Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేంద్ర నిర్వ‌హ‌ణ‌లోని ప‌థ‌కాల హేతుబ‌ద్ధీక‌ర‌ణ‌పై ముఖ్య‌మంత్రుల ఉప‌ సంఘం సిఫార‌సుల‌కు మంత్రిమండలి ఆమోదం


కేంద్ర‌ ప్ర‌భుత్వ నిర్వ‌హ‌ణ‌లోని ప‌థ‌కాల (సి ఎస్ ఎస్ ల) హేతుబ‌ద్ధీక‌ర‌ణ‌పై అధ్య‌య‌నం చేసిన ముఖ్య‌మంత్రుల ఉప‌ సంఘం ప్ర‌ధాన‌ సిఫార‌సుల‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

మొత్తం 66 సిఎస్ ఎస్ ల‌ను ఈ ఉప సంఘం ప‌రిశీలించి, వాటి సంఖ్య 30కి మించ‌రాద‌ని సిఫార‌సు చేసింది. ఈ ప‌థ‌కాల్లోని అనేక వివాదాస్ప‌ద అంశాల విష‌యంలో ఉప సంఘంలో స‌భ్యులుగా ఉన్న ముఖ్య‌మంత్రుల‌తోనే కాకుండా ఇత‌ర రాష్ట్రాలు, కేంద్ర‌ పాలిత ప్రాంతాల ముఖ్య‌మంత్రులు, పాల‌కులతో చ‌ర్చించి ఏకాభిప్రాయం సాధించారు.

సి ఎస్ ఎస్ ల‌న్నింటినీ హేతుబ‌ద్దం చేయ‌డం వ‌ల్ల వాటి ఫ‌లాలు అంద‌రికీ ప‌రిపూర్ణంగా అందుబాటులోకి రావ‌డానికి, అందుబాటులో ఉన్న వ‌న‌రుల పూర్తి వినియోగానికి అవ‌కాశం ఏర్ప‌డుతుంది. ఎవ‌రి ప్ర‌యోజ‌నం కోసం ఆ ప‌థ‌కాల‌ను ఉద్దేశించారో వారికి పూర్తిగా ల‌బ్ధి స‌మ‌కూరుతుంది.

2015 ఫిబ్ర‌వ‌రి 8వ తేదీన నీతి ఆయోగ్ పాల‌క మండ‌లి తొలి స‌మావేశంలో ఈ ముఖ్య‌మంత్రుల ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. 75వ స్వాతంత్ర్య దినోత్స‌వం జ‌రుగ‌నున్న 2022 నాటికి ల‌క్ష్యాల‌న్నీ సాధించ‌డానికి రూపొందించిన విజ‌న్ 2022కి అనుగుణంగా స‌హ‌కారాత్మక సమాఖ్య స్ఫూర్తితో కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర‌ పాలిత ప్రాంతాల మ‌ధ్య గ‌ల వివాదాల‌న్నింటినీ ప‌రిష్క‌రించి టీమ్ ఇండియాగా క‌లసి ప‌నిచేయ‌డానికి అవ‌స‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించ‌డం ఈ ఉప‌ సంఘం ల‌క్ష్యంగా నిర్దేశించారు. స్థూలంగా ఆ విజ‌న్ లోని అంశాలు: (ఎ) ఆత్మ‌గౌర‌వంతో, హుందాగా జీవ‌నం సాగించేలా దేశంలోని పౌరులంద‌రికీ న్యాయ‌బ‌ద్ధంగా మౌలిక‌వ‌స‌తుల‌న్నీ అందుబాటులో ఉండేలా చూడ‌డం; ఇంకా (బి) పౌరులంద‌రూ పూర్తి స్థాయిలో వారి సామ‌ర్థ్యాలు వినియోగంలోకి తెచ్చుకునేందుకు త‌గు అవ‌కాశాలు క‌ల్పించ‌డం.
4. ఉప‌ సంఘం చేసిన ప్ర‌ధాన సిఫార‌సులు ఇలా ఉన్నాయి
అ) పథకాల సంఖ్య : మొత్తం పథకాల సంఖ్య 30కి మించ‌కూడ‌దు.

ఆ) పథకాల వ‌ర్గీక‌ర‌ణ : ప‌ర్ స్తుతం అమ‌లు జ‌రుగుతున్న సి ఎస్ ఎస్ ల‌న్నింటినీ ప్ర‌ధాన‌మైన‌వి, ఐచ్ఛిక‌మైన‌విగా విభ‌జించాలి.

