ప్రధాని శ్రీ నరేంద్రమోదీ కేంద్ర కేబినెట్ ను విస్తరించారు. 19 మందికి కొత్తగా సహాయమంత్రులుగా స్థానం కల్పించారు. పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ సహాయమంత్రిగా ఇండిపెండెంట్ హోదాలో పని చేస్తున్న శ్రీ ప్రకాష్ జవదేకర్ కు కేబినెట్ మంత్రిగా పదోన్నతి కల్పించారు. మొత్తం 20 మంది మంత్రుల చేత రాష్ర్టపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ ప్రమాణస్వీకారం చేయించారు.
రాష్ర్టపతి భవన్ లోని దర్బార్ హాలులో జరిగిన ప్రమాణస్వీకారోత్సవంలో ఉపరాష్ర్టపతి శ్రీ హమీద్ అన్సారీ, ప్రధాని శ్రీ నరేంద్రమోదీ,కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, శ్రీ అరుణ్ జైట్లీ, శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్, శ్రీ అనంత్ గీతే, శ్రీ సదానంద గౌడ, శ్రీమతి స్మృతి ఇరానీ, ఇతర కేంద్రమంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన 19 మంది మంత్రులు పది రాష్ర్టాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 15 మందికి పార్లమెంటు, రాష్ర్ట అసెంబ్లీల్లో లెజిస్లేటివ్ అనుభవం కూడా ఉంది. 10 మంది గతంలో వివిధ రాష్ర్టప్రభుత్వాల్లో మంత్రులుగా, అధికారులుగా పని చేశారు.
కొత్త మంత్రుల్లో తొమ్మిది మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఏడుగురు లా గ్రాడ్యుయేట్లు, ఇద్దరు బిజినెస్ గ్రాడ్యుయేట్లు, ఒక డాక్టర్ ఉన్నారు.
కొత్త మంత్రులు-వారి విద్యార్హత, అనుభవం వివరాలు
కొత్త కేబినెట్ మంత్రి
పేరు : .శ్రీ ప్రకాష్ జవదేకర్
జన్మించిన ప్రదేశం : పుణె, మహారాష్ర్ర్ట
జన్మించిన తేదీ : 1951, జనవరి 30
విద్యార్హత : బికామ్
నియోజకవర్గం : మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యత్వం
చట్ట సభల్లో గత అనుభవం
– 1990 నుంచి 2002 సంవత్సరాల మధ్య కాలంలో మహారాష్ర్ట శాసనమండలి సభ్యత్వం
– 2008 నుంచి రాజ్యసభ సభ్వత్వం
పాలనాపరమైన అనుభవం
– 2014 నవంబర్ నుంచి పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రిగా స్వతంత్ర హోదా
– 2014 మే-నవంబర్ నెలల మధ్య కాలంలో సమాచారం, ప్రసారాల శాఖ సహాయమంత్రిగా స్వతంత్ర హోదా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి
– 1995-99 సంవత్సరాల మధ్య కాలంలో మహారాష్ర్ట ప్రణాళికా బోర్డు కార్యనిర్వాహక అధ్యక్షుడు
సహాయమంత్రులు…
పేరు : శ్రీ ఫగన్ సింగ్ కులస్తే
జన్మించిన ప్రదేశం : బార్బతి, మండ్లా (జిల్లా), మధ్యప్రదేశ్
జన్మించిన తేదీ : 1959, మే 18
విద్యార్హత : ఎంఏ, బిఇడి, ఎల్ ఎల్ బి
నియోజకవర్గం : మండ్లా (ఎస్ టి) నియోజకవర్గం నుంచి 16వ లోక్ సభకు ఎన్నిక
చట్ట సభల్లో గత అనుభవం
