Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కువైట్ యువరాజుతో ప్రధాన మంత్రి సమావేశం

కువైట్ యువరాజుతో ప్రధాన మంత్రి సమావేశం


 ఐక్యరాజ్యసమితి సాధారణ సభ (యుఎన్‌జిఎ) 79వ సమావేశం న్యూయార్క్ లో ఈ రోజున జరిగిన సందర్భంగా కువైట్ యువరాజు శ్రీ షేఖ్ సబాహ్ ఖాలీద్ అల్హమద్ అల్ముబారక్ అల్సబాహ్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారువీరు ఇరువురు సమావేశం కావడం ఇదే మొదటి సారి.

కువైట్ తో ద్వైపాక్షిక సంబంధాలకు భారత్ అత్యంత ప్రాధాన్యాన్నిస్తోందని ప్రధాని తెలిపారు. రెండు దేశాల మధ్య బలమైన చరిత్రాత్మక సంబంధాలతో పాటు ఇరు దేశాల ప్రజల మధ్య నెలకొన్న బంధాన్ని ఇద్దరు నేతల మధ్య ప్రస్తావనకు వచ్చింది. ఇంధన రంగంలోనుఆహార భద్రత రంగంలోను ఇరు దేశాలు సహకరించుకోవడంపై మాట్లాడుకున్నారుఈ ద్వైపాక్షిక బంధాలను ఉభయ దేశాల పరస్పర లబ్ధి కోసం మరింత గాఢంగావైవిధ్య భరితంగా తీర్చిదిద్దుకోవాలన్న దృఢ సంకల్పాన్ని వారు వ్యక్తం చేశారు. కువైట్ లో అతి పెద్ద ప్రవా సముదాయంగా ఉన్న భారతీయుల అభ్యున్నతికి సహకరిస్తున్నందుకు యువరాజుకు ప్రధాని ధన్యవాదాలను తెలియజేశారు.

రెండు దేశాల నేతల మధ్య జరిగిన ఈ సమావేశం భారత్కువైట్ ద్వైపాక్షిక బంధానికి సరికొత్త వేగాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.