  1. i) కీల‌క‌మైన ప‌థ‌కాలు : టీమ్ ఇండియా స్ఫూర్తితో కేంద్ర‌ రాష్ట్రాలు క‌లిసిక‌ట్టుగా ప‌ని చేసేలా జాతీయాభివృద్ధి అజెండాకు అనుగుణంగా సి ఎస్ ఎస్ లు ఉండాలి.
  2. ii) అత్యంత కీల‌క ప‌థ‌కాలు: సామాజిక భ‌ద్ర‌త‌, స‌మాజంలోని అన్ని వ‌ర్గాల భాగ‌స్వామ్యం ల‌క్ష్యంగా అమ‌లుప‌రుస్తున్న ప‌థ‌కాలు అత్యంత కీల‌క‌మైన‌విగా ప‌రిగ‌ణ‌న‌లోకి వ‌స్తాయి. జాతీయాభివృద్ధి అజెండాకు అమ‌లుకు కేటాయించిన నిధుల కేటాయింపులో అగ్ర‌ప్రాధాన్యం ఇవ్వాలి.
  3. iii) ఐచ్ఛిక ప‌థ‌కాలు: ఇలాంటి ప‌థ‌కాల ఎంపిక‌,అమ‌లు విష‌యంలో రాష్ట్రాల‌కు పూర్తి స్వేచ్చ ఉంటుంది. త‌మ‌కు అవ‌స‌ర‌మ‌ని భావించిన ప‌థ‌కాల‌ను రాష్ట్రాలు ఎంపిక చేసుకొని అమ‌లుప‌ర‌చ‌వ‌చ్చు. వీటి అమ‌లుకు అవ‌స‌ర‌మైన ఆర్థిక వ‌న‌రుల‌ను ఆర్థిక శాఖ ఏక‌మొత్తంలో అంద‌చేస్తుంది.

జాతీయాభివృద్ధి కార్యక్రమ పట్టికకు అనుగుణంగా సి ఎస్ ఎస్‌ ల జాబితా:

