Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేంద్ర ప్రభుత్వ రంగ ఔషధ సంస్థ (సిపిఎస్ యు స్) ల మూసివేత/వ్యూహాత్మక పెట్టుబడుల తుది ఉపసంహరణదాకా ఇప్పటి షరతులు-నిబంధనలతోనే ప్రస్తుత ఔషధ కొనుగోలు విధానాని (పిపిపి) కి కేంద్ర మంత్రిమండలి ఆమోదం; ఈ 103 మందుల జాబితా లో ఆల్కహాలిక్ ఆధారిత క్రిమినాశక (ఎహెచ్ డి) ఉత్పత్తి జోడింపు


ఈ విధానం కొనసాగింపు/నవీకరణవల్ల కేంద్ర ప్రభుత్వరంగ ఔషధ సంస్థ లు ప్రస్తుత సదుపాయాలను గరిష్ఠం గా వినియోగించుకునే వీలు కలుగుతుంది. ఆ మేరకు తమ ఉద్యోగుల కు వేతనాల చెల్లించగలిగేలా రాబడులు పెంచుకోవడాని కి అవకాశం లభిస్తుంది. అలాగే విలువైన, అధునాతన యంత్ర సామగ్రి ని పని చేసే స్థితి లో ఉంచడానికి వీలుంటుంది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల మూసివేత/పెట్టుబడుల ఉపసంహరణ వేళ వాటిని విక్రయించినపుడు అత్యున్నత ధర లభించే అవకాశం ఉంటుంది.

నేపథ్యం:

కేంద్ర ప్రభుత్వరంగ, వాటి అనుబంధ సంస్థలు తయారు చేసే ఔషధాల లో 103 మందుల కొనుగోలు కోసం ఐదేళ్ల కాలానికిగాను ‘ఔషధ కొనుగోలు విధానా’ (పిపిపి)నికి కేంద్ర మంత్రిమండలి 30.10.2013న ఆమోదం తెలిపింది. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల్లోని వివిధ విభాగాలు, ఇతర ప్రభుత్వరంగ సంస్థలు చేపట్టే మందుల కొనుగోళ్ల కు ఈ విధానం వర్తిస్తుంది. సదరు మందుల ధరల ను జాతీయ ఔషధ ధరల ప్రాధికార సంస్థ (ఎన్ పిపిఎ) నిర్ణయిస్తుంది. కాగా, ఆయా కొనుగోలు సంస్థలు తాము నిర్దేశించుకున్న ఉత్తమ తయారీ పద్ధతుల (జిఎంపి) ఆధారం గా ‘డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్’ లోని షెడ్యూల్ ‘ఎమ్’ కింద కేంద్ర ప్రభుత్వరంగ ఔషధ సంస్థలు, వాటి అనుబంధ సంస్థల నుంచి మందులు కొనుగోలు చేస్తాయి. ఈ నేపథ్యం లో సదరు ఔషధ కొనుగోలు విధానాని కి 09.12.2018తో కాలం చెల్లింది.

ఈ పరిస్థితుల నడుమ ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐడిపిఎల్), రాజస్థాన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ (ఆర్ డిపిఎల్ ) సంస్థల మూసివేతకు కేంద్ర మంత్రిమండలి 28.12.2016న నిర్ణయించింది. అలాగే హిందూస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ (హెచ్ ఎఎల్ ), బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ (బిసిపిఎల్ ) సంస్థల కు చెందిన మిగులు భూముల ను ప్రభుత్వ సంస్థల కు అమ్మి, తద్వారా లభించే వనరుల తో వాటి రుణ బాధ్యతలు తీర్చి, ఆ సంస్థల వ్యూహాత్మక విక్రయం చేపట్టాలని తీర్మానించింది. అనంతరం 17.07.2019నాటి మంత్రిమండలి సమావేశం ఈ నిర్ణయాన్ని సవరించి, 14.06.2018 నాటి ప్రభుత్వరంగ పరిశ్రమల శాఖ సవరించిన మార్గదర్శకాల ప్రకారం మిగులు భూముల ను విక్రయించేందుకు అనుమతించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగం లోని అయిదో ఔషధ సంస్థ- కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ (కెఎపిఎల్ ) నుంచి 100 శాతం ప్రభుత్వ వాటా పెట్టుబడి ఉపసంహరణకు 01.11.2017న మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల సంఘం (సిసిఇఎ) నిర్ణయించింది. ఈ నేపథ్యం లో కేంద్ర ప్రభుత్వ రంగ ఔషధ సంస్థల తుది మూసివేత/విక్రయం దాకా ఔషధ కొనుగోలు విధానం కొనసాగింపునకు తాజాగా కేంద్ర మంత్రిమండలి ప్రతిపాదించింది.

***