– 1996 నుంచి 2004 సంవత్సరాల మధ్య కాలంలో నాలుగు సార్లు లోక్ సభకు ఎన్నిక
– 2012-14 సంవత్సరాల కాలంలో రాజ్యసభ సభ్యత్వం
పేరు : శ్రీ ఎస్ ఎస్ అహ్లూవాలియా
జన్మించిన ప్రదేశం : జేకే నగర్, బర్ద్వాన్ (జిల్లా), పశ్చిమ బెంగాల్
జన్మించిన తేదీ : 1951, జూలై 4
విద్యార్హత : బిఎస్ సి, ఎల్ ఎల్ బి
నియోజకవర్గం : డార్జిలింగ్ (పశ్చిమ బెంగాల్) నుంచి 16వ లోక్ సభకు ఎన్నిక
చట్ట సభల్లో గత అనుభవం : 1986, 1992, 2000, 2006 సంవత్సరాల్లో రాజ్యసభకు ఎన్నిక
పాలనాపరమైన అనుభవం : 1995 నుంచి 1996 మే నెల మధ్య కాలంలో కేంద్ర అర్బన్ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పదవి
పేరు : శ్రీ రాజెన్ గోహియన్
జన్మించిన ప్రదేశం : నాగాం, అస్సాం
జన్మించిన తేదీ : 1950, నవంబర్ 26
విద్యార్హత : బిఎ, ఎల్ ఎల్ బి
నియోజకవర్గం : నాగాం (అస్సాం) నుంచి 16వ లోక్ సభకు ఎన్నిక
చట్ట సభల్లో గత అనుభవం : 1999 తర్వాత నాలుగోసారి లోక్ సభకు ఎన్నిక
పేరు : శ్రీ సి ఆర్ చౌధరి
జన్మించిన ప్రదేశం : ధండ్లాస్, నాగపూర్, రాజస్తాన్
జన్మించిన తేదీ : 1948, మార్చి 1
విద్యార్హత : ఎంఏ
నియోజకవర్గం : నాగపూర్ నుంచి తొలిసారి లోక్ సభకు ఎన్నిక
గత అనుభవం : రాజస్తాన్ ప్రభుత్వంలో అధికారి
పేరు : శ్రీ మన్ సుఖ్ లక్ష్మణ్ భాయ్ మాండవీయ
జన్మించిన ప్రదేశం : హనోల్, భావనగర్ (జిల్లా), గుజరాత్
జన్మించిన తేదీ : 1972, జూన్ 1
విద్యార్హత : హయ్యర్ సెకండరీ
నియోజకవర్గం : 2012 నుంచి రాజ్యసభ సభ్యత్వం
చట్ట సభల్లో గత అనుభవం : 2002-07 మధ్య కాలంలో గుజరాత్ శాసనసభ సభ్యత్వం
పేరు : శ్రీ విజయ్ గోయెల్
జన్మించిన ప్రదేశం : ఢిల్లీ
జన్మించిన తేదీ : 1954, జనవరి 4
విద్యార్హత : ఎంకామ్, ఎల్ ఎల్ బి
నియోజకవర్గం : రాజ్యసభ నుంచి రాజ్యసభ సభ్యత్వం
చట్ట సభల్లో గత అనుభవం : 11,12,13 లోక్ సభల్లో ఢిల్లీలోని చాంద్ నీ చౌక్, సదర్ నియోజకవర్గాల నుంచి పార్లమెంటు సభ్యత్వం
పాలనాపరమైన అనుభవం : కేంద్రంలో కార్మిక, పార్లమెంటరీ వ్యవహారాలు, గణాంకాలు, పథకాల అమలు శాఖ, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి
పేరు : శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్
జన్మించిన ప్రదేశం : కిశ్మీదేశర్, బికనీర్ (జిల్లా), రాజస్తాన్
జన్మించిన తేదీ : 1953, డిసెంబర్ 20
విద్యార్హత : ఎంఏ, ఎల్ ఎల్ బి, ఎంబిఏ
నియోజకవర్గం : రాజస్తాన్ లోని బికనీర్ నుంచి 16వ లోక్ సభకు ఎన్నిక
చట్ట సభల్లో గత అనుభవం : 15వ లోక్ సభ సభ్యత్వం
పాలనాపరమైన అనుభవం : విశ్రాంత ఐఎఎస్ అధికారి
పేరు : శ్రీ రామ్ దాస్ అథావాలే
జన్మించిన ప్రదేశం : అగల్ గాంవ్, సంగ్లి (జిల్లా), మహారాష్ర్ట