(అ) అత్యంత కీల‌కమైన ప‌థ‌కాలు
1 నేష‌న‌ల్ సోష‌ల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్
2 మ‌హాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం
3 షెడ్యూల్డు కులాల అభివృద్ధికి అమ‌లుచేస్తున్న ప్ర‌ధాన ప‌థ‌కం
4 షెడ్యూల్డు తెగ‌ల అభివృద్ధికి అమ‌లుచేస్తున్న ప్ర‌ధాన ప‌థ‌కం
5 మైనారిటీల అభివృద్ధికి అమ‌లుచేస్తున్న ప్ర‌ధాన ప‌థ‌కం
6 వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తులు, దివ్యాంగులు, ఇత‌ర దుర్బల వ‌ర్గాల కోసం అమ‌లుప‌రుస్తున్న ప్ర‌ధాన ప‌థ‌కం
(ఆ) కీల‌క‌మైన ప‌థ‌కాలు
7 హ‌రిత విప్ల‌వం (కృషి ఉన్న‌తి స్కీమ్ స్ అండ్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజ‌న‌)
8 శ్వేత విప్ల‌వం (ప‌శు సంవ‌ర్థ‌కం మరియు పాడి ప‌రిశ్ర‌మ‌)
9 నీలి విప్ల‌వం (మ‌త్స్య‌ ప‌రిశ్ర‌మ స‌మ‌గ్ర అభివృద్ధి)
10 ప్ర‌ధాన‌ మంత్రి కృషి సించాయి యోజ‌న
హ‌ర్ ఖేత్ కో పానీ (ప్రతి పొలానికి సాగునీరు)
పర్ డ్రాప్ మోర్ క్రాప్ (ప్ర‌తి నీటి బొట్టుకు అధిక పంట)
ఇంటిగ్రేటెడ్ వాట‌ర్ షెడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్
యాక్సిల‌రేటెడ్ ఇరిగేష‌న్ బెనిఫిట్‌ అండ్ ఫ్లడ్ మేనేజ్ మెంట్ ప్రోగ్రామ్
11 ప్ర‌ధాన‌ మంత్రి గ్రామ్ స‌డ‌క్ యోజ‌న (పి ఎమ్ జి ఎస్‌ వై)
12 ప్ర‌ధాన‌ మంత్రి ఆవాస్ యోజ‌న (పి ఎమ్ ఎ వై)
పి ఎమ్ ఎ వై – రూర‌ల్
పి ఎమ్ ఎ వై – అర్బ‌న్
13 నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ మిషన్ (జాతీయ గ్రామీణ మంచినీటి ఉద్యమం )
14 స్వ‌చ్ఛ భార‌త్ మిషన్ (ఎస్ బి ఎమ్)
ఎస్ బి ఎమ్ – రూర‌ల్‌
ఎస్ బి ఎమ్ – అర్బ‌న్
15 నేషనల్ హెల్త్ మిషన్ – ఎన్ హెచ్ ఎమ్ (జాతీయ ఆరోగ్య ప‌థ‌కం)
నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (జాతీయ గ్రామీణ ఆరో్గ్య ప‌థ‌కం)
నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ (జాతీయ ప‌ట్ట‌ణ ఆరోగ్య ప‌థ‌కం)
టెర్షియ‌రీ కేర్ ప్రోగ్రామ్
హ్యూమన్ రిసోర్సెస్ ఇన్ హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ (వైద్య‌, ఆరోగ్య విద్య‌లో మాన‌వ వ‌న‌రులు)
నేషనల్ మిషన్ ఫర్ ఎ వై యు ఎస్ హెచ్ (జాతీయ ఎ వై యు ఎస్ హెచ్ కార్య‌క్ర‌మం)
16 రాష్ట్రీయ స్వాస్థ్య సుర‌క్ష యోజ‌న (పాత ఆర్ ఎస్ బి వై)
17 నేషనల్ ఎడ్యుకేషన్ మిషన్- ఎన్ ఇ ఎమ్ (జాతీయ విద్యా కార్య‌క్ర‌మం)
సర్వ శిక్షా అభియాన్
రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్
టీచర్స్ ట్రయినింగ్ అండ్ అడల్ట్ ఎడ్యుకేషన్ (ఉపాధ్యాయ శిక్షణ మరియు వయోజన విద్య)
రాష్ట్రీయ ఉచ్చ్ శిక్షా అభియాన్
18 మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ (మధ్యాహ్న భోజన కార్యక్రమం)
19 ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్ మెంట్ సర్వీసెస్ (సమగ్ర శిశు వికాస సేవలు)
అంగన్ వాడీ సేవలు
నేషనల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ (జాతీయ పౌష్టికాహార ఉద్యమం)
మెటర్నిటీ బెనిఫిట్స్ ప్రోగ్రామ్ (ప్రసూతి ప్రయోజనాల కార్యక్రమం)
స్కీమ్ ఫర్ అడాలసెంట్ గల్స్ (కిశోర ప్రాయంలోని బాలికల కోసం పథకం)
ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ (సమగ్ర శిశు రక్షణ పథకం)
నేషనల్ క్రెశ్ స్కీమ్ (జాతీయ శిశుసదన పథకం)
20 మిషన్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఎంపవర్ మెంట్ ఫర్ విమిన్.. మహిళల సాధికారిత మరియు రక్షణకు ఉద్యమం (బేటీ బచావో-బేటీ పఢావో, వన్-స్టాప్ సెంటర్, విమిన్ హెల్ప్ లైన్, వసతి గృహాలు, స్వాధార్ గృహ్, జెండర్ బడ్జెటింగ్ వగైరా..)
21 నేషనల్ లైవ్ లీ హుడ్ మిషన్- ఎన్ ఎల్ ఎమ్ (జాతీయ జీవనాధార ఉద్యమం)
నేషనల్ రూరల్ లైవ్ లీ హుడ్ మిషన్ (జాతీయ గ్రామీణ జీవనాధార ఉద్యమం)
నేషనల్ అర్బన్ లైవ్ లీ హుడ్ మిషన్ (జాతీయ పట్టణ జీవనాధార ఉద్యమం)
22 జాబ్స్ అండ్ స్కిల్ డెవలప్ మెంట్ (ఉద్యోగాలు మరియు నైపుణ్యాల అభివృద్ధి)
ఎంప్లాయ్ మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ స్ (ఉపాధి కల్సన కార్యక్రమాలు)
ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన
23 ఎన్వైరన్ మెంట్, ఫారెస్ట్రీ అండ్ వైల్డ్ లైఫ్ (ఇ ఎఫ్ డబ్ల్యు ఎల్)
నేషనల్ మిషన్ ఫర్ ఎ గ్రీన్ ఇండియా
ఇంటిగ్రేటెడ్ డెవలప్ మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హేబిటాట్స్ (వన్య ప్రాణి ఆవాసాల సమగ్ర అభివృద్ధి)
కన్సర్వేషన్ ఆఫ్ నేషనల్ రిసోర్సెస్ అండ్ ఇకో సిస్టమ్స్
నేషనల్ రివర్ కన్సర్వేషన్ ప్రోగ్రామ్
24 అర్బన్ రిజూవెనేషన్ మిషన్ (ఎ ఎమ్ ఆర్ యు టి మరియు స్మార్ట్ సిటీస్ మిషన్)
25 పోలీసు బలగాల ఆధునికీకరణ (భద్రతా సంబంధ వ్యయం కూడా కలుపుకొని)
26 న్యాయ వ్యవస్థ కోసం ప్రాథమిక సదుపాయాలు (గ్రామ న్యాయాలయాలు మరియు ఇ-కోర్టులు సహా)
(ఇ) ఐచ్ఛిక పథకాలు
27 సరిహద్దు ప్రాంత అభివృద్ధి కార్యక్రమం
28 శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్
క్ర‌మ‌ సంఖ్య . కేంద్ర‌ నిర్వ‌హ‌ణ‌లోని ప‌థ‌కాల (సి ఎస్ ఎస్‌ల) పేరు

నిధుల కేటాయింపు ఈ కింది విధంగా ఉంటుంది:
అత్యంత కీల‌క‌మైన ప‌థ‌కాలు:
ఈ శ్రేణిలోకి వ‌చ్చే ప‌థ‌కాల‌కు ప్ర‌స్తుత ఫండింగ్ విధానం య‌థాత‌థంగా కొన‌సాగుతుంది.

కీల‌కమైన ప‌థ‌కాలు:

(అ) ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు, మూడు హిమాల‌య‌ ప్రాంత రాష్ట్రాలు : కేంద్రం, రాష్ట్రాలు 90 : 10 నిష్ప‌త్తిలో నిధులు కేటాయిస్తాయి.
(ఆ) ఇత‌ర రాష్ట్రాలు : కేంద్రం, రాష్ట్రాలు 60 : 40 నిష్ప‌త్తిలో నిధులు కేటాయిస్తాయి.

(ఇ) కేంద్ర‌ పాలిత ప్రాంతాలు (చ‌ట్ట‌స‌భ‌లు లేనివి) : నూరు శాతం నిధులు కేంద్ర‌మే కేటాయిస్తుంది. చ‌ట్ట‌స‌భ‌లు గ‌ల కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న విధాన‌మే కొన‌సాగుతుంది.

 

ఐచ్ఛిక ప‌థ‌కాలు:
అ) ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు, మూడు హిమాల‌య‌న్ రాష్ట్రాలు: కేంద్ర‌ రాష్ర్ట‌ ప్ర‌భుత్వాల వాటా 80 : 20 నిష్ప‌త్తిలో ఉంటుంది.
ఆ) ఇత‌ర రాష్ట్రాలు: కేంద్ర‌ రాష్ర్ట‌ ప్ర‌భుత్వాల వాటా 50 : 50 నిష్ప‌త్తిలో ఉంటుంది. ৫০
ఇ) కేంద్ర‌ పాలిత ప్రాంతాలు: (i) చ‌ట్ట‌ స‌భ‌లు లేనివి – కేంద్రం 100 శాతం నిధులు కేటాయిస్తుంది. (ii) చ‌ట్ట‌ స‌భ‌లు గ‌లవి : కేంద్రం, కేంద్ర‌పాలిత ప్రాంతాల వాటా 80 : 20 నిష్ప‌త్తిలో ఉంటుంది.

రాష్ట్రాలు, కేంద్ర‌ పాలిత ప్రాంతాల‌కు ప‌థ‌కాల ఎంపిక‌లో స్వేచ్ఛ‌ మరియు ఫ్లెక్సి నిధులు:
అ. రాష్ట్రీయ కృషి వికాస్ యోజ‌న (ఆర్ కె వి వై) ప‌రిధిలో చేప‌ట్టే కార్య‌క్ర‌మాల ఎంపిక విష‌యంలో కేంద్ర మంత్రిత్వ శాఖ‌లు ఆయా రాష్ట్రాల‌కు త‌గిన స్వేచ్ఛను క‌ల్పించేందుకు సి ఎస్ ఎస్ రూప‌క‌ల్ప‌న‌లో త‌గు ఏర్పాట్లు చేశారు.
ఆ. ప్ర‌తి సి ఎస్ ఎస్ లోనూ నిధుల వినియోగంలో ఆయా రాష్ట్రాల‌కు, కేంద్ర‌ పాలిత ప్రాంతాల‌కు త‌గినంత స్వేచ్ఛ ఉండే నిధుల ప‌రిమాణాన్నిరాష్ట్రాల విష‌యంలో 10 నుంచి 25 శాతానికి, కేంద్ర‌ పాలిత ప్రాంతాల విష‌యంలో 30 శాతానికి పెంచారు. దీని వ‌ల్ల ఆయా రాష్ట్రాలు, కేంద్ర‌ పాలిత ప్రాంతాల అవ‌స‌రాల‌కు అనుగుణంగా సి ఎస్ ఎస్ లు అమ‌లుప‌ర‌చ‌గ‌లుగుతారు.

***