Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కువైట్ పర్యటనకు ముందు ప్రధాని సందేశం

కువైట్ పర్యటనకు ముందు ప్రధాని సందేశం


’’గౌరవనీయ కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్అహ్మద్ అల్జబేర్ అల్సభా ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం నేను ఈ రోజు కువైట్ బయల్దేరుతున్నాను.

కువైట్‌తో తరతరాలుగా పెంపొందించుకున్న చరిత్రాత్మక సంబంధానికి మేం ఎంతో విలువ ఇస్తున్నాంమా మధ్య వాణిజ్యఇంధన పరంగా పటిష్టమైన భాగస్వామ్యం మాత్రమే కాదు.. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతిభద్రతస్థిరత్వంశ్రేయస్సు దిశగా కలిసి కృషి చేస్తున్నాం.

గౌరవనీయ కువైట్ అమీర్యువరాజుప్రధానమంత్రులతో సమావేశాల కోసం నేను ఎదురుచూస్తున్నానుమన ప్రజలుప్రాంత ప్రయోజనాల కోసం భవిష్యత్ భాగస్వామ్యం దిశగా ప్రణాళికలను రూపొందించడానికి ఇది ఒక అవకాశం.

రెండు దేశాల మధ్య స్నేహ బంధాన్ని బలోపేతం చేయడంలో ఎంతగానో దోహదపడిన కువైట్‌ భారతీయ ప్రవాసులను కలవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

గల్ఫ్ ప్రాంతంలో ప్రధాన క్రీడా కార్యక్రమయిన అరేబియన్ గల్ఫ్ కప్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించిన కువైట్ నాయకత్వానికి నా కృతజ్ఞతలుక్రీడాపరంగా అత్యున్నతమైనప్రాంతీయ ఏకతా వేడుకలో భాగమవ్వడం కోసం నేను ఎదురు చూస్తున్నాను.

ఈ పర్యటన భారత్కువైట్ ప్రజల మధ్య సత్సంబంధాలుస్నేహ బంధాలను మరింత బలోపేతం చేస్తుందన్న విశ్వాసం నాకుంది’’