Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కృత్రిమ మేధ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల(సీఓఈ) ఏర్పాటును ప్రశంసించిన ప్రధాని


ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, సుస్థిర నగరాలపై పనిచేసే మూడు ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ)ల ఏర్పాటును ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. 

 

 

 

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర విద్యా శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ చేసిన ఒక పోస్ట్‌కు ఈ విధంగా స్పందించారు. 

 

 

 

 

“సాంకేతికత, ఆవిష్కరణ, కృత్రిమ మేధ రంగాల్లో అగ్రగామిగా ఎదిగే దిశగా భారత్ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది చాలా ముఖ్యమైన ముందడుగు. ఈ సీఓఈలు మన యువశక్తికి ఉపయోగపడతాయని, భవిష్యత్ వృద్ధికి భారతదేశాన్ని కేంద్రంగా మార్చడానికి దోహదం చేస్తాయని నేను విశ్వసిస్తున్నాను.”