Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేంద్ర మంత్రి శ్రీ అనంత్ కుమార్ మృతి ప‌ట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్ర‌ధాన మంత్రి


కేంద్ర మంత్రి శ్రీ అనంత్ కుమార్ క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

‘‘మిత్రుడు, ఎంతో ఆప్తుడైన స‌హ‌చ‌రుడు శ్రీ అనంత్ కుమార్ క‌న్నుమూత తో ప్ర‌గాఢ‌ దుఃఖానికి లోనయ్యాను. ఆయ‌న చిన్న వ‌య‌స్సు లోనే ప్ర‌జా జీవితం లోకి ప్ర‌వేశించి, అమిత శ్ర‌ద్ధ తోను, ప‌రితాపం తోను స‌మాజానికి సేవ చేస్తూ వ‌చ్చినటువంటి అసాధార‌ణ‌మైన నాయకుడు. తాను చేసిన మంచి ప‌నుల‌కు గాను ఆయ‌న ను ఎల్లప్పటికీ స్మ‌రించుకొంటాం.

ఆయ‌న స‌తీమ‌ణి డాక్ట‌ర్ తేజ‌స్విని గారి తో నేను మాట్లాడి, శ్రీ అనంత్ కుమార్ గారు క‌న్నుమూయ‌డం ప‌ట్ల సంతాపం తెలిపాను. ఈ విచార, దుఃఖదాయక ఘ‌డియ‌ లో ఆయ‌న కుటుంబ సభ్యులకు, స్నేహితుల‌ కు మ‌రియు మ‌ద్ధ‌తుదారుల‌ కు క‌లిగిన శోకం లో నేనూ పాలుపంచుకుంటున్నాను. ఓం శాంతి’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశం లో పేర్కొన్నారు.