Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కువైట్ యువరాజుతో ప్రధాని భేటీ

కువైట్ యువరాజుతో ప్రధాని భేటీ


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కువైట్ యువరాజు షేక్ సబా అల్ ఖలీద్ అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబాతో ఆదివారం సమావేశమయ్యారు. సెప్టెంబరులో యూఎన్జీఏ సమావేశం సందర్భంగా యువరాజుతో తన ఇటీవలి సమావేశాన్ని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు.

కువైట్ తో ద్వైపాక్షిక సంబంధాలకు భారత్ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలు బాగా పురోగమిస్తున్నాయన్న ఇరువురు నేతలూ.. అవి వ్యూహాత్మక భాగస్వామ్యంగా పరిణామం చెందడాన్ని స్వాగతించారు. ఐక్యరాజ్యసమితి, ఇతర బహుపాక్షిక వేదికలపై ఇరుపక్షాల మధ్య సన్నిహిత సమన్వయం ప్రాధాన్యాన్ని వారు ప్రముఖంగా చర్చించారు. కువైట్ నేతృత్వంలో భారత్ – జీసీసీ సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తంచేశారు.

వీలు చూసుకుని భారత్ ను సందర్శించవలసిందిగా గౌరవనీయ కువైట్ యువరాజును ప్రధానమంత్రి ఆహ్వానించారు.

కువైట్ యువరాజు ప్రధానమంత్రి గౌరవార్థం విందు ఏర్పాటు చేశారు.