Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేంద్రీయ ఆరోగ్య సర్వీసులకు చెందిన సబ్ కాడర్, బోధనేతర, ప్రజా ఆరోగ్య నిపుణుల, జనరల్ మెడికల్ ఆఫీసర్ల పదవీవిరమణ వయస్సు పరిమితి పెంపుదలకు మంత్రిమండలి ఆమోదం


కేంద్రీయ ఆరోగ్య సర్వీసుల (సి హెచ్ ఎస్) కు చెందిన పలు ఉద్యోగ విభాగాల పదవీవిరమణ వయస్సు పరిమితి పెంపుదల ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ ఉద్యోగ విభాగాలలో 1. కేంద్రీయ ఆరోగ్య సేవలకు చెందిన బోధనేతర మరియు ప్రజా ఆరోగ్య నిపుణుల పదవీవిరమణ వయస్సు పరిమితిని 62 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలకు పెంచడం జరిగింది. 2. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు (జి డి ఎమ్ ఒ లు)గా పని చేసే వైద్యులు- కేంద్రీయ ఆరోగ్య సేవల సబ్ కాడర్ పదవీవిరమణ వయస్సు ను 65 సంవత్సరాలకు పెంచడం జరిగింది.

ఈ నిర్ణయం వల్ల బోధనతేర సిబ్బందికి లబ్ధి చేకూరుతుంది. సి హెచ్ ఎస్ కు చెందిన సబ్ కాడర్స్ అయిన జి డి ఎమ్ ఒ లకు లబ్ధి చేకూరుతుంది. ఈ నిర్ణయంవల్ల రోగులకు ఆరోగ్య భద్రత లభిస్తుంది. వైద్య కళాశాలలలో విద్యాసంబంధ కార్యక్రమాలు మెరుగవుతాయి. ఆరోగ్య భద్రత సేవలకు చెందిన జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు సమర్థంగా జరుగుతుంది. ఈ నిర్ణయంవల్ల ఆర్ధికపరమైన సమస్యలేవీ వుండవు. ఎందుకంటే ఖాళీ అయ్యే పోస్టులను త్వరగా భర్తీ చేసి రోగులకు సేవలు అందించాల్సివుంటుంది కాబట్టి ఉద్యోగ కాల పరిమితిని పెంచడంవల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.

పూర్వ రంగం:

• 2006కు ముందు కేంద్రీయ ఆరోగ్య సేవల సబ్ కాడర్స్ పదవీవిరమణ వయస్సు పరిమితి 60 సంవత్సరాలు.

• సబ్ కాడర్స్ కు చెందిన నిపుణుల విభాగాల (అధ్యాపక, అధ్యాపకేతర, ప్రజా ఆరోగ్యం)- జి డి ఎమ్ ఒ సబ్ కాడర్ ను మినహాయించి- పదవీవిరమణ వయస్సు పరిమితిని 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచుతూ 2-11-2016 న జరిగిన మంత్రిమండలి అనుమతిని మంజూరు చేసింది. 2008 జూన్ 5న జరిగిన మంత్రిమండలి సమావేశంలో అనుమతిని మంజూరు చేసిన మేరకు.సబ్ కాడర్స్ కు చెందిన బోధనా సిబ్బంది పదవీవిరమణ వయస్సు పరిమితిని.. మరింతగా 62 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలకు.. పెంచారు. బోధన నిపుణుల కొరత భారీగా ఉండడంతో, ఈ అనుమతి మంజూరును బోధన నిపుణులకు పరిమితం చేయడమైంది. ఇది పరిపాలనా సిబ్బందికి వర్తించదు.