డి ఎస్ సిస్టమ్స్ స్ట్రెంతెనింగ్ & న్యూట్రిషన్ ఇంప్రూవ్ మెంట్ ప్రాజెక్ట్ (ఐ ఎస్ ఎస్ ఎన్ ఐ పి) మరియు సపోర్ట్ సిస్టమ్ ల కోసం కామ‌న్ అప్లికేష‌న్ సాఫ్ట్‌వేర్ (సి ఎ ఎస్) ను రూపొందించడానికి, అభివృద్ధి చేయడానికి సహాయపడే, సాంకేతిక సహకారాన్ని అందించే సంస్థలకు.. ఏవైతే మంత్రిత్వ శాఖ‌, ఫౌండేష‌న్ లు సంయుక్తంగా ఎప్పటికప్పుడు విధించే అర్హ‌త నియ‌మ‌ నిబంధ‌నల‌కు తుల తూగుతుంటాయో అటువంటి సంస్థలకు.. నిధులు సమకూర్చుతుంది. ఇంకా-

3. త‌ల్లి, బిడ్డలకు కావాల్సిన పౌష్టికాహారంపై చేపట్టాల్సిన జాతీయ ప్ర‌చారాన్ని మొదలుపెట్టేందుకు మంత్రిత్వ‌ శాఖ కు సహకారాన్ని అందిస్తుంది.. తత్ఫలితంగా ఆ ప్రచారాన్ని లక్షిత జనాభాకు చేర్చవచ్చు.

ఐసిటి-ఆర్ టి ఎమ్ కోసం కామ‌న్ అప్లికేష‌న్ సాఫ్ట్‌వేర్ (సి ఎ ఎస్)ను అభివృద్ధి చేయటం, శిక్ష‌కుల‌కు శిక్ష‌ణను ఇవ్వ‌టం, ఇత‌ర సాంకేతిక విష‌యాల అభివృద్ధికి ఈ ఒప్పందం మార్గం సుగమం చేస్తుంది. ద‌శ‌ల వారీగా ఐసిటి-ఆర్ టి ఎమ్, ఇత‌ర విభాగాలను ఆరంభిస్తారు. ఐదేళ్ల కాలానికి సాఫ్ట్ వేర్ మ‌ద్ద‌తు (ఎల్‌-3 స్థాయి) ఇవ్వ‌టం కూడా ఇందులో భాగ‌మే. ఐ ఎస్ ఎస్ ఎన్ ఐ పి రాష్ట్రాలలోని ప్రాముఖ్య‌ం ఎక్కువ‌గా ఉన్న జిల్లాలలో మంత్రిత్వ శాఖ సూచించిన శిక్ష‌కుల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌టం, ఐ సి డి ఎస్‌ల‌లో ఐసి టి -ఆర్ టి ఎమ్ ద్వారా సి ఎ ఎస్ విస్తారానికి సహకరిస్తుంది. ఐ సి టి విధానాన్ని నేర్చుకొనేలా అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌ల‌కు, స్థానిక ప‌ర్య‌వేక్ష‌కుల‌కు మంత్రిత్వ శాఖ శిక్ష‌కులు శిక్ష‌ణనిస్తారు.

బి ఎమ్ జి ఎఫ్ తో కుదిరిన స‌హ‌కార ఒప్పందంలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ‌ పైన ఎటువంటి ఆర్థిక ప్రభావం పడదు. బి ఎమ్ జి ఎఫ్.. దాని భాగ‌స్వామ్య సంస్థ‌ల‌తో కామ‌న్ అప్లికేష‌న్ సాఫ్ట్ వేర్ (సి ఎ ఎస్)ను అభివృద్ధి చేస్తుంది. దీనిని సంబంధిత ‘సోర్స్ కోడ్’ తో మంత్రిత్వ శాఖ‌కు ఉచితంగా అందిస్తుంది; అప్పుడు మంత్రిత్వ శాఖ ఎన్ ఐ సి సాయంతో సి ఎ ఎస్ ను హోస్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇదే విధంగా ఎల్-3 మ‌ద్ద‌తుకు గాని, మాస్టర్ ట్రయినర్స్ కు శిక్ష‌ణ అందించ‌డానికి గాని, జాతీయ స్థాయి కమ్యూనికేషన్స్ వ్యూహాన్ని ర‌చించ‌డానికి గాని, మార్గ‌ద‌ర్శ‌కాలను రూపొందించడానికి గాని, వివిధ మాధ్య‌మాల కోసం ప్ర‌చార సామగ్రిని సిద్ధం చేయ‌డానికి గాని మంత్రిత్వ శాఖపై ఎటువంటి ఆర్థిక ప్రభావం పడదు. వీటిని ఫౌండేష‌న్ చూసుకుంటుంది.

పూర్వ‌ రంగం:

ఇంటర్ నేషనల్ డెవలప్ మెంట్ అసోసియేషన్ (ఐ డి ఎ) సహాయం చేస్తున్న ఐ ఎస్ ఎస్ ఎన్ ఐ పి ని దేశంలోని ఎనిమిది రాష్ట్రాలలో 162 అత్య‌ధిక ప్ర‌భావిత జిల్లాలలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిత్వ‌ శాఖ‌ అమ‌లు చేస్తోంది. ఐ ఎస్ ఎస్ ఎన్ ఐ పి ఒకటో దశ 2015 డిసెంబరు 31న ముగియాల్సి ఉంది. దీని కార్యక్రమాలలో మార్పులు చేసి, కాల పరిమితిని రెండేళ్ల వరకు అంటే 2017 డిసెంబరు 30 వరకు పొడిగించారు. సవరించిన, పునర్ నిర్వచించిన ఫైనాన్సింగ్ అగ్రిమెంట్ పై 2015 సెప్టెంబరు లో ఆర్థిక వ్యవహారాల విభాగం, ఐ డి ఎ లు సంతకాలు చేశాయి. పున‌ర్ నిర్వచించిన ఐ ఎస్ ఎస్ ఎన్ ఐ పి కి వ్యయాల విభాగం నుంచి తగిన ఆమోదం కూడా తీసుకొన్నారు. ఐ సి డి ఎస్ సేవ‌ల నాణ్య‌త‌ను పెంపొందించడంలో ఐ సి టి కి ఎంతో ప్రాముఖ్య‌ం ఉన్నదని భావించి, ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ కమ్యూనికేష‌న్ టెక్నాల‌జీ ఆధారంగా పనిచేసే రియల్ టైమ్ మానిటరింగ్ (ఐసిటి-ఆర్ టి ఎమ్)ను పునర్ నిర్వచించిన ఐ ఎస్ ఎస్ ఎన్ ఐ పి లో ఒక కీలకమైన కార్యకలాపంగా చేర్చడం జరిగింది.

***