ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ కేంద్ర ప్రభుత్వ రంగ ఎంటర్‌ప్రైజ్‌ల (సిపిఎస్ఇ) వాణిజ్య వివాదాల పరిష్కార యంత్రాంగాన్ని బలోపేతం చేసేందుకు ఆమోదం తెలిపింది.సి.పి.ఎస్.ఇ లలో, సి.పి.ఎస్.ఇల మధ్య , ఇతర ప్రభుత్వ విభాగాలు, సంస్థల మధ్య వాణిజ్య వివాదాల పరిష్కారయంత్రాంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ ఆమోదం తెలిపారు. కార్యదర్శుల కమిటీ(సిఒఎస్) సిఫార్సుల ఆధారంగా కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. సిపిఎస్ఇ ల వాణిజ్య వివాదాలను కోర్టుల వరకు తీసుకువెళ్లకుండా ప్రభుత్వస్థాయిలో సత్వర పరిష్కారానికి ఇది వ్యవస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది.
వివరాలు :
ప్రస్తుతం వాణిజ్యవివాదాల పరిష్కారానికి గల శాశ్వత మధ్యవర్తిత్వ యంత్రాంగం స్థానంలో కొత్త రెండంచెల యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.( రైల్వేలు, ఆదాయపన్ను, కస్టమ్స్, ఎక్సైజ్ విభాగాలు ఇందుకు మినహాయింపు) సిపిఎస్ఇలలో సిపిఎస్ఇల మధ్య, ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ సంస్థల మధ్య వాణిజ్య వివాదాలను కోర్టు వెలుపల సత్వర పరిష్కారానికి ఇది ఉపకరిస్తుంది.
తొలి అంచెలో,అలాంటి వాణిజ్య వివాదాలను ఒక కమిటీకి నివేదిస్తారు. ఈ కమిటీలో ఆయా వివాదాలకు సంబంధించిన సిపిఎస్ ఇ లు, పార్టీల , డిపార్టమెంట్ పాలనా మంత్రిత్వశాఖలు, విభాగాలకు సంబంధించిన కార్యదర్శులు , డిపార్టమెంట్ ఆఫ్ లీగల్ అఫైర్సఖ్ కార్యదర్శి ఉంటారు.సంబంధిత రెండు పాలనా మంత్రిత్వశాఖలు, విభాగాలకు చెందిన ఆర్థిక సలహాదారులు వివాదానికి సంబంధించిన అంశాన్ని కమిటీ ముందుంచుతారు. ఒకవేళ వివాద పరిష్కారం కోరుకుంటున్న సంస్థలు ఒకే మంత్రిత్వశాఖ లేదా ఒకే విభాగానికి చెందినవైతే,అలాంటి సందర్భాలలో సంబంధిత పాలనా మంత్రి త్వశాఖ, విభాగం కార్యదర్శి, అలాగే లీగల్ అఫైర్స్ డిపార్టమెంట్ కార్యదర్శి, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ డిపార్టమెంట్ కార్యదర్శి ఆ కమిటీ లో సభ్యులుగా ఉంటారు. అలాంటి సందర్భాలలో పరిష్కారం కోరుకుంటున్న అంశాన్ని ఆర్థిక సలహాదారు, మంత్రిత్వశాఖ, లేదా విభాగానికి చెందిన ఒక సంయుక్త కార్యదర్శి కమిటీ ముందుకు తీసుకురావడానికి ప్రాతినిధ్యం వహిస్తారు
ఒక వేళ వివాదం సిపిఎస్‌కి రాష్ట్రప్రభుత్వ విభాగం లేదా సంస్థకు సంబంధించినది అయితే, మంత్రిత్వశాఖ కార్యదర్శి,సిపిఎస్ఇకి చెందిన కేంద్రప్రభుత్వ విభాగం కార్యదర్శి, డిపార్టమెంట్ ఆఫ్ లీగల్ అఫైర్స్ కార్యదర్శి, సంబంధిత రాష్ట్రానికి చెందిన రాష్ట్రప్రభుత్వ ప్రధానకార్యదర్శిచేత నామినేట్ చేయబడిన సీనియర్ అధికారితో కమిటీని ఏర్పాటు చేస్తారు.అలాంటి సందర్భాలలో, కమిటీ ముందు సంబంధిత రాష్ట్రప్రభుత్వ విభాగం, సంస్థకు చెందిన ప్రిన్సిపుల్ సెక్రటరీ ఆ అంశాన్ని ప్రస్తావిస్తారు.
ఇక రెండవ అంచె విషయానికి వస్తే, తొలి దశలో పైన పేర్కొన్న కమిటీ పరిశీలించినా సమస్య పరిష్కారం కానట్టయితే, ఆ అంశాన్నికేబినెట్ సెక్రటరీకి నివేదిస్తారు. కేబినెట్ సెక్రటరీ నిర్ణయమే తుది నిర్ణయంగా ఉంటుంది. ఉభయ పక్షాలూ అందుకు కట్టుబడి ఉండాలి.
సకాలంలో ఫిర్యాదులను పరిష్కరించేందుకు తొలి దశలో మూడు నెలల టైమ్ షెడ్యూలును నిర్ణయించారు.డిపార్టమెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ (డిఇపి) ఇందుకు సంబంధించిన మార్గదర్శకాల సత్వర అమలుకు, అన్ని సిపిఎస్ ఇలకు తన పాలనా మంత్రిత్వశాఖలు, విభాగాలు, రాష్ట్రప్రభుత్వాలు,కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల ద్వారా ఉత్తర్వులు జారీ చేస్తుంది.
ఈ కొత్త యంత్రాంగం, పరస్పర, సమష్టి కృషి ద్వారా వాణిజ్యవివాదాల పరిష్కారానికి కృషి చేయడం ద్వారా సమానత్వం సాధించడానికి,కోర్టులలో వాణిజ్య వివాదాల సంఖ్యను తగ్గించడానికి, విలువైన ప్రజాధనం వృధాను అరికట్టడానికి ఉపకరిస్తుంది.
*****