జన్మించిన తేదీ : 1959, డిసెంబర్ 25
విద్యార్హత : అండర్ గ్రాడ్యుయేట్
నియోజకవర్గం : 2014 నుంచి మహారాష్ర్ట నుంచి రాజ్యసభ సభ్యత్వం
చట్ట సభల్లో గత అనుభవం : లోక్‌సభ సభ్యుడుగా రెండు సార్లు సభ్యత్వం
పేరు : శ్రీమతి అనుప్రియ సింగ్ పటేల్
జన్మించిన ప్రదేశం : కాన్పూర్, ఉత్తరప్రదేశ్
జన్మించిన తేదీ : 1981, ఏప్రిల్ 21
విద్యార్హత : బిఎ, ఎంబిఏ
నియోజకవర్గం : ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ నుంచి 16వ లోక్ సభకు తొలిసారిగా ఎన్నిక
చట్ట సభల్లో గత అనుభవం : 2012-2014 మధ్య కాలంలో శాసనసభ సభ్యత్వం
పేరు : శ్రీ అనిల్ మాధవ్ దావే
జన్మించిన ప్రదేశం : బార్ నగర్, ఉజ్జయిని, మధ్యప్రదేశ్
జన్మించిన తేదీ : 1956, జూలై 6
విద్యార్హత : ఎంకామ్
నియోజకవర్గం : మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యత్వం
చట్ట సభల్లో గత అనుభవం : 2009, 2010 సంవత్సరాల్లో రెండు సార్లు రాజ్యసభకు ఎన్నిక
పేరు : శ్రీ పిపి చౌధరి
జన్మించిన ప్రదేశం : భావి, జోధ్ పూర్ (జిల్లా), రాజస్తాన్
జన్మించిన తేదీ : 1953, జూలై 12
విద్యార్హత : బిఎస్ సి ఎల్ ఎల్ బి
నియోజకవర్గం : పాలి
పేరు : డాక్టర్ సుభాష్ రామారావు భామ్రే
జన్మించిన ప్రదేశం : మల్పూర్, ధూలే (జిల్లా), మహారాష్ర్ట
జన్మించిన తేదీ : 1953, సెప్టెంబర్ 11
విద్యార్హత : ఎంబిబిఎస్, ఎంఎస్ (జనరల్ సర్జరీ, సూపర్ స్పెషలైజేషన్-ఆంకో సర్జన్)
– గ్రాంట్ మెడికల్ కాలేజి (ముంబై) జెజె హాస్పిట్ ముంబై, టాటా కేన్సర్ హాస్పిటల్ ముంబైలో విద్యాభ్యాసం
నియోజకవర్గం : ధూలే
పేరు : ఎంజె అక్బర్
జన్మించిన ప్రదేశం : కలకత్తా, ఇప్పుడు కోల్కతా
జన్మించిన తేదీ : 1951, జనవరి 11
విద్యార్హత : బిఏ (ఆనర్స్) ఇంగ్లీష్, ప్రెసిడెన్సీ కాలేజి, కలకత్తా
నియోజకవర్గం : జార్ఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నిక
చట్ట సభల్లో గత అనుభవం : 1989 నుంచి 1991 మధ్య కాలంలో మధ్యప్రదేశ్ లోని కిషన్ గంజ్ నుంచి లోక్ సభకు ఎన్నిక
పేరు : శ్రీ రమేష్ చందప్ప జిగజినాగి
జన్మించిన ప్రదేశం : అథర్గా, బీజాపూర్, కర్ణాటక
జన్మించిన తేదీ : 1952, జూన్ 28
విద్యార్హత : బిఏ
నియోజకవర్గం : బీజాపూర్, కర్ణాటక
చట్ట సభల్లో గత అనుభవం
– 1998 నుంచి 1991 ఐదు సార్లు లోక్ సభ సభ్యత్వం
– 1983 నుంచి 1998 మధ్యలో మూడు సార్లు కర్ణాటక అసెంబ్లీ సభ్వత్యం
పాలనాపరమైన అనుభవం
– కర్ణాటక ప్రభుత్వ హోమ్, ఎక్సైజు శాఖల సహాయమంత్రి
– సాంఘిక సంక్షేమం, రెవిన్యూ శాఖల కేబినెట్ మంత్రి
పేరు : శ్రీ జస్వంత్ సింగ్ సుమన్ భాయ్ భాభోర్
జన్మించిన ప్రదేశం : దస, దహోద్ జిల్లా (గుజరాత్)
జన్మించిన తేదీ : 1966, ఆగస్టు 22
విద్యార్హత : బిఏ
నియోజకవర్గం : దహోద్, గుజరాత్
చట్ట సభల్లో గత అనుభవం : 1995 నుంచి 2014 మధ్యలో గుజరాత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యత్వం v
పాలనాపరమైన అనుభవం
– ఆహారం, పౌరసరఫరాల శాఖ డిప్యూటీ మంత్రి
– ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, అడవులు, పర్యావరణ, గిరిజనాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, కార్మిక, ఉపాధికల్పన, పంచాయత్ రాజ్, గ్రామీణ గృహనిర్మాణం
పేరు : డాక్టర్ మహేంద్రనాథ్ పాండే
జన్మించిన ప్రదేశం : పఖాపూర్, ఘజీపూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్
జన్మించిన తేదీ : 1957, అక్టోబర్ 15
విద్యార్హత : ఎంఏ (జర్నలిజం), బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్‌డి
నియోజకవర్గం : చందోలి, ఉత్తరప్రదేశ్
చట్ట సభల్లో గత అనుభవం : 1991-92 నుంచి 1996-2002 మధ్య కాలంలో యుపి అసెంబ్లీ సభ్యత్వం
పాలనాపరమైన అనుభవం
– యుపిలో గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి, ప్రణాళిక, పంచాయతీరాజ్ శాఖల సహాయమంత్రి
పేరు : శ్రీ పర్సోత్తమ్ రూపాలా
జన్మించిన ప్రదేశం : ఇస్వారియా, జిల్లా అమ్రేలి (గుజరాత్)
జన్మించిన తేదీ : 1954, అక్టోబర్ 1
విద్యార్హత : బిఎస్‌సి, బిఇడి
నియోజకవర్గం : 2016 జూన్ నుంచి గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యత్వం
చట్ట సభల్లో గత అనుభవం
– 2008-09 నుంచి రాజ్యసభ సభ్యత్వం
– 1991 నుంచి గుజరాత్ అసెంబ్లీ సభ్యత్వం
పాలనాపరమైన అనుభవం
– నర్మద, ఇరిగేషన్, నీటిసరఫరా, వ్యవసాయ శాఖల కేబినెట్ మంత్రి
పేరు : శ్రీ అజయ్ తమ్తా
జన్మించిన ప్రదేశం : అల్మోరా, ఉత్తరాఖండ్
జన్మించిన తేదీ : 1972, జూలై 16
విద్యార్హత : ఇంటర్మీడియెట్ (సైన్స్)
నియోజకవర్గం : ఉత్తరాఖండ్ అల్మోరా (ఎస్‌సి) నియోజకవర్గం నుంచి తొలిసారిగా లోక్ సభకు ఎన్నిక
చట్ట సభల్లో గత అనుభవం : 2007-12 నుంచి 2012-14 సంవత్సరాల మధ్య కాలంలో రెండు సార్లు ఉత్తరాఖండ్ అసెంబ్లీ సభ్యత్వం
పాలనాపరమైన అనుభవం
– 2008-09 సంవత్సరంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి
– 2007-08లో సహాయమంత్రి
పేరు : శ్రీమతి కృష్ణరాజ్
జన్మించిన ప్రదేశం : ఫైజాబాద్, ఉత్తరప్రదేశ్
జన్మించిన తేదీ : 1967, ఫిబ్రవరి 22
విద్యార్హత : అవధ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ
నియోజకవర్గం : ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా లోక్ సభకు ఎన్నిక
చట్ట సభల్లో గత అనుభవం : 1996-2002 నుంచి 2007-2012 సంవత్సరాల మధ్య కాలంలోరెండు సార్లు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సభ్యత